Home Film News Naga Chaitanya: టబు, నాగార్జున‌ల మ‌ధ్య ఉన్న ఆ రిలేష‌న్ నిజ‌మేనంటూ నాగ చైత‌న్య స్ట‌న్నింగ్ కామెంట్స్
Film NewsGossips

Naga Chaitanya: టబు, నాగార్జున‌ల మ‌ధ్య ఉన్న ఆ రిలేష‌న్ నిజ‌మేనంటూ నాగ చైత‌న్య స్ట‌న్నింగ్ కామెంట్స్

Naga Chaitanya: సినిమా ఇండ‌స్ట్రీలో కొంత మంది హీరో, హీరోయిన్స్ మ‌ధ్య సమ్‌థింగ్ స‌మ్‌థింగ్ న‌డుస్తుంది అంటూ అనేక ప్ర‌చారాలు జ‌రుగుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే వాటిలో ఎంత నిజం ఉంద‌నేది ప‌క్క‌న పెడితే పుకార్లు మాత్రం బాగా పుట్ట‌కొస్తుంటాయి. ఇలా నాగార్జున‌, ట‌బు మ‌ధ్య ఏదో ఉంద‌ని గత కొన్ని సంవ‌త్స‌రాలుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. నాగార్జున‌, ట‌బు  కలిసి అప్పట్లో ‘నిన్నే పెళ్లాడతా’ అనే సినిమా లో క‌లిసి నటించారు.ఈ సినిమా షూటింగ్ సమయం లోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని అప్పటి మీడియా లో తెగ ప్ర‌చారం జ‌రిగింది. వీళ్లకు సంబంధించిన ప్రైవేట్ ఫోటోలు అప్పట్లో లీక్ కావ‌డంతో ప్ర‌చారం మ‌రింత జోరుగా సాగింది.

అమ‌ల‌కి కూడా నాగార్జున‌, ట‌బు రిలేష‌న్ గురించి తెలుస‌ని అయిన కూడా ఆమె సైలెంట్‌గా ఉండిపోయింద‌ని కొంద‌రు చెప్పుకొచ్చారు. అయితే నాగార్జున మరియు టబు మధ్య ఉన్న రిలేషన్ గురించి తాజాగా నాగార్జున తనయుడు అక్కినేని నాగ చైతన్య ఓపెన్ అయ్యారు. ఇండస్ట్రీ నుండి మా కుటుంబానికి ఎంతో స‌న్నిహితంగా ఉండే వ్యక్తి హీరోయిన్ టబు గారు. మా ఫ్యామిలీ మొత్తానికి ఆమె నేను చిన్నతనం లో ఉన్నప్పటి నుండి చాలా క్లోజ్. సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వ్య‌క్తిలా కాకుండా ఒక సొంత కుటుంబ స‌భ్యురాలిగా మాతో క‌లిసి మెలిసి పోయేవారు.ఇప్పటికీ కూడా పండగల సమయంలో మా ఇంటికి ఫోన్ చేసి విషెస్ చెబుతూ ఉంటారు.

హైదరాబాద్ కి వచ్చినప్పుడల్లా మా నాన్న గారిని  అలానే మమల్ని కలుస్తూనే ఉంటుంది అని నాగ చైతన్య చెప్పుకొచ్చాడు.ఈ మాట‌లు విన్న నెటిజన్స్  టబు కి నాగార్జున‌కి  మధ్య అప్పట్లో నిజంగానే ప్రేమాయణం నడిచిందా? అని అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.  టబు ఇప్పటికి ఒంటరిగా ఉండగా, నాగార్జున  రెండో వివాహంగా అమల అక్కినేనిని వివాహం చేసుకున్నాడు. వీరికి  అఖిల్ అక్కినేని అనే కుమారుడు ఉన్నారు. మ‌నోడు సినిమాల‌లో మంచి హిట్ కోసం ఎంతో ట్రై చేస్తున్న ఆ స‌క్సెస్ అనేది దొర‌క‌డం లేదు. ఇక  అమల కంటే ముందు, నాగార్జున ..లక్ష్మి దగ్గుబాటిని వివాహం చేసుకున్నాడు.. వారికి నాగ చైతన్య జ‌న్మించాడు. ఇతను హిట్, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...