Home Film News Varun Tej’s Wedding: వ‌రుణ్ తేజ్ పెళ్లికి టాలీవుడ్ నుండి ఆ జంట‌కి మాత్ర‌మే ఆహ్వానం..!
Film News

Varun Tej’s Wedding: వ‌రుణ్ తేజ్ పెళ్లికి టాలీవుడ్ నుండి ఆ జంట‌కి మాత్ర‌మే ఆహ్వానం..!

Varun Tej’s Wedding: మెగా హీరో వ‌రుణ్ తేజ్ దాదాపు ఐదారేళ్ల పాటు ప్రేమాయ‌ణం న‌డిపి జూన్ 9న సైలెంట్‌గా నిశ్చితార్థం జ‌రుపుకున్నాడు. ఆరేళ్ల‌పాటు ప్రేమ‌లో ఉన్న వీరు ఎక్క‌డా కూడా త‌మ ప్రేమ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టలేదు. ఎక్క‌డా కూడా ఆ మేట‌ర్ లీక్ కాకుండా చాలా జాగ్ర‌త్త‌ప‌డ్డారు. మ‌ధ్య‌మ‌ధ్య‌లో ప్ర‌చారాలు సాగిన కూడా వాట‌ని రూమ‌ర్స్‌గా ఖండించారు.అయితే ఎంగేజ్‌మెంట్‌తో అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది.ఇక  వ‌రుణ్ తేజ్ పెళ్లి ఎప్పుడు, ఆయ‌న పెళ్లి గెస్ట్స్ ఎవ‌రు, ఇలాంటి విష‌యాల గురించి తెగ చర్చ న‌డుస్తుంది. గాండీవ‌ధారి అర్జున సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా వ‌రుణ్ తేజ్ త‌న సినిమాకి సంబంధించిన విష‌యాల‌తో పాటు ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యాల‌ని కూడా షేర్ చేసుకున్నాడు.

త‌న ప్రేమ‌, పెళ్లికి సంబంధించిన కొన్ని సంగ‌తులు పంచుకున్నాడు. అయితే వ‌రుణ్ తేజ్ పెళ్లి  ఆగస్టులో   ఉంటుందని ముందుగా  ఊహాగానాలు వినిపించాయి. అయితే నిహారిక విడాకుల వ‌ల‌న కొన్ని రోజుల పాటు వాయిదా వేసిన‌ట్టు స‌మాచారం. నవంబర్ లేదా డిసెంబర్  లో త‌మ పెళ్లి ఉంటుందని వరుణ్ తేజ్   రీసెంట్‌గా చెప్పారు. పెళ్లి ఎప్పుడనేది అమ్మ నిర్ణయమే, ఆమె డిసైడ్ చేస్తారని వ‌రుణ్ పేర్కొన్నాడు. ఇక తనది డెస్టినేషన్ వెడ్డింగ్ అని చెప్పిన వ‌రుణ్ తేజ్ త‌న పెళ్లికి లిమిటెడ్ గెస్ట్స్ ని మాత్ర‌మే ఆహ్వానిస్తున్నార‌ట‌.  మెగా హీరోలు, కుటుంబ సభ్యులు , టాలీవుడ్ ప్రముఖుల్లో అత్యంత సన్నిహితులను మాత్ర‌మే ఈ పెళ్లికి పిలుస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే గెస్ట్స్ లిస్ట్ ప్రిపేర్ చేసిన‌ట్టు తెలుస్తుండ‌గా,  వరుణ్ కి సన్నిహితుడైన నితిన్ కి కూడా  ఆహ్వానం అందిన‌ట్టు తెలుస్తుంది.. నితిన్ భార్య షాలినితో  వరుణ్ తేజ్ వివాహానికి ఇట‌లీకి వెళ్లనున్నాడ‌ని టాలీవుడ్ వర్గాల్లో  ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఎంగేజ్‌మెంట్ మాదిరిగానే త‌న పెళ్లి కూడా సింపుల్‌గా చేసుకోవాల‌ని వ‌రుణ్ తేజ్ భావిస్తున్నాడ‌ట‌. నిహారిక పెళ్లి అనుభ‌వాల‌తోనే వ‌రుణ్‌తేజ్ ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్నాడా అని కొంద‌రు అనుమానం వ్య‌క్తం చేశారు. ఇక  లావణ్యతో ప్రేమ వ్యవహారంపై స్పందించిన వ‌రుణ్ తేజ్  మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోయానని, తానే మొదట ప్ర‌పోజ్ చేశాన‌ని వరుణ్ చెప్పాడు.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...