Home Film News Balayya: ఏంటి.. చిరంజీవిని ఇబ్బంది పెట్టే ప్లాన్ బాల‌య్య చేస్తున్నాడా…!
Film News

Balayya: ఏంటి.. చిరంజీవిని ఇబ్బంది పెట్టే ప్లాన్ బాల‌య్య చేస్తున్నాడా…!

Balayya: నంద‌మూరి బాల‌య్య వ‌య‌స్సు పెరుగుతున్న కొద్ది త‌న క్రేజ్ పెంచుకుంటున్నాడు. ఒక‌వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు హోస్ట్ గాను అద‌ర‌గొడుతున్నాడు. ఇప్ప‌టికే అన్‌స్టాప‌బుల్ టాక్ షోలో చాలా మంది స్టార్ హీరోలతో నానా ర‌చ్చ చేసిన బాల‌య్య ఇప్పుడు త‌దుప‌రి సీజ‌న్‌లో కూడా ర‌చ్చ చేయ‌బోతున్నాడు.  అస‌లు బాలయ్య వ్యాఖ్యాతగా అన్ స్టాపబుల్ టాక్ షో ప్రకటించగా అంద‌రు అది స‌క్సెస్ కాద‌ని అన్నారు. కాని అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ ఈ షో మంచి హిట్ కొట్టింది. తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో ప్రసారమైన అన్ స్టాపబుల్ సీజన్ 1, 2 సూపర్ స‌క్సెస్ కావ‌డ‌మే కాకుండా  భారీ టీఆర్పీతో నేషనల్ వైడ్ రికార్డులు సాధించింది ముఖ్యంగా  బాలయ్య మాటతీరు, మేనరిజమ్స్, ప్రశ్నలు అంద‌రిని ఎంత‌గానో ఆకట్టుకున్నాయి

అన్‌స్టాప‌బుల్ షోలో బాల‌య్య‌.. టాలీవుడ్ టాప్ హీరోలు అయిన  మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి టాప్ స్టార్స్ ని ఇంటర్వ్యూ చేశాడు. వారితో బాల‌య్య చేసిన సంద‌డి మాములుగా లేదు. ఇక ఆయ‌న ఇంట‌ర్వ్యూ చేయాల్సి క్రేజీ స్టార్స్ మ‌రి కొంద‌రు ఉండ‌గా, వారిలో చిరంజీవి, ఎన్టీఆర్ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.  చిరంజీవితో బాలయ్య ఎపిసోడ్ కి రంగం సిద్దమైందన్న ప్ర‌చారం జ‌రుగుతుంది. అన్‌స్టాపబుల్ సీజ‌న్ 3లో తొలి గెస్ట్‌గా చిరంజీవి రాబోతున్నాడ‌ని, ఆయ‌న‌ని బాల‌య్య ఆస‌క్తికర ప్ర‌శ్న‌లు అడ‌గ‌బోతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది.

చాలాకాలం తర్వాత ఒకే వేదికపైకి చిరంజీవి-బాలయ్య వ‌స్తే అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. ఇక ఈ ఇంట‌ర్వ్యూలో బాల‌య్య‌..  ప్రజారాజ్యం ప్రస్తావన దాని వైఫల్యం గురించి త‌ప్ప‌క ప్ర‌శ్నిస్తాడ‌ని అంటున్నారు. వాటితో పాటు కొన్ని కాంట్ర‌వ‌ర్సీలు కూడా ప్ర‌స్తావ‌న తెచ్చే అవ‌కాశం లేక‌పోలేదు అని అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే బాల‌య్య‌.. చిరంజీవిని ఉద్దేశిస్తూ మా బ్లడ్ వేరు బ్రీడ్ వేరు అంటూ వివాదాస్పద కామెంట్స్ చేశారు. బాలయ్య తీరును నాగబాబు 2019 ఎన్నికలకు ముందు సిరీస్ ఆఫ్ వీడియోలతో ఎండగట్టారు. ఆ ఇష్యూ త‌ర్వా చిరు-బాల‌య్య ఎదురెదురుగా మాట్లాడుకోబోతుండం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మార‌నుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...