Home Film News మహేష్ గుంటూరు కారం సెన్సార్ టాక్ రివ్యూ.. గుంటూరు కారం ఘాటు అదిరిపోయిందిగా గురు..!
Film News

మహేష్ గుంటూరు కారం సెన్సార్ టాక్ రివ్యూ.. గుంటూరు కారం ఘాటు అదిరిపోయిందిగా గురు..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట‌ సినిమా తర్వాత స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. దాదాపు రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత మహేష్- త్రివిక్రమ్ దగ్గర నుంచి వస్తున్న సినిమా కావటంతో ఇప్పటికే ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరో వారం రోజుల్లో అనగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.

Guntur Kaaram: మహేష్ బాబు గుంటూరు కారం నుంచి సెకండ్ సాంగ్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే - Telugu News | Fans are eagerly waiting for the second song update from Mahesh Babu Guntur Karam movie | TV9 ...

మహేష్ కు జంటగా శ్రీలీల‌- మీనాక్షి చౌదరి హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ కూడా ప్రేక్షకులకు సినిమాపై అంచనాలను పెంచేసాయి. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్, ఆడియో రైట్స్ కూడా భారీ ధ‌రకు అమ్ముడుపోయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా థియాట్రికల్ రైట్స్ దాదాపూ రూ.150 కోట్లకు అమ్ముడుపోయాయి.. ప్రపంచవ్యాప్తంగా థియాట్రికల్ రైట్స్ రూ.155 కోట్లకు క్లోజ్ అయ్యాయి. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని మహేష్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

అంతేకాకుండా ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు మంచి పూనకాలు తప్పించే విధంగా ఉంటుందని మహేష్ మేనరిజం కూడా ఈ సినిమాలో అదిరిపోయిందని ఇప్పటికే టాక్ అయితే ఉంది. తాజాగా ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి U/A సర్టిఫికెట్ వచ్చింది. ఈ సినిమా రన్ టైం విషయానికి వస్తే రెండు గంటల 42 నిమిషాల నిడివి ఉంటుంది అంటూ తెలుస్తుంది. ఈ సినిమా చూసిన సెన్సార్ బోర్డ్ సభ్యులు చాలా కాలం తర్వాత మహేష్ బాబు ద‌గ్గ‌ర నూంచి పోకిరి తరహాలో ఓ మాస్ సినిమా చూస్తున్నామని అన్నారు.

మహేష్ గత సినిమా సర్కారు వారి పాట మూవీలో కూడా మాస్‌ పాత్రలో నటించిన.. ఇందులో మాత్రం మాస్ ప్రేక్షకులకు కచ్చితంగా పూనకాలు తప్పించేలా ఉన్న‌రు. పైగా ఈ సినిమా కథ కూడా ఎవరు ఊహించిన విధంగా ఎంతో కొత్తగా ఉందని.. ఈ సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ అవుతుందని సెన్సార్ సభ్యుల నుంచి టాక్ బయటకు వచ్చింది. ఇక మరి మహేష్ గుంటూరు కారం సినిమాతో సంక్రాంతికి ఎలాంటి రికార్డులను తన ఖాతాలో వేసుకుంటాడు చూడాలి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...