Home Film News Pooja Hegde: వ‌రుస ఫ్లాపులు ప‌ల‌క‌రిస్తున్నా కూడా త‌లుపు తడుతూనే ఉన్న ఆఫ‌ర్స్
Film News

Pooja Hegde: వ‌రుస ఫ్లాపులు ప‌ల‌క‌రిస్తున్నా కూడా త‌లుపు తడుతూనే ఉన్న ఆఫ‌ర్స్

Pooja Hegde: చిన్న హీరోయిన్‌గా తెలుగు తెర‌కి ప‌రిచ‌య‌మై పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది పూజా హెగ్డే. ముంబైలో సెటిల్ అయిన కర్ణాటకకు చెందిన దంపతులకు జన్మించిన పూజా హెగ్డే మొద‌టి రోజుల నుండి కూడా సినిమాల‌పై ఎంతో ఆస‌క్తిని పెంచుకుంది. ఈ క్ర‌మంలోనే మోడ‌లింగ్‌లోకి అడుగుపెట్టి అనంత‌రం హీరోయిన్‌గా త‌న అదృష్టం ప‌రీక్షించుకుంది. మొదటి రెండు మూడు సినిమాల్లో కాస్త‌ పద్ధతిగా కనిపించిన ఈ భామ తర్వాత మాత్రం గ్లామ‌ర్ డోస్ పెంచి కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేసింది. 2014లో నాగ చైతన్య హీరోగా రూపొందిన‌ ఒక లైలా కోసం మూవీతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టింది.

ఆ త‌ర్వాత చేసిన ప‌లు చిత్రాలు పూజాకి నిరాశ‌ప‌రిచాయి. అర‌వింద స‌మేత చిత్రం నుండి ఈ అమ్మ‌డిని వ‌రుస హిట్స్ ప‌ల‌క‌రించాయి. మహర్షి, గద్దలకొండ గణేష్, అలవైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి చిత్రాలతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన ఈ భామ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ‘డీజే దువ్వాడ జగన్నాథం’ నుంచి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ వరకు… డబుల్ హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న పూజా హెగ్డే ఇటీవ‌ల మాత్రం వ‌రుస ఫ్లాపులు అందుకుంటుంది.ఈ అమ్మ‌డి నుండి వ‌చ్చిన ప్ర‌తి సినిమా కూడా ఫ్లాప్ టాక్ అందుకుంటుంది. ఈ క్ర‌మంలో ఆమె ప‌ని అయిపోయింద‌ని చాలా మంది చెప్పుకొస్తున్నారు.

కాని అంద‌రు అనుకున్న‌ట్టు పూజాకి ఆఫ‌ర్స్ ఏం త‌గ్గ‌లేదు. ఆమె కిట్టిలో ఇప్పుడు ఆరు సినిమాలు ఉన్న‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం మహేష్ బాబు సరసన ‘గుంటూరు కారం’ చిత్రంలో న‌టిస్తుంది. అది కాకుండా తమిళంలో ఓ సినిమా, కన్నడలో మరో సినిమా గురించి చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. హిందీ నుంచి స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఆమెకు ఛాన్సులు వస్తున్నా… వెంటనే ఓకే చెప్పడం లేదని అంటున్నారు. తన పాత్రతో పాటు కథ ఎలా ఉంది? కంటెంట్ కనెక్ట్ అయ్యేలా ఉందా? వంటి వాటి గురించి ఎక్కువ‌గా ఆలోచిస్తుంద‌ట‌. ఏదేమైన ఈ ఏడాది మొత్తం ఆరు సినిమాల షూటింగులు చేయాలని, ఒకట్రెండు నెలల్లో వరుసపెట్టి సినిమాలు అనౌన్స్ చేయనుంద‌ని అంటున్నారు.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...