Home Film News Star Hero: ఆ స్టార్ హీరో రోజుకు వంద సిగ‌రెట్స్ తాగుతాడా.. అవాక్క‌వుతున్న అభిమానులు..!
Film News

Star Hero: ఆ స్టార్ హీరో రోజుకు వంద సిగ‌రెట్స్ తాగుతాడా.. అవాక్క‌వుతున్న అభిమానులు..!

Star Hero: ఎంత పెద్ద స్టార్ హీరో అయిన కూడా వారికి కొన్ని వ్య‌సనాలు ఉంటాయి. కొంద‌రు సిగ‌రెట్స్ ఎక్కువ‌గా తాగితే మ‌రి కొంద‌రు మ‌ద్యం పుచ్చుకుంటారు. అయితే కాల‌క్ర‌మేణా వాటికి స్వ‌స్తి ప‌లికిన వారు కూడా లేక‌పోలేదు. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఒక‌ప్పుడు సిగ‌రెట్స్ చాలా తాగేవార‌ని చెబుతుంటారు. కాని త‌ర్వాత త‌ర్వాత వాటికి స్వ‌స్థి ప‌లికాడు. ఇక ఇప్పుడు ఓ స్టార్ హీరోకి సంబంధించిన విష‌యం నెట్టింట వైర‌ల్‌గా మారుతుంది. ఆ హీరో రోజుకి ఏకంగా 100 సిగ‌రెట్స్ తాగుతాడ‌ట‌. ఇది విని ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చ‌ర్యంలో మునిగి తేలుతున్నారు. ఇక ఆ స్టార్ ఎవ‌రో అనేదే క‌దా మీ డౌట్.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్, సపోర్టు లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి అనితర సాధ్యమైన ఫ్యాన్ ఫాలోయింగ్  తో పాటు స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకున్న షారూఖ్ ఖాన్.

బాలీవుడ్ అంటే మనకి వెంటనే గుర్తుకు వచ్చే పేరు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ పేరు. ఖాన్ త్ర‌యంలో ఒక‌రిగా పేరు తెచ్చుకున్న షారూఖ్ ఖాన్ .. ఎన్నో రొమాంటిక్  సినిమాలలో న‌టించి యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ మ‌న‌సులో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాడు. ఇండియన్ సినిమాకి ఇంత పెద్ద ఓవర్సీస్ మార్కెట్  వ‌చ్చింది అంటే అది షారుఖ్ ఖాన్ వ‌ల్లనే అని చెప్పాలి. ఆయన చేసిన సినిమాలు ఓవర్సీస్ లో అనేక‌ ప్రభంజనాలు సృష్టిస్తాయి.అయితే ఈ స్టార్ హీరోకి ఒక చెడు అల‌వాటు ఉంద‌ట‌, ఈ విష‌యాన్ని ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో తెలియ‌జేశారు.

షారుఖ్ ఖాన్ ప్రతీ నెల ట్విట్టర్ లో ‘#ASKSRK’ అనే లైవ్ చాట్ సెషన్  నిర్వ‌హిస్తూ ఉంటాడు. ఆ సెష‌న్‌లో అభిమానులు అడిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇస్తుంటాడు.  రీసెంట్ గా నిర్వహించిన లైవ్ చాట్ సెషన్ లో ఒక అభిమాని మీరు సిగరెట్స్ కాలుస్తారా అని ప్ర‌శ్నించ‌గా, దానికి షారూఖ్ స్పందిస్తూ.. ‘రోజుకి నేను వంద సిగరెట్లు తాగుతాను’ అని చెప్పుకొచ్చాడు. అన్నం , నీళ్లు లేకపోయినా ఉండగలను కానీ, సిగరెట్ లేకపోతే మాత్రం అస్స‌లు ఉండలేను, ఈ అలవాటు ని ఎంత మానుకోవాలి అనుకున్నప్ప‌టికీ అది జ‌ర‌గ‌డం లేదు.చిన్న కొడుకు పుట్టిన‌ప్ప‌టి నుండి ఆ అల‌వాటు మెల్ల‌గా త‌గ్గించుకుంటూ వ‌చ్చానని పేర్కొన్నాడు షారూఖ్‌.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...