Home Film News Varun Tej: వ‌రుణ్ తేజ్‌ని లావ‌ణ్య అంత మాట అనేసిందా.. ఆశ్చర్యంలో మెగా అభిమానులు
Film News

Varun Tej: వ‌రుణ్ తేజ్‌ని లావ‌ణ్య అంత మాట అనేసిందా.. ఆశ్చర్యంలో మెగా అభిమానులు

Varun Tej: గ‌త కొద్ది రోజులుగా ఎక్క‌డ చూసిన కూడా వ‌రుణ్ తేజ్ లావ‌ణ్య త్రిపాఠి గురించే చ‌ర్చ న‌డుస్తుంది. ఐదారేళ్లుగా ప్రేమ‌లో ఉన్న ఈ జంట ఇటీవల హైదరాబాదులో స్నేహితులు, కుటుం స‌భ్యుల మ‌ధ్య‌ నిశ్చితార్థం ఘ‌నంగా జ‌రుపుకున్నారు. మెగా కుటుంబంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతూనే ఉన్నాయి. ఇక రీసెంట్‌గా వరుణ్ తేజ్ త‌న‌ సోషల్ మీడియాలో ఓ కూల్ పిక్ ను పంచుకున్నాడు. తన మనసు దోచుకున్న లావణ్య త్రిపాఠీతో కలిసి ఫారెన్ లో విహరిస్తున్న ఫొటోని షేర్ చేస్తూ.. త‌మ‌కి శుభాకాంక్ష‌లు తెలియ‌జేసిన ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశాడు. ఈ పిక్ అయితే విశేషంగా ఆక‌ట్టుకుంటుంది.

ఎంగేజ్‌మెంట్ త‌ర్వాత లావ‌ణ్య త్రిపాఠి, వ‌రుణ్ తేజ్‌లకి సంబంధించిన అనేక విష‌యాలు కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారుతున్నాయి. ఎప్ప‌టి నుండో ప్రేమ‌లో ఉన్న ఈ జంట చాలా సైలెంట్ గా ఎక్కడ కూడా ర‌చ్చ‌ కాకుండా నిశ్చితార్థం వరకు చాలా సీక్రెట్ మెయింటైన్‌ చేసింది ఈ జంట. ఇక మ‌రి కొద్ది రోజుల‌లో పెళ్లి చేసుకోబోతున్న తరుణంలో… వీరి ప్రేమకు సంబంధించి ఎన్నో ముచ్చట్లను అభిమానులు ఇష్టంగా, ఆస‌క్తితో చర్చించుకుంటున్నారు. ముందుగా వీరి ప్రేమ ఎలా మొదలైంది ఇంకా ఏ సినిమాతో వీరీ ప్రేమ చిగురించింది ఇంకా ఇద్దరి ప్రేమ బయటపడినప్పుడు కుటుంబ సభ్యుల రియాక్షన్ ఏంటి… ఇలా అనేక రకాల విషయాలపై చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.

అయితే “మిస్టర్” సినిమా టైంలో లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ హైట్ పైన చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంటున్నాయి. ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన లావ‌ణ్య త్రిపాఠికి వరుణ్ తేజ్ హైట్ గురించి ప్రశ్న ఎదురైంది. ఏదైనా సమయంలో.. ఆయనతో ఇంకా సినిమాలు చేయాల్సి వస్తే కాళ్ళ కింద మరో బాక్స్ వేసుకొని నటించాల్సిన పరిస్థితి ఏర్ప‌డుతుంది అని పేర్కొంది. మ‌రి అప్పుడు అలా మాట్లాడిన లావ‌ణ్య త్రిపాఠి ఇప్పుడు అత‌నిని జీవిత భాగ‌స్వామిగా ఎంపిక చేసుకుంది. ఏదేమైన అప్ప‌ట్లో లావ‌ణ్య చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...