Home Film News Bimbisara: చిరు సినిమాల వలన బింబిసార సీక్వెల్ నుండి త‌ప్పుకున్న వశిష్ట్.. కొత్త ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే..!
Film News

Bimbisara: చిరు సినిమాల వలన బింబిసార సీక్వెల్ నుండి త‌ప్పుకున్న వశిష్ట్.. కొత్త ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే..!

Bimbisara: నంద‌మూరి హీరో క‌ళ్యాణ్ రామ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రం బింబిసార‌. టైం ట్రావెల్ కాన్సెప్టుతో మల్లిడి వశిష్ట తెరకెక్కించిన ఈ మూవీ అంచ‌నాల‌ని మించిన విజ‌యం సాధించింది. చిత్రానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మంచి స్పందన వచ్చింది. ఫలితంగా కలెక్షన్లు కూడా భారీగానే వ‌చ్చాయి.. మొత్తంగా రూ. 22 కోట్లకు పైగా లాభాలు కూడా దక్కించుకుని క‌ళ్యాణ్ రామ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది బింబిసార‌. అయితే చిత్ర రిలీజ్ సమయంలోనే దీనికి సీక్వెల్ కానీ, ప్రీక్వెల్ కానీ ఉంటుంద‌ని దర్శకుడు వశిష్ట వెల్లడించాడు. అందుకు అనుగుణంగానే బింబిసార సీక్వెల్ ప‌నులు మొద‌లు పెట్టారు.

బింబిసార సినిమా విడుదలై 10 నెలలు కంప్లీట్ అవుతున్నా. ఇంత వరకు సీక్వెల్ కు సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వంటివి ఏమి లేక‌పోవ‌డంతో సినిమా ఇక ఉండ‌దేమో అని అంద‌రు భావించారు. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ .. సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని తేల్చి చెప్పారు. అయితే సీక్వెల్ నుండి ద‌ర్శ‌కుడు వశిష్ట తప్పుకున్నట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. విశ్వ‌స‌నీయ వర్గాల సమాచారం ప్రకారం.. ‘బింబిసార 2’ మూవీని అతడు డైరెక్ట్ చేయడం లేదని, కేవలం స్క్రిప్టును మాత్రం ఇస్తున్నాడని వార్త‌లు వ‌స్తున్నాయి.ఈ దర్శకుడు చిరంజీవితో సినిమాకు కమిట్ అవడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అంటున్నారు.

‘బింబిసార’ సినిమా తర్వాత దర్శకుడు వశిష్ట్‌కి పెద్ద హీరోల సినిమా ఆఫ‌ర్స్ చాలానే వ‌చ్చాయట‌. ఇప్పటికే మెగాస్టార్ తో సినిమా ఖరారు అయ్యిందని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. చిరు సినిమా ఓకే కావ‌డంతో రెండు సినిమాలను మేనేజ్ చేయలేనని ‘బింబిసార-2 దర్శకత్వం బాధ్యతల నుంచి తప్పుకున్నాడ‌ట వశిష్ట్‌. అయితే క‌థ అందించ‌డంతో పాటు, స్క్రిప్ట్ వర్క్ లోనూ కీలక పాత్ర పోషించనున్నారని తెలుస్తుంది. అయితే చిత్రాన్ని ఎవ‌రు డైరెక్ట్ చేయ‌నున్నారంటే.. బింబిసార’ చిత్రానికి వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ గా వ్యవహరించిన అనిల్ పాడూరి . ఇత‌ను ఇప్పటికే ‘రొమాంటిక్’ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ మూవీ పెద్ద‌గా విజ‌యం సాధించ‌క‌పోయిన కూడా అత‌ని టాలెంట్‌కి క‌ళ్యాణ్ రామ్ ఫిదా అయ్యాడ‌ట‌.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...