Home Film News Ali Family: ఫ్లైట్ ప్రమాదం నుండి త‌ప్పించుకున్న ఆలీ ఫ్యామిలీ..ఎలా బ‌య‌ట‌ప‌డ్డారంటే..!
Film News

Ali Family: ఫ్లైట్ ప్రమాదం నుండి త‌ప్పించుకున్న ఆలీ ఫ్యామిలీ..ఎలా బ‌య‌ట‌ప‌డ్డారంటే..!

Ali Family: క‌మెడీయ‌న్ ఆలీ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు.చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆలీ ఆ త‌ర్వాత క‌మెడీయ‌న్‌గా, హీరోయిన్‌గా కూడా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్నాడు. హీరోగా కూడా ప‌లు సినిమాల‌తో అల‌రించాడు. ఇక ఇప్పుడు హోస్ట్‌గాను అలాగే రాజ‌కీయాల‌లోను యాక్టివ్‌గా ఉంటున్నాడు. ఇక ఇటీవ‌ల త‌న కూతురు పెళ్లిని ఘ‌నంగా జ‌రిపాడు ఆలీ. ఈ వేడుక‌కి ఇండ‌స్ట్రీకి సంబంధించిన వారు అలానే ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు హాజ‌ర‌య్యారు. ఆలీకి ఎంతో స్నేహంగా ఉండే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. రాక‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. గ‌త కొద్ది రోజులుగా ప‌వ‌న్, ఆలీ దూరంగా ఉంటున్న విష‌యం తెలిసిందే.

ప్ర‌స్తుతం ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా ఆలీ ప‌ని చేస్తున్నారు. అయితే  సినిమాలలోను రాజకీయాలలో ఎంతో బిజీగా ఉండే ఆలీ, ఆయ‌న  కుటుంబం ఇటీవ‌ల  ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డార‌ట‌. ఆలీ భార్య జుబేదా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ విష‌యాన్ని తెలియజేశారు.అసలు ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనే విషయాలన్నింటిని కూడా ఈమె ఈ వీడియో లో క్లియ‌ర్‌గా తెలియ‌జేసింది. ఈ వీడియో చూసిన వారు అస‌లు విష‌యం తెలుసుకొని అవాక్క‌వుతున్నారు. విష‌యంలోకి వెళితే  ఆలీ పెద్ద కుమార్తె ఫాతిమా, ఆమె అత్త మామ‌లు అమెరికా నుంచి వ‌చ్చారు. ఈ క్ర‌మంలో అంద‌రు  సరదాగా బయటకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు.

విమానంలో వారి ప్ర‌యాణం సరదాగా సాగుతుంది అనుకుంటున్న స‌మ‌యంలో  ఒక అలర్ట్ అయితే వచ్చిందని జుబేదా చెప్పారు. బయట భారీ వర్షం కారణంగా విమానం ప్రమాదంలో ఉందని  వారు అనౌన్స్ చేయడంతో ఒక్కసారిగా  అంద‌రు ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకున్నార‌ట‌. క్షేమంగా విమానం ల్యాంగ్ అవుతుందా లేదా అనే భ‌యం మాలో మొద‌లైంద‌ని, అర‌గంట సేపు అంద‌రం కంగారు ప‌డుతూనే ఉన్న స‌మ‌యంలో   విమానం సేఫ్ గా ల్యాండ్ అయింది. దీంతో  ఒక్కసారిగా మేము ఊపిరి పీల్చుకున్నామని  జుబేదా  తెలిపింది. మొత్తానికి త‌మ‌కు  తప్పిన పెను ప్రమాదం గురించి తెలియజేస్తూ జుబేదా షేర్ చేసిన వీడియో మాత్రం ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతుంది.  భగవంతుడి దయతోనే మేము ప్రమాదం నుంచి బయటపడ్డామని చెప్పిన ఈమె ఈ ప్రమాదం ఎప్పుడు జరిగిందనే విషయాన్ని మాత్రం స‌స్పెన్స్ లో పెట్టింది.

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...