Home Film News అల్లరి నరేష్ ‘నాంది’ని రీమేక్ చేయబోతున్న అజయ్ దేవగన్
Film News

అల్లరి నరేష్ ‘నాంది’ని రీమేక్ చేయబోతున్న అజయ్ దేవగన్

Ajay Devgn remaking Naandhi

IPC సెక్షన్ 211 ఆధారంగా తెరకెక్కిన చిత్రం నాంది. ఈ సినిమా తెలుగులో విజయాన్ని సాధించింది. చేయని నేరానికి జైలుకి వెళ్ళి శిక్షని అనుభవించే ఒక అమాయక సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. తనపై మోపబడిన నేరాన్ని ఒప్పుకునేలా చేసే ప్రయత్నాలు, జైలులో అతను ఎదుర్కున్న సమస్యలని చూపిస్తూ, చివరిగా అతను ఎలా బయటపడగలిగాడు అనేది కథాంశం. విజయ్ కనకమేడల డెబ్యూ డైరెక్టర్ గా అద్బుతంగా ఈ కథని ప్రేక్షకులకి చూపించాడు. సినిమా రిలీజ్ అయిన వెంటనే అంతటా పాజిటివ్ రివ్యూలు కనిపించాయి.

ఈ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చిన ఉన్నా.. ఈ సినిమా చాలా ప్రత్యేకంగా కనిపించడంతో మంచి బిజినెస్ చేయగలిగింది. హాస్య నటుడిగానే చేస్తూ వస్తున్న అల్లరి నరేష్ ఈ వైవిధ్యమైన పాత్రతో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. నరేష్ తో పాటు వరలక్ష్మి శరత్ కుమార్, ప్రియదర్శి. హరీష్ ఉత్తమన్, వినయ్ వర్మ ముఖ్యపాత్రల్లో కనిపించారు.

ఐతే, ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ లోకి వెళ్లనుంది. కథని ఇష్టపడిన అజయ్ దేవగన్ ఇందుకు సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో. అలాగే ఈ కథకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నట్లు కూడా ప్రకటించాడు. దేవగన్ ఇతర ప్రాజెక్ట్ లతో కూడా బిజీగా ఉన్నాడు. ఆర్ ఆర్ ఆర్ లో కూడా అజయ్ ఒక పాత్ర చేయబోతున్న విషయం మనకు తెలిసిందే.

ఇంకా సూర్యవంశీ, గంగూబయ్ కతివాడి సినిమా షూటింగ్స్ లో కూడా బిజీగా ఉన్నాడు. అలాగే, బోణీ కపూర్ నిర్మిస్తున్న మైదాన్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. సయ్యద్ అబ్దుల్ రహీమ్ ఇండియన్ ఫుట్ బాల్ ని డెవలప్ చేసిన వ్యక్తి. అతని జీవిత చరిత్ర ఆధారంగా బయోగ్రాఫికల్ డ్రామా చేయబోతున్నారు. ప్రియమణి ఇందులో ఫీమేల్ లీడ్ గా కనిపించనుంది. వీటన్నిటితో బిజీగా ఉన్న అజయ్.. నాంది సినిమా రీమేక్ తో బాలీవుడ్ అభిమానులని ఎలా ఇంప్రెస్ చేస్తాడో చూడాలి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...