Home Film News Nandamuri in Law: నంద‌మూరి అల్లుడు అయ్యే అవ‌కాశం మ‌హేష్ బాబుకి అలా మిస్ అయిందా?
Film News

Nandamuri in Law: నంద‌మూరి అల్లుడు అయ్యే అవ‌కాశం మ‌హేష్ బాబుకి అలా మిస్ అయిందా?

Nandamuri in Law: సూప‌ర్ కృష్ణ త‌న‌యుడు మ‌హేష్ బాబు ఇప్పుడు ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్న విష‌యం విదిత‌మే. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగారు. అయితే మ‌హేష్ బాబు త‌న ప‌నుల‌తో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి ప్ర‌త్యేక స‌మ‌యం కేటాయిస్తాడు. ఖాళీ స‌మ‌యం దొరికిన‌ప్పుడల్లా ఫ్యామిలీతో క‌లిసి విహార యాత్ర‌లకు వెళుతుంటాడు. ప్ర‌స్తుతం లండ‌న్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు. వారి టూర్‌కి సంబంధించిన ఫొటోల‌ని న‌మ్ర‌త ఎప్ప‌టిక‌ప్పుడు త‌న సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది. టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట‌ సినిమాల్లో నటిస్తున్నప్పుడు  ప్రేమించుకున్నారు.

పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు నమ్రత మహేష్.  2005 ఫిబ్రవరి 10న మహేష్- నమ్రత వివాహం కాగా, వీరి వివాహం జ‌రిగి 18 ఏళ్లు అయింది. ఇక  వీరి ప్రేమకు ప్రతిరూపంగా గౌతమ్, సితార జన్మించారు. మహేష్-నమ్రతల వివాహం జరిగిన తర్వాత నమ్రత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి త‌న‌ కుటుంబ బాధ్యతలు మాత్ర‌మే చూసుకుంటూ ఉంటుంది. ఇక ఈ జంట ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటుంది.బ‌య‌ట ఈ జంట పెద్ద‌గా క‌నిపించ‌రు కాని వెకేష‌న్స్ లో మాత్రం తెగ  సందడి చేస్తుంటారు. అయితే న‌మ్ర‌తని మ‌హేష్ చేసుకోక‌పోయి ఉంటే నంద‌మూరి అల్లుడు అయ్యే వాడంట‌.

సూపర్ స్టార్ కృష్ణ, ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్స్ కాగా, వారిద్ద‌రు బంధువులుగా కూడా మారాల‌ని అనుకున్నార‌ట‌. బాల‌య్య త‌న‌య అయిన‌ బ్రాహ్మణికి  కృష్ణ త‌న‌యుడు అయిన మహేష్ బాబు కి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు. అయితే మహేష్ బాబు.. త‌మ ప్రేమ గురించి బాల‌కృష్ణ‌కి చెప్పార‌ట‌. దీంతో ఇద్దరు ప్రేమికులను విడతీయడం కరెక్ట్ కాదని  భావించిన బాల‌కృష్ణ ఇక ఫోర్స్ చేయ‌లేదు. అదే మహేష్ బాబు నమ్రతల పెళ్లి జ‌ర‌గ‌క‌పోయి ఉంటే మహేష్ బాబు నందమూరి అల్లుడు అయ్యేవాడు. మ‌హేష్ నో చెప్ప‌డంతో బాల‌య్య‌.. నారా లోకేష్ తో బ్రాహ్మణికి వివాహం జ‌రిపించారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...