Home Film News Team RRR: ట్రిపుల్ ఆర్ టీంకి మ‌రో అరుదైన గౌర‌వం.. చాలా గ్రేట్ అంటూ ప్ర‌శంస‌లు
Film News

Team RRR: ట్రిపుల్ ఆర్ టీంకి మ‌రో అరుదైన గౌర‌వం.. చాలా గ్రేట్ అంటూ ప్ర‌శంస‌లు

Team RRR: భారతీయ సినిమా గౌర‌వాన్ని మ‌రింత‌గా పెంచిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ , అజ‌య్ దేవ‌గ‌ణ్‌, శ్రియ‌, అలియా భ‌ట్ ప్రధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. మార్చి 25,2022న ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్స్ సునామి సృష్టించింది. దేశ విదేశాల‌లో ఈ సినిమా సృష్టించి ప్ర‌భంజ‌నం అంతా ఇంతా కాదు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రఖ్యాత అవార్డ్‌లను సైతం గెలుచుకుంటూ వ‌స్తుంది. టాలీవుడ్‌కి అంద‌ని ద్రాక్ష‌గా ఉన్న ఆస్కార్‌ని సైతం ఈ చిత్రం గెలిచి చూపించింది.. 95 వ అకాడమీ అవార్డులలో ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు పాట‌కి  అవార్డ్ దక్కింది. సంగీత దర్శకుడిగా కీరవాణి, లిరిక్స్ అందించిన చంద్రబోస్‌కు ఆస్కార్ అవార్డ్ రావ‌డంతో తెలుగు ప్రేక్ష‌కుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి.

అయితే తాజాగా ట్రిపుల్ ఆర్ టీమ్ అరుదైన గౌర‌వం ద‌క్కంచుకుంది. ఆస్కార్ అకాడ‌మీ టీమ్ జ్యూరీలో  మొత్తం 398 మంది కొత్త సభ్యులకి చోటు కల్పిస్తున్నట్టు ప్రకటించగా.. వారిలో గ్లోబల్ స్టార్స్  ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌లు యాక్టింగ్ కేటగిరిలో స్థానం దక్కించుకున్నారు. వీరిద్ద‌రితో పాటు ఆస్కార్ విన్నర్స్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి , రచయిత చంద్రబోస్ తో పాటు ఈ సినిమాకి ప‌ని చేసిన‌ మరో టెక్నీషియన్స్ సెంథిల్, సాబు సిరిల్ అయితే కొత్త సభ్యులుగా చేరారు. దీంతో ఇప్పుడు ఇదొక గ్రేట్ మూమెంట్ అని పొగుడ్త‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్.

ఆర్ఆర్ఆర్ సినిమా ప‌లు భాష‌లలో విడద‌లై  ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్ల రూపాయల కలెక్షన్స్‌ను రాబట్టి  ఔరా అనిపించింది.. ప్ర‌స్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ (హిందీ), జీ5(తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం) లో స్ట్రీమింగ్ అవుతుంది.  చిత్రంలో  ఎన్టీఆర్ , రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు పోషించారు.ఆర్ఆర్ఆర్ తో సంచ‌ల‌నం సృష్టించిన రాజ‌మౌళి త్వ‌ర‌లో మ‌హేష్ బాబుతో భారీ బ‌డ్జెట్ చిత్రం చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ ద‌శ‌లో ఉంది.  ఈ సినిమా అడ్వెంచ‌ర్ మూవీగా రానుందని సమాచారం.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...