Home Reviews రివ్యూ: ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్!
Reviews

రివ్యూ: ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్!

in the name of god web series review

ప్రియదర్శి పులికొండ, నందినీ రాయ్ లతో తీసిన ఈ సిరీస్ ఇప్పుడు ఓ సంచలనంగా మారింది. ఇప్పటిదాకా వచ్చిన కథలకి కాస్త భిన్నంగా కనిపించడం ఇందుకు కారణం. వేరొకరి భార్య అయిన (మీనా) నందినీ రాయ్ పై ఆది (ప్రియదర్శి) కన్నేస్తాడు. ఆమె భర్త అయ్యప్ప(పోసాని కృష్ణ మురళి) అడల్ట్ సినిమాలు తీస్తూ బిజీగా ఉండిపోతాడు. అలా ఉన్నట్టుండి చంపివేయ బడ్డ అయ్యప్ప మర్డర్ కేస్ ఆది మీదకు వస్తుంది. అతని భార్య మీద ఆది పెంచుకున్న మోజుకి ఇప్పుడు ఈ నేరంలో నిందితుడిగా భావించబడ్డ అతను ఎలా బయటపడతాడు. ఇంతకీ అయ్యప్పని చంపింది ఎవరు అనేది ప్రధాన కథాంశం. ఇలాంటి కథని ఎంచుకోవడం కచ్చితంగా ఒక కొత్త ప్రయత్నమే కానీ దాన్ని ఎంతవరకు బాగా ముందుకు తీసుకెళ్లారు అనేది చూద్దాం.

ట్రైలర్ తోనే సినిమా కాస్త బోల్డ్ గా ఉంటుంది అని నిరూపించుకున్న ఈ సిరీస్ కి ఓవరాల్ రెస్పాన్స్ కూడా బాగానే ఉంది. రాజమండ్రి నేపథ్యంలో ఈ సినిమాని చిత్రీకరించారు. ప్రియదర్శి నటన ఎప్పటిలాగే చాలా బాగుంది. ఇక నందినీ రాయ్ విషయానికి వస్తే ఆమె పాత్రకి తగ్గట్టే ఇందులో బాగా నటించింది. తన అందాల్ని చూపిస్తూనే, కాస్త సంక్లిష్టంగా ఉన్న పాత్ర స్వభావాన్ని ఛాలెంజ్ గా తీసుకుని చేసినట్లు తెరపై స్పష్టంగా కనిపించింది. ఇక పోసాని గారిది ఇందులో పెద్దగా నటనకి ఆస్కారం లేని పాత్ర. ఆయన పర్వాలేదనిపించారు. విలన్ పాత్రలో కనిపించిన (థామస్) మొహమ్మద్ అలీ పర్వాలేదు అనిపించాడు కానీ ఇందులో అనవసర పాత్రల్ని కూడా మధ్యలో జొప్పించారు అనిపిస్తుంది. కథకు వాళ్ళు ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తులుగా కనిపిస్తారు. అక్కడ ఈ సిరీస్ మరింత బోరింగ్ గా అనిపిస్తుంది.

దీపక్ అలెగ్జాండర్ ఈ సిరీస్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. ఇకపోతే సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన వ్యక్తి.. వరుణ్ డీకే. ఈ సిరీస్ కి తన అద్భుతమైన సినిమాటోగ్రఫీతో ప్రేక్షకులని అబ్బురపరుస్తాడు. ఇక ఎడిటింగ్ చేసిన నిఖిల్ శ్రీ కుమార్ బోర్ కొట్టించాడు. తక్కువ బడ్జెట్ లో చేసిన ఈ సినిమాకి.. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో అతిగా జడ్జ్ చేయలేము. ఇక డైరెక్టర్ గురించి చెప్పుకోవాలి. విద్యా సాగర్ సినిమాని నేరేట్ చేయడానికి బాగా శ్రమించాడు అనిపించింది. స్క్రీన్ ప్లే సరిగా నడిపించి ఉంటే ఎక్కువగా బోర్ కొట్టించకుండా ఉండేది. కొన్ని సీన్ లని మరీ సాగదీసారు అనిపిస్తుంది. ఈ సిరీస్ ని మేకర్స్ టీమ్ థ్రిల్లర్ గా పరిచయం చేశారు కానీ అందులో పెద్దగా థ్రిల్ ఎక్కడా కనిపించదు. బోల్డ్ డైలాగ్స్ తో పాటు కథ రాసుకునే విషయంలో, ఎగ్జిక్యూట్ చేసే విషయంలో మరింత శ్రద్ధ తీసుకుని ఉంటే కచ్చితంగా మంచి హిట్ గా మారి ఉండేది. ఈ సిరీస్ లో పెద్ద మైనస్ అందులో వాడిన బూతులే అని చెప్పచ్చు. Too much is too bad అనేది ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. వీళ్ళు వాడిన బూతుల్ని వీళ్ళమీదే ప్రయోగిస్తూ మరీ తిట్టుకుంటున్నారు కొందరు జనం. చివర్లో మరీ బోరింగ్ గా ఉన్న ఎపిసోడ్స్ ని భరించే ఆసక్తి ఉంటే ఈ ”క్రైమ్ థ్రిల్లర్” ని తప్పక చూడండి.

Filmylooks Rating: 2.5/5

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Jailer Review: ‘జైలర్’ మూవీ రివ్యూ…ఫ్యాన్స్‌కి మంచి ఫీస్ట్‌

Jailer Review: సూపర్ స్టార్ రజినీకాంత్ యాక్ట్ చేసిన మూవీ జైలర్.. మాసివ్ డైరెక్టర్ నెల్సన్...

Bimbisara Review : బ్లాక్ బస్టర్ ‘బింబిసార’.. కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్!

Bimbisara Review: కళ్యాణ్ రామ్ హీరోగా తన హోమ్ బ్యానర్‌ ఎన్టీఆర్ ఆర్ట్స్‌లో బావ కె....

Virata Parvam : పోరాటానికీ, ప్రేమకీ మధ్య సంఘర్షణ

Virata Parvam: రానా దగ్గుబాటి, టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవి మెయిన్ లీడ్స్‌గా...

కమల్ నట విశ్వరూపం ‘విక్రమ్’

యూనివర్సల్ స్టార్, లోక నాయకుడు కమల్ హాసన్ కొంత గ్యాప్ తర్వాత ‘విక్రమ్’ మూవీతో ఆడియన్స్...