Home Film News అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ.. సుహాస్ బ్యాండు మోగించాడుగా?
Film NewsReviews

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ.. సుహాస్ బ్యాండు మోగించాడుగా?

టైటిల్‌:అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్
విడుదల తేదీ : ఫిబ్రవరి 2, 2024
నటీనటులు: సుహాస్, శరణ్య ప్రదీప్, నితిన్ ప్రసన్న, శివాని నాగరం, జగదీశ్ ప్రతాప్ బండారి, గోపరాజు రమణ, గాయత్రి భార్గవి, సురభి ప్రభావతి, కిట్టయ్య తదితరులు
దర్శకుడు : దుశ్యంత్‌ కటికినేని
నిర్మాతలు: ధీరజ్ మోగిలినేని
సంగీత దర్శకులు: శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీ: వాజిద్ బేగ్
ఎడిటింగ్: కొదాటి పవన్ కల్యాణ్

FLప‌రిచ‌యం:
నటుడుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని, హీరోగా మంచి ఫామ్ లోకి వస్తున్న సుహాస్ కథానాయకుడుగా తెరకెక్కిన తాజా మూవీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్.. ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాలో జరిగిన ఓ నిజ‌ సంఘటన ఆధారంగా వచ్చిన ఈ సినిమాతో దుష్యంత్ కటికనేని దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. షార్ట్ ఫిలిమ్స్ తో సోషల్ మీడియాలో మంచి క్రేజ్‌ తెచ్చుకున్న శివానీ నాగారం హీరోయిన్గా నటించిన తొలి సినిమా కూడా ఇదే. ఈ సినిమాకు విడుదల ముందు నుంచే ట్రైలర్, పాటలు ఈ సినిమాపై మంచి హైప్ తీసుకొచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా అదే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో ఇక్కడ తెలుసుకుందాం.

Ambajipeta Marriage Band First Review మైండ్ బ్లోయింగ్.. ఫస్టాఫ్  పగిలిపోయింది.. విజయ్ దేవరకొండ రివ్యూ | Ambajipeta Marriage Band First Review:  Vijay Deverakonda says Mind Blowing, First half Strong ...

కథ:
అంబాజీపేట అనే ఊరిలో వెంకట్( నితిన్ ప్రసన్న) ఆ ఊరికి పెద్ద మనిషిలా ఉంటూ.. ఆ ఊర్లో ఉన్న సగం మందికి పైగా పెద్దమనిషి అయిన వెంకట్ దగ్గర అప్పు తీసుకుని వడ్డెలు కట్టుకుంటూ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అదే ఊరిలో మల్లీ(సుహాస్) మ్యారేజ్ బ్యాండ్ లో పనిచేస్తుంటాడు. మళ్లీ అక్క పద్మ(శరణ్య) అదే ఊరిలో స్కూల్ టీచర్ గా వర్క్ చేస్తుంది. ఊరు పెద్ద వెంకట్ వాళ్ళనే పద్మ కి ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది. దాంతో పద్మ త‌నికి ఇష్టం లేకపోయినా ప్రతి ఆదివారం వెంకట్ దగ్గరికి వెళ్లి అతని వ్యాపారాలకు సంబంధించిన లెక్కలు అన్ని చూసుకుంటుంది. ఇక మరోవైపు వెంకట్ చెల్లి లక్ష్మి(శివానీ)తో మల్లీ ప్రేమలో పడతాడు. శివానీ కూడా మల్లీనే ప్రేమిస్తుంది. ఆ తర్వాత జరిగిన నాటకీయ‌ పరిణామాలు ఏమిటి..? పెద్దరికం కులం డబ్బుని చూసుకునీ అహంకారంతో రెచ్చిపోయిన వెంకటికీ మల్లీ మరియు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ గ్రూపు ఎలా బుద్ధి చెప్పింది..? చివరకు మల్లీ ప్రేమ కథ ఎలా సాగింది అన్నది ఈ సినిమా మిగిలింది కథ‌.

నటీనటుల పనితీరు:
అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో ఎక్కడ పాత్రలు తప్ప అందులో నటించిన న‌టిన‌టులు కనిపించరు. అందరూ ఎంతో చక్కగా తమ పాత్రలో ఒదిగిపోయి నటించారు. కథలు-పాత్రల ఎంపికలో అభిరుచిని చాటుతూ సుహాస్ మరోసారి తనకు తగ్గ మంచి పాత్రను ఎంచుకున్నాడు. తన లుక్స్‌ కోణంలో చూసి కొన్ని చోట్ల ఇతను హీరో ఏంటి అనిపించిన పాత్ర కోణంలో చూస్తే మరోసారి సుహాస్ అందరినీ మాయ చేశాడు. ఎప్పటిలాగే తన అమాయకత్వంతో కూడిన నటనతో అవురా అనిపించాడు. క్లైమాక్స్లో హీరోయిన్ తో కలిసే సన్నివేశాలలో తన హవ భావాలతో సుహాస్ కట్టిపాటిస్తాడని చెప్పాలి. అయితే ఇక్కడ సుహాస్ తాను హీరోగా చేస్తున్న సినిమాల్లో ఆయన పాత్రులన్నీ ఒకే రకంగాసాగుతున్నాయి.. ఈ ఒక్క విషయంలో మాత్రం అతను కొంచెం దృష్టిలో ఉంచుకుంటే ఫ్యూచర్లో ఇంకా బాగుంటుంది.

Ambajipeta Marriage Band movie review in Telugu | Ambajipeta Marriage Band  Review - అంబాజీపేట మ్యారేజి బ్యాండు రివ్యూ: తమిళ సినిమాలకు ధీటుగా, సుహాస్  క్యాస్ట్ బేస్డ్ ఫిల్మ్ ...

ఇక హీరోయిన్ శివాని నాగారం పాత్ర చూడడానికి ఎంతో అందంగా చక్కగా అనిపిస్తుంది. ఆ పాత్రలో తన హావభావాలతో బాగానే ఆకట్టుకుంది. ఎక్కడ అతి చేయకుండా సహజంగా నటించింది. సెకండ్ ఆఫ్ లో తన పాత్రకు ప్రాధాన్యం లేకపోయినా.. మొత్తంగా శివాని తన పాత్రకు న్యాయం చేసింది. ఇక విలన్ పాత్రలో చేసిన నితిన్ ప్రసన్న కూడా ఆకట్టుకున్నాడు. ఎవరీ నటుడు భలే చేస్తున్నాడే అనే ఫీలింగ్ కలుగుతుంది తనను చూస్తుంటే. ఇక సినిమాలో స్టాండౌట్ పెర్ఫామెన్స్ అంటే.. హీరో అక్క పాత్రలో చేసిన శరణ్యదే. తను ఎంత మంచి నటి అంటే ఈ సినిమాతో అందరికీ అర్థమవుతుంది. హీరోను మించి హైలైట్ అయిన పాత్రలో శరణ్య అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చింది. తన పాత్రను ప్రేక్షకులు చాలా రోజులు గుర్తుంచుకుంటారు. పుష్ప ఫేమ్ జగదీష్ హీరో స్నేహితుడి పాత్రలో మెప్పించాడు. గోపరాజు రమణ తక్కువ సన్నివేశాల్లోనే తన ప్రత్యేకతను చాటుకున్నాడు. హీరో తల్లిదండ్రులుగా కనిపించిన ఆర్టిస్టులు.. మిగతా నటీనటులు అందరూ బాగానే చేశారు.

సాంకేతిక విభాగం :
మంచి కథాంశం తీసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు అంతే స్థాయిలో ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోవడంలో మాత్రం కాస్త వెనుకబడ్డారు. కానీ, దుశ్యంత్‌ కటికినేని రూపొందించిన సన్నివేశాలు మాత్రం కొన్ని చాలా బాగా ఆకట్టుకున్నాయి. సంగీత దర్శకుడు సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.ఇక దర్శకుడు ఆలోచనను నమ్మి ఇలాంటి వాస్తవిక చిత్రాన్ని నిర్మించినందుకు నిర్మాత ధీరజ్ మోగిలినేనిను అభినందించాలి. ఆయన నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్:
సుహాస్ నటన
కథ
డైరెక్షన్
శరణ్య ప్రదీప్ నటన
మ్యూజిక్

మైనస్ పాయింట్స్:
రోటీన్ స్టోరీ
సడెన్ గా క్లైమాక్స్ కి వెళ్లిపోవడం.

Ambajipeta Marriage Band Review and Rating

చివ‌వ‌రిగా
‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీలో చెప్పాలనకున్న మెయిన్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి హత్తుకుంట‌యి. అలాగే నటీనటుల నటన కూడా ఎంతో బాగుంది. కాకపోతే, స్లో నేరేషన్, పూర్తిస్థాయిలో కమర్షియల్ అంశాలు లేకపోవడం, రొటీన్ ప్రేమ క‌థ‌ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో ఎమోషనల్ ఎలిమెంట్స్ అండ్ మెసేజ్ మాత్రం అంద‌రిని ఆకట్టుకుంటాయి.

FLరేటింగ్: 3/5

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...