Home Film News అమితాబ్ బ‌చ్చ‌న్‌నే బ‌య‌పెట్టిన క‌మ‌ల్ హ‌స‌న్‌.. సినిమా ఏమిటో తెలుసా..!
Film News

అమితాబ్ బ‌చ్చ‌న్‌నే బ‌య‌పెట్టిన క‌మ‌ల్ హ‌స‌న్‌.. సినిమా ఏమిటో తెలుసా..!

భారతీయ సినిమా చరిత్రలో కమలహాసన్, అమితాబ్ బచ్చన్ ఇద్దరు ఓ లెజెండ్స్ లాంటి హీరోలు.. ఇక ఈ ఇద్దరు ఎవరికీ వారే సాటి.. ఒకరిని మించిన నటుడు మరొకరు.. అలాంటి ఇద్దరు హీరోలు సినిమాలో కలిసి నటించిన సమయంలో.. కమలహాసన్ తో నటించడానికి అమితాబ్ బచ్చన్ భయపడ్డారట.. కమలహాసన్‌తో అసలు సినిమా చేయనని తెగేసి చెప్పేశారట.

ఇక ఇది మీకు వింటుంటే వింతగా ఉంది కదూ.. 80వ దశక‌మంలో ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా కొనసాగారు అమితాబ్ బచ్చన్.. అలాంటి ఈ అగ్ర హీరో కమలహాసన్ కి భయపడటం ఏంటి? అనుకుంటున్నారా.. ఇదే విషయాన్ని తమిళ దర్శకుడు భాగ్యరాజ్ గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అమితాబ్ బచ్చన్- కమలహాసన్ కాంబోలో తెలుగు దర్శకుడు తాతనేని రామారావు ఓ సినిమాను చేయాలని భావించారు.. ఆ సినిమా కథ కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక రోగి, అతనికి చికిత్స చేసే వైద్యుడు చుట్టూ తిరిగే స్టోరీ.

ఈ సినిమా స్క్రిప్ట్ మొత్తం సిద్ధం కాకముందు.. ముందుగా అమితాబ్ బచ్చన్‌ను సంప్రదిస్తే.. తాను ఈ సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.. దీంతో దర్శకుడు స్క్రిప్ట్ మొత్తం పూర్తి చేసి ఖబర్దార్ అనే టైటిల్‌ని కూడా ఫిక్స్ చేశారు. అంతా రెడీ అయిన తర్వాత అమితాబ్ కు స్టోరీ వివరించారు.. అదేవిధంగా సగభాగం పైగా సినిమా షూటింగ్ కూడా పూర్తి చేశారు. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆ సినిమా మధ్యలో నుంచి అమితాబ్ బయటకు వచ్చేశారు.

ఆ సినిమా పతాక సన్నివేశంలో కమల్ పాత్ర చనిపోతుందట. ఆ పాత్ర చనిపోవడంతోనే కథకు బలం చేకూరుతుందట. కానీ కమల్ పాత్ర చనిపోతే అదే సినిమాకు హైలైట్ అవుతుందని.. చనిపోయే సన్నివేశంలో కమల్ నటన ముందు తాను తేలిపోతానని అమితాబ్ భయపడ్డట్లు భాగ్యరాజ్ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ఓపెన్‌గానే తనతో చెప్పారని.. ఈ సినిమా తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తుందని భావించారని.. డబ్బులు పోయినా పర్వాలేదని, కానీ పేరు పోకూడదని చెప్పారని.. దీంతో ఆ సినిమా తాను చేయలేనని.. కావాలంటే మరో సినిమాకు డేట్లు ఇస్తానని చెప్పి ఆయన తప్పుకున్నారని భాగ్యరాజ్ వెల్లడించారు.

విచిత్రంగా ఆ తర్వాత కమల్ హాసన్ తో కలసి గిర్ఫతార్ సినిమాలో నటించారు. ఇందులో రజనీకాంత్ కూడా నటించారు. అమితాబ్ దక్షిణాది సినిమాల్లో పెద్దగా నటించలేదు. మనం సినిమాలో ఓ చిన్న కామియో రోల్ లో కనిపించారు. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డిలో నూ నటించారు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్వకత్వంలో తెరకెక్కుతోన్న ప్రాజెక్ట్ కె లో నటిస్తున్నారు అమితాబ్ బచ్చన్.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...