Home Film News Tollywood: ఈ ఏడాది టాలీవుడ్‌కి అస్స‌లు క‌లిసి రాలేదు.. ఏకంగా 8 నెలల్లో 10 డిజాస్టర్లు..!
Film News

Tollywood: ఈ ఏడాది టాలీవుడ్‌కి అస్స‌లు క‌లిసి రాలేదు.. ఏకంగా 8 నెలల్లో 10 డిజాస్టర్లు..!

Tollywood: ప్ర‌స్తుతం టాలీవుడ్ సినిమా స్థాయి ఏ రేంజ్‌కి ఎదిగిందో ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఆస్కార్ ద‌క్కించుకోవ‌డం, ఈ సినిమాతో పాటు పుష్ప సినిమాకి ప‌ది నేష‌న‌ల్ అవార్డ్స్ రావ‌డంతో దేశం మొత్తం ఇప్పుడు మ‌న టాలీవుడ్‌పైనే కన్నేసింది. అయితే టాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌కి  ఈ ఏడాది బాగానే క‌లిసి వ‌చ్చింద‌ని చెప్పాలి.   సంక్రాంతికి వచ్చిన వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య లాంటి బ్యాక్ టు బ్యాక్ విజయాలతో టాలీవుడ్‌కు మంచి జోష్ వ‌చ్చింది. వీటి త‌ర్వాత  వ‌చ్చిన‌ దసరా, విరూపాక్ష, బలగం వంటి బ్యాక్ టు బ్యాక్ విజయాలు తెలుగు ప్రేక్ష‌కుల‌కి వినోదాన్ని పంచాయి. అయితే ఈ సంవ‌త్సంరం మంచి విజ‌యాలు వ‌చ్చాయ‌నే ఆనందం ఒక‌వైపు ఉన్నా  దారుణమైన డిజాస్టర్ లు వరుస పెట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

మొదటి వీకెండ్ లోనే బోల్తా కొట్టేసి కనీసం సగం థియేటర్‌ కూడా నిండ‌లేని  సినిమాలు కూడా ఉన్నాయి. భారీ అంచ‌నాల‌తో ఇటీవ‌ల వ‌చ్చిన   ‘గాండీవధారి అర్జున’ చిత్రం వరుణ్ తేజ్ కు మరో మర్చిపోలేని డిజాస్టర్ నుఅందించింది. ఈ చిత్రం వ‌రుణ్ తేజ్‌కి పెద్ద డిజాస్ట‌ర్ మిగిల్చింది. ఇక వ‌రుణ్ పెద్ద‌నాన్న  చిరంజీవి భోళా శంకర్ తో మర్చిపోలేని డిజాస్టర్ ను టాలీవుడ్‌కు అందించడం గ‌మ‌న‌ర్హం. వాల్తేరు వీర‌య్య వంటి సినిమా త‌ర్వాత భోళా శంకర్ చిత్రంతో ప‌ల‌క‌రించాడు చిరు. ఈ మూవీ  మెగాస్టార్‌కు భారీ అవమానం మిగిల్చింది. మ‌రోవైపు  ‘శాకుంతలం’తో దిల్ రాజు గుణశేఖర్ లు ఎంత నష్టపోయారో తెలిసిందే. అలానే ర‌వితేజ  రావణాసుర  చిత్రం కూడా దారుణ‌మైన ఓట‌మి చ‌విచూసింది.

ఇక  బింబిసార‌తో మంచి హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్ అమీగోస్‌ సైతం బ్రేక్ ఈవెన్ లో సగాన్ని టచ్ చేయలేకపోయింది. నాగచైతన్య కస్టడీ, గోపీచంద్ రామబాణం, నిఖిల్ స్పై సందీప్ కిషన్ మైఖేల్ ఇలా చెప్పుకుంటూ పోతే టాలీవుడ్‌లో డిజాస్ట‌ర్ అయిన సినిమాల‌కి సంబందించి పెద్ద లిస్టు ఉంది. ఇక పవన్ కళ్యాణ్ సాయి తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా పవన్ కళ్యాణ్ క్రేజ్‌తో ఓ మోస్త‌రు విజ‌యం అందుకుంది. ఇలా  మన టాలీవుడ్‌ను వరుస విజయాలు వైపు కొంద‌రు హీరోలు న‌డిపించ‌గా, మ‌రి కొంద‌రు మాత్రం దారుణ‌మైన ఫ్లాపులు చ‌విచూశారు.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...