Home Film News Sukumar: నీళ్ల‌ల్లో కొట్టుకుబోయిన సుకుమార్.. ప్రాణాల‌కి తెగించి కాపాడినఅల్లు అర్జున్
Film News

Sukumar: నీళ్ల‌ల్లో కొట్టుకుబోయిన సుకుమార్.. ప్రాణాల‌కి తెగించి కాపాడినఅల్లు అర్జున్

Sukumar: గ‌త మూడు రోజులుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు తెగ మారుమ్రోగుతుంది. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఎంతో మంది గొప్ప న‌టులు ఉన్న‌ప్ప‌టికీ ఇప్ప‌టి వర‌కు జాతీయ అవార్డుల్లో ఒక్క‌సారి కూడా ఉత్త‌మ న‌టుడి అవార్డును అందుకోలేక‌పోయారు. ఇది టాలీవుడ్‌కి అంద‌ని ద్రాక్ష‌గానే ఉంటుంద‌ని అంద‌రు భావిస్తున్న స‌మ‌యంలో   ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. పుష్ప చిత్రంలోని పుష్ప‌రాజ్ పాత్ర‌లో బ‌న్నీ అద్భుత‌మైన న‌ట‌న క‌న‌బ‌రచి అవార్డ్ దక్కించాడు. తెలుగోడు ఓ జాతీయ అవార్డ్ సాధించి చరిత్ర సృష్టించ‌డం తెలుగు సినీ ప్రేక్షకులేకాదు.. తెలుగు ప్రజలందరికీ కూడా గ‌ర్వించ‌ద‌గ్గ  విష‌యం.  69ఏళ్ల తర్వాత.. 69 వ నేషనల్ ఫిల్మ్ అవా ర్డ్స్ లో ఉత్తమ నటుడిగా మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంపిక కావ‌డంతో అంద‌రి కన్నా ఎక్కువ‌గా సుకుమార్ సంతోషించాడు.

అల్లు అర్జున్‌కి అవార్డ్ ద‌క్కిన‌ట్టు ప్ర‌క‌టించ‌డంతో పుష్ప‌ చిత్ర డైరెక్టర్ సుకుమార్ ఆయ‌న్ని గ‌ట్టిగ కౌగిలించుకొని,  హత్తుకొని అభినందనలు తెలియజేశారు. ఆ స‌మ‌యంలో చాలా ఎమోష‌నల్ కూడా అయ్యారు. బ‌న్నీని సుకుమార్ ఎంతో ఇష్ట‌ప‌డతారు. వీరిద‌ద్ద‌రి కెరీర్ ఒకే స‌మ‌యంలో మొద‌లు కాగా, సుక్కూ.. బ‌న్నీతోనే ఎక్కువ సినిమాలు చేశారు. అయితే బ‌న్నీ అంటూ సుకుమార్‌కి ప్ర‌త్యేక‌మైన అభిమానం ఉంది. అందుకు కార‌ణం రియ‌ల్ లైఫ్‌లో సుకుమార్ లైఫ్‌ని బ‌న్నీ ప్రాణాల‌కి తెగించి కాపాడ‌డ‌మే.  ఆర్య సినిమా షూటింగ్ జరిగే టైంలో సుకుమార్ నీళ్లలో మునిగిపోయారట.

చిత్ర‌ హీరోయిన్ బోట్ నుండి దూకే సన్నివేశం సుకుమార్ తెరకెక్కిస్తున్న టైం లో హీరోయిన్ దూకిన‌ప్పుడు బోటు తిర‌గ‌బ‌డి సుకుమార్ వాట‌ర్‌లో ప‌డిపోయార‌ట. అత‌నికి ఈత రాక‌పోవ‌డంతో వాట‌ర్‌లో కొట్టుకుపోతున్నార‌ట‌.  యూనిట్ వాళ్ళందరూ సుకుమార్ ని ఎలా కాపాడాలా అని ఆలోచిస్తున్న స‌మ‌యంలో అల్లు అర్జున్ వాట‌ర్‌లోకి దూకి త‌న‌ని పైకి లేపాడ‌ట‌. అప్పుడు సుకుమార్ త‌న‌ని కాపాడుకోవ‌డానికి బ‌న్నీని కింద‌కు లాగాడ‌ట‌. అయితే ఆ స‌మ‌యంలో మ‌రో ముగ్గురు వ్య‌క్తులు వ‌చ్చి వారిని కాపాడార‌ట‌. అయిత త‌న‌కు ప్రాణ‌దానం చేసిన బ‌న్నీని జీవితాంతం గుర్తు పెట్టుకున్నాంటూ ఓ సంద‌ర్భంలో చెప్పారు

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...