Home Film News Hyper Adi: ఎట్ట‌కేల‌కు త‌న ల‌వ‌ర్‌ని పరిచ‌యం చేసిన ఆది.. అంద‌రి ముందు ముద్దులు కూడా పెట్టేసుకున్నారుగా..!
Film News

Hyper Adi: ఎట్ట‌కేల‌కు త‌న ల‌వ‌ర్‌ని పరిచ‌యం చేసిన ఆది.. అంద‌రి ముందు ముద్దులు కూడా పెట్టేసుకున్నారుగా..!

Hyper Adi: జ‌బ‌ర్ధ‌స్త్ షోతో లైమ్ లైట్‌లోకి వ‌చ్చిన ఆది ఇప్పుడు పెద్ద స్టార్‌గా మారాడు.త‌న‌దైన పంచ్‌ల‌తో తెగ సంద‌డి చేసే ఆది సినిమాల‌లోను క‌నిపిస్తూ అల‌రిస్తున్నాడు. ఇక ఢీ షోలో అలానే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో క‌నిపిస్తూ మంచి వినోదం పంచుతున్నాడు. ఆది ప్రేమ‌, పెళ్లి గురించి ఇటీవ‌లి కాలంలో అనేక వార్త‌లు వ‌స్తున్నాయి. యాంక‌ర్ వ‌ర్షిణితో  ప్రేమ‌లో ఉన్నాడ‌ని, వారిద్ద‌రు చెట్టా ప‌ట్టాలేసుకొని తిరుగుతున్నార‌ని అనేక ప్ర‌చారాలుకూడా సాగాయి. ఈ క్ర‌మంలో మా మ‌ధ్య అలాంటివేమి లేవని క్లారిటీ ఇచ్చింది  వ‌ర్షిణి. ఇక ప‌లు  షోల‌లో కూడా ఆది ల‌వ‌ర్ అంటూ కొంద‌రు వ్య‌క్తుల‌ని ప‌రిచ‌యం చేయ‌డం, ఆ త‌ర్వాత అది షోలో భాగంగానే చెప్పి జ‌నాల‌ని పిచ్చోళ్లని చేసేవారు.

తాజాగా `శ్రీదేవి డ్రామా కంపెనీ`కి సంంబ‌ధించిన ప్రోమో విడుదల కాగా, ఇందులో హైప‌ర్ ఆది మాట్లాడుతూ.. ఇన్నాళ్లు  షో కోసం నా ల‌వ‌ర్ అంటూ ప‌లువురిని ప‌రిచ‌యం చేశాను. కాని నా నిజ‌మైన ల‌వ‌ర్ ఈమె అంటూ విహారిక అనే యువ‌తిని ప‌రిచ‌యం చేశాడు. వారు ఇద్ద‌రు స్టేజ్ పై తెగ న‌వ్విస్తూ సంద‌డి చేశారు . ఇక ఆది అంద‌రి ముందు తన లవ్‌ ప్రపోజ్‌ చేశాడు.  తన లవ్‌ పేరు చెప్పిన ఆది… `ఐ లవ్యూ విహారిక` అంటూ  లవ్‌ పిల్లోని గిఫ్ట్ గా ఇచ్చారు. అప్పుడు విహారిక కూడా ల‌వ్ యూ టూ అని చెప్ప‌గా, వీరిద్ద‌రు ప్రేమించుకున్న తీరు చూడ ముచ్చ‌ట‌గా అనిపించింది. ఇక   `ఖుషి` సాంగ్‌తో కూడా వారిద్ద‌రు నానా రచ్చ చేశారు.

ఇక  యాంకర్ రష్మి సలహా మేరకు ఇద్దరు బుగ్గ‌ల‌ని లాగుతూ ముద్దులు కూడా పెట్టుకున్నారు. ముందుగా హైప‌ర్ ఆది  తన ప్రియురాలి బుగ్గని తీసుకుని ముద్దాడ‌గా , ఆ తర్వాత విహారిక కూడా ఆది రెండు బుగ్గలను చేతులతో తీసుకుని ముద్దు పెట్టుకొని షాకిచ్చింది. వీరిద్ద‌రి ఎపిసోడ్ చూసే వారికి చాలా స‌ర‌దాగా అనిపించింది. అయితే ఆది మ‌రోసారి త‌న ల‌వ‌ర్ అంటూ యువ‌తిని ప‌రిచ‌యం చేసి మ‌ళ్లీ బ‌క‌రాల‌ని చేస్తాడా, లేదంటే ఆమె నిజంగానే ఆది ల‌వ‌రా అనేది తెలియాల్సి  ఉంది. ఫుల్ ఎపిసోడ్ చూస్తే కాని ఆది ప్రేమ‌లో నిజ‌మెంత అనేది అర్దం అవుతుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...