Home Film News Jailer: జైల‌ర్ ప్ర‌భంజ‌నం మాములుగా లేదు.. రికార్డులు అన్ని స్మాష్‌
Film News

Jailer: జైల‌ర్ ప్ర‌భంజ‌నం మాములుగా లేదు.. రికార్డులు అన్ని స్మాష్‌

Jailer: వ‌రుస ఫ్లాపుల త‌ర్వాత ర‌జ‌నీకాంత్ నుండి ఓ సూప‌ర్ డూప‌ర్ హిట్ వ‌చ్చింది. ఆ చిత్ర‌మే జైల‌ర్. త‌లైవా సుమారు నాలుగేళ్లుగా ప్లాప్స్ చవిచూస్తూ వ‌స్తుండ‌గా,  తాజాగా నటించిన జైలర్  సినిమా మాత్రం మంచి విజ‌యం అందించింది. ఈ చిత్రం ఇప్పుడు  అదిరిపోయే రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద  రికార్డు వ‌సూళ్లు రాబ‌డుతూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ఐదు రోజుల్లో ఈ సినిమా 350 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన‌ట్టు తెలుస్తుండ‌గా, తెలుగు రాష్ట్రాల‌లో కూడా ఈ సినిమాకి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. వర్కింగ్ డేలో కూడా జైలర్ ప్ర‌భంజ‌నం కొన‌సాగుతుంది. ఆగ‌స్ట్ 10న విడుద‌లైన జైల‌ర్ చిత్రం
ఐదో రోజు ఇండియాలో అన్ని భాషల్లో కలిపి దాదాపు 28 కోట్లు నెట్ వసూళ్లు సాధించి ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది.

వరల్డ్ వైడ్ గా   ఐదో రోజు వసూళ్లు కలిపితే ఈ సినిమా 350 కోట్లు గ్రాస్ వసూళ్లు చేసిన‌ట్టు ట్రేడ్ వ‌ర్గాలు తెలియ‌జేశాయి. 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన జైలర్ మూవీ బ్రేక్ ఈవెన్‌ని కేవ‌లం మొద‌టి నాలుగు రోజులలోనే క్రాస్ చేసింది. జైలర్ దూకుడు, హంగామా చూస్తుంటే ఈ చిత్రం   600 కోట్లు గ్రాస్ వసూళ్లు చేసే అవకాశం ఉంది.  చాలా రోజుల తర్వాత రజినీకాంత్ స్థాయికి తగ్గ హిట్ పడడంతో ఫ్యాన్స్ కూడా ఫుల్  ఖుషీగా ఉన్నారు. చిత్రంలో  కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ స్పెషల్ రోల్స్ లో నటించడంతో సినిమాకు చాలా ప్ల‌స్ అయింది. ఈ చిత్రానికి పోటీగా భోళా శంక‌ర్ రాగా, ఈ మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకోవ‌డంతో జైల‌ర్ దూసుకుపోతుంది

జైల‌ర్ సినిమాకు నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా, చిత్రాన్ని చాలా అద్భుతంగా తెర‌కెక్కించాడు. త‌న కొడుకు మ‌ర‌ణంపై ప్ర‌తీకారం తీర్చుకునే రిటైర్డ్ జైల‌ర్‌గా ర‌జ‌నీకాంత్ యాక్టింగ్‌, మేన‌రిజ‌మ్స్‌తో పాటు ఆయ‌నపై చిత్రీక‌రించిన యాక్ష‌న్ సీక్వెన్స్‌లు అభిమానుల‌ను ఎంత‌గానో అల‌రిస్తున్నాయి. జైలర్ చిత్రానికి  తొలి రోజున రూ. 48.35 కోట్లు, 2వ రోజు రూ. 25.75 కోట్లు, 3వ రోజు రూ. 34.3 కోట్లు, 4వ రోజు రూ. 42.2 కోట్లు నెట్ ఇండియా కలెక్షన్స్ రాగా ఐదో రోజున రూ. 25 కోట్లు వ‌సూళ్లు వ‌చ్చాయి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...