Home Film News Heroine: బన్నీ హీరోయిన్‌ని చెత్త అంటూ ఆ హీరో అంత మాట అనేశాడేంటి..!
Film News

Heroine: బన్నీ హీరోయిన్‌ని చెత్త అంటూ ఆ హీరో అంత మాట అనేశాడేంటి..!

Heroine: మ‌ల‌యాళీ హీరోయిన్  అమ‌లాపాల్ తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా చాలా సుప‌రిచితం. ఈ అమ్మ‌డు అల్లు అర్జున్ న‌టించిన ఇద్ద‌రు అమ్మాయిల‌తో అనే సినిమాలో బ‌న్నీ స‌ర‌స‌న న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైంది. ప్ర‌స్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో సంద‌డి చేస్తూ వ‌స్తున్న ఈ భామ సోషల్ మీడియాలో కూడా త‌న అంద‌చందాల‌తో తెగ ఆక‌ట్టుకుంటుంది. అమ‌లాపాల్ బికినీలో కూడా సంద‌డి చేయ‌డం మ‌నం చూశాం. విజ‌య్ అనే ద‌ర్శ‌కుడిని పెళ్లి చేసుకొని కొన్నాళ్ల‌కు అత‌ని నుండి విడిపోయి ప్ర‌స్తుతం సోలోగా ఉంటుంది.అమ‌లాపాల్ నుండి డైవ‌ర్స్ అయిన‌ప్పుడు విజ‌య్ తండ్రి ఆమెపై సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు.  ఇక ఈ భామ అప్పుడప్పుడు వివాదాల‌తో కూడా హాట్ టాపిక్ అవుతుంటుంది

అయితే సాధార‌ణంగా హీరోలు ఏ ఆర్టిస్ట్ గురించి అయిన పాజిటివ్ గానే మాట్లాడుతుంటారు. ఇక హీరోయిన్స్ గురించి గొప్ప‌గా చెబుతారు. కాని ఓ హీరో అమ‌లాపాల్ గురించి ఎలాంటి మొహ‌మాటం ప‌డ‌కుండా ఆమె చెత్త హీరోయిన్ అంటూ షాకింగ్ కామెంట్ చేశాడు. మ‌రి ఆ హీరో ఎవరో కాదు తమిళనాట నటుడు అథర్వ. అత‌ను న‌టించన చిత్రాల‌న్నీ కూడా మంచి విజ‌యాలు సాధించ‌డంతో అందులో న‌టించిన హీరోయిన్స్‌కి కూడా మంచి పేరు వ‌చ్చింది.  అధ‌ర్వ గ‌ద్ద‌లకొండ గ‌ణేష్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించాడు. ఈ సినిమాలో త‌న ప‌ర్‌ఫార్మెన్స్ తో అద‌ర‌గొట్టాడు. ప్ర‌స్తుతం త‌మిళంలో వ‌రుస సినిమాలు చేస్తున్న అధ‌ర్వ రీసెంట్‌గా మ‌ధకం అనే వెబ్ సిరీస్ చేశాడు.

`మ‌ధ‌కం` అనే వెబ్ సిరీస్ డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుండ‌గా, దీనికి సంబంధించిన ప్ర‌మోష‌న్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటున్న అథ‌ర్వ‌.. అమ‌లాపాల్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు.  అథ‌ర్వ  న‌టించిన రెండో సినిమా `ముప్పోజుదుమ్ ఉన్ కార్పనైగల్` కాగా,  ఇందులో అమ‌లా పాల్ హీరోయిన్ గా న‌టించింది.. ఎల్రెడ్ కుమార్ చిత్రాన్ని రొమాంటిక్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కించారు. మూవీ షూటింగ్ మొద‌లైన ప‌ది రోజుల లోపే అధ‌ర్వ‌, అమలాపాల్ మ‌ధ్య గొడ‌వ జ‌రిగింద‌ట‌. అది అథ‌ర్వ‌ని చాలా బాధ‌పెట్టింద‌ట‌. అయితే ఆమె గురించి మాట్లాడిన అధ‌ర్వ .. ఆమెని చెత్త హీరోయిన్ అని అన్నాడు. అంతేకాదు .. ఈ విష‌యం ఆమెకు కూడా చెప్పాన‌ని అథ‌ర్వ  చెప్పుకొచ్చాడు. ప్ర‌స్తుతం అత‌ని కామెంట్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...