Home Film News Uday Kiran: ఉద‌య్ కిర‌ణ్ మ‌ర‌ణం త‌ర్వాత ఆయ‌న భార్య ఎక్క‌డికి వెళ్లింది.. ఏం చేస్తుంది..!
Film News

Uday Kiran: ఉద‌య్ కిర‌ణ్ మ‌ర‌ణం త‌ర్వాత ఆయ‌న భార్య ఎక్క‌డికి వెళ్లింది.. ఏం చేస్తుంది..!

Uday Kiran: చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఓ వెలుగు వెలిగిన ఉద‌య్ కిర‌ణ్ ఊహించని విధంగా ఆత్మ‌హ‌త్య చేసుకొని క‌న్నుమూసాడు. ఎంతో మంచి భవిష్య‌త్ ఉన్న ఉద‌య్ అలా చ‌నిపోవ‌డం ఎవరు జీర్ణించుకోలేకపోయారు. ఆయన మ‌ర‌ణించి ఏడేళ్లు అవుతున్నా కూడా ఇప్ప‌టికీ ఆయ‌న‌ని ఏదో సంద‌ర్భంలో గుర్తు చేసుకుంటూనే ఉంటారు అభిమానులు. అయితే  ఉదయ్ కిరణ్ మరణానికి ఆర్థిక కారణాలే అని కొంద‌రు కామెంట్ చేయ‌గా, ఇంకొంద‌రు వేరే కార‌ణాలు చెప్పుకొచ్చారు. అయితే మ‌స్క‌ట్‌లో ఉండే ఉద‌య్ కిర‌ణ్ అక్క డ‌బ్బులు కోసం నా త‌మ్ముడు చనిపోయాడ‌నేది అవాస్త‌వం. అంత క‌ర్మ వాడికి ప‌ట్టలేదు. ఉద‌య్ కిర‌ణ్ పెళ్లి చేసుకున్న విషిత వ‌ల్ల‌నే చ‌నిపోయి ఉంటాడ‌ని ఆమె అనుమానం వ్య‌క్తం చేసింది. దీనిపై విషిత నుండి ఎలాంటి స్పంద‌న లేదు.

ఉద‌య్ కిర‌ణ్ మ‌రణించిన త‌ర్వాత పెద్ద క‌ర్మ జ‌ర‌గ‌గా, ఆ త‌ర్వాత ఉద‌య్ కిర‌ణ్ ఫ్యామిలీ, విషిత ఫ్యామిలీ క‌లిసింది లేదు. ఇక విషిత కూడా ఎక్క‌డ పెద్ద‌గా క‌నిపించ‌డం కాని, మాట్లాడ‌డం వంటివి చేసింది కాని లేదు. దీంతో అస‌లు ఇప్పుడు విషిత ఏం చేస్తుంది, ఎక్క‌డ ఉంది అని కొంద‌రు ఆరాలు తీయ‌గా, ఆమె ఇప్పుడు సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తుందని తెలుస్తుంది . ఉదయ్ కిరణ్‌ను పెళ్లి చేసుకోక ముందు నుంచి కూడా విషిత‌ ఓ పెద్ద కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా ప‌ని చేస్తుంది. ఆ స‌మ‌యంలోనే ఉద‌య్ కిర‌ణ్‌కి, విషిత‌కి ప‌రిచ‌యం ఏర్ప‌డి ఆ ప‌రిచ‌యం ప్రేమ‌గా మారి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి త‌ర్వాత కూడా ఇద్ద‌రు చాలా సంతోషంగా అన్యోన్యంగా ఉన్నారు.

అయితే పెళ్లైన కొన్నాళ్లకి ఉద‌య్ కిర‌ణ్ గ్రాఫ్ క్ర‌మ‌క్ర‌మంగా పడిపోయింది. త‌న‌ని ఇండ‌స్ట్రీ దూరం పెట్టింద‌నే డిప్రెష‌న్ లో ఉండిపోయాడు. ఆ సమ‌యంలో విషిత ఉద‌య్ కిర‌ణ్‌కి చాలా స‌పోర్ట్‌గా ఉంది  అత‌నికి ప‌లుమార్లు కౌన్సిలింగ్ అందించ‌డంతో పాటు ధైర్యంగా నిలిచింది. ఓ సారి విషిత బ‌య‌ట‌కు వెళ్లిన స‌మ‌యంలో ఉదయ్ కిర‌ణ్ ఉరి వేసుకొని క‌న్నుమూసాడు. ఉద‌య్ కన్నుమూసాక విషిత మ‌రో పెళ్లి చేసుకోలేద‌ట‌. ముందు నుండి చేస్తున్న సాఫ్ట్ వేర్ జాబ్‌లోనే కొన‌సాగుతూ..  అనాథాశ్రమాలకు, వృధ్ధాశ్రామాలకు విరాళం ఇస్తుందని తెలుస్తుంద‌ని టాక్. భ‌ర్త‌ని మ‌ర‌చిపోలేకపోవ‌డంతో ఆమె మ‌రో పెళ్లి చేసుకునేందుకు కూడా ఆస‌క్తి చూప‌డం లేద‌ట‌.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...