Home Film News Golden Cradle: రామ్ చరణ్- ఉపాస‌న కూతురి బార‌సాల కోసం ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త బంగారు ఊయ‌ల పంపారా..!
Film News

Golden Cradle: రామ్ చరణ్- ఉపాస‌న కూతురి బార‌సాల కోసం ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త బంగారు ఊయ‌ల పంపారా..!

Golden Cradle: పెళ్లైన‌ ప‌ద‌కొండేళ్ల త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ ఉపాస‌న పండంటి బిడ్డకు జ‌న్మ‌నిచ్చిన విష‌యం తెలిసిందే.జూన్ 20 తెల్ల‌వారుఝామున 1.49ని.ల‌కి జూబ్లిహిల్స్‌ లోని అపోలో ఆసుప‌త్రిలో ఉపాస‌న బేబికి జ‌న్మ‌నిచ్చింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్  అయిన త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ -ఉపాస‌న‌లు తమ పండంటి బిడ్డతో మీడియా కెమెరాలకు ఫోజిచ్చారు. ఆ ఫోటోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేశాయి. ఇక ఇదిలా ఉంటే  ఈ రోజు ఉపాస‌న ఇంట్లో  మెగా ప్రిన్సెస్‌కు బార‌సాల కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. . కేవ‌లం కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలోనే ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించినట్టు టాక్. పాప‌కి ట్రెండీ నేమ్ ఫిక్స్ చేయ‌గా, ఇప్పుడు ఈ పేరు నెట్టింట తెగ హ‌ల్చ‌ల్ చేస్తుంది.

ఇక పాప పుట్టిన సంద‌ర్భంగా  దేశంలోనే అతి పెద్ద వ్యాపార‌వేత్త ముఖేష్ అంబానీ  బంగారు ఊయ‌ల‌ను పాప కోసం బహుమ‌తిగా పంపారని తెలుస్తుంది. బార‌సాల వేడుక‌ను ఆ ఊయ‌ల‌లోనే  నిర్వ‌హిస్తార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక ఉపాసన డెలివరీకి ఓ నెల ముందు నుంచి రామ్ చరణ్ తన సినిమా షూటింగ్స్’కు బ్రేక్ ఇచ్చిన విష‌యం తెలిసందే. ఇలాంటి సమయంలో త‌న భార్య ఉపాస‌న పక్కనే రామ్ చరణ్ ఉండాలని భావించి షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చాడు. డెలివరీ తర్వాత కూడా ఓ కొన్ని నెలల పాటు రామ్ చరణ్ ఇంట్లోనే తన భార్య ఉపాసనకు సాయంగా ఉండాలని అనుకున్న రామ్ చ‌ర‌ణ్‌.. జూలై నుండి షూటింగ్‌లో పాల్గొన‌బోతున్న‌ట్టు తెలుస్తుంది.

రామ్ చ‌ర‌ణ్ ఇప్పుడు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో గేమ్ ఛేంజ‌ర్ అనే సినిమా చేస్తున్నారు.భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా దిల్ రాజు నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతుంది. తొలుత‌ ఈ సినిమా షెడ్యూల్‌ను శంకర్ జూన్, జూలైలో ప్లాన్ చేశారు కాని రామ్ చ‌ర‌ణ్ రిక్వెస్ట్ తో ఆగ‌స్ట్‌కి వాయిదా ప‌డింది. అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ని బ‌ట్టి జూలై నుండే మూవీ చిత్రీక‌ర‌ణ ప్రారంభించనున్న‌ట్టు ఇన్‌సైడ్ టాక్. అయితే రామ్ చరణ్ షెడ్యూల్‌ను ఆగస్ట్‌కి వాయిదా వేశారు. గేమ్ చేంజ‌ర్ చిత్రం పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతుండ‌గా, ఇందులో  చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్లో సినిమా రిలీజ్ చేయాల‌ని అనుకుంటున్నారు. క‌థానాయిక‌గా కియారా అద్వానీ న‌టిస్తుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...