Home Film News Project K Story: లీకైన ప్రాజెక్ట్ కె స్టోరీ లైన్.. ప్ర‌భాస్ పాత్ర‌కి గూస్ బంప్స్ రావ‌వ‌డం ఖాయమ‌ట‌…!
Film News

Project K Story: లీకైన ప్రాజెక్ట్ కె స్టోరీ లైన్.. ప్ర‌భాస్ పాత్ర‌కి గూస్ బంప్స్ రావ‌వ‌డం ఖాయమ‌ట‌…!

Project K Story: బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ అర‌డ‌జ‌నుకి పైగా సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ఆయ‌న చేస్తున్న ప్ర‌స్తుత చిత్రాల‌లో స‌లార్, ప్రాజెక్ట్ కె చిత్రాల‌పై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ప్రాజెక్ట్ కె విష‌యానికి వ‌స్తే ఈ చిత్రం మ‌హాన‌టి ఫేం నాగ్ అశ్విన్ డైరెక్ష‌న్ లో రూపొందుతుంది. ఈ చిత్రంకి దాదాపు రూ.500 కోట్ల బ‌డ్జెట్ కేటాయించిన‌ట్టు తెలుస్తుండ‌గా, ఇందులో అమితాబ్ బ‌చ్చ‌న్, క‌మ‌ల్ హాస‌న్, దీపికా ప‌దుకొణే వంటి స్టార్ క్యాస్టింగ్ ఉంది. ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. గ‌త కొద్ది రోజులుగా మూవీకి సంబంధించి అనేక ప్ర‌చారాలు జోరుగా సాగుతున్నాయి.

ప్రాజెక్ట్ కె చిత్రాన్ని బాహుబ‌లి మాదిరిగా రెండు భాగాలుగా విడుద‌లైన చేయ‌నున్నార‌ట‌. తొలి పార్ట్‌లో ప్ర‌భాస్, క‌మ‌ల్ మ‌ధ్య పోరాట స‌న్నివేశాలు ఉంటాయ‌ని టాక్. క‌మ‌ల్ హాస‌న్‌తో పోరాడేందుకు 2600 సంవ‌త్సరంలోకి ప్ర‌భాస్ వెళతార‌ట‌. ఇక రెండో పార్ట్‌లో సినిమా మొత్తం క‌మ‌ల్ హాస‌న్, ప్ర‌భాస్ మ‌ధ్య‌నే ఉంటుంద‌నే టాక్ న‌డుస్తుంది. ఇప్ప‌టికే ఈ చిత్రం 70 శాతానికి పైగా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న‌ట్టు తెలుస్తుంది. కేవ‌లం క‌మ‌ల్ హాసన్, ప్రభాస్‌ల‌కి సంబంధించిన స‌న్నివేశాలు మాత్ర‌మే మిగిలి ఉన్నాయ‌ని అంటున్నారు. ఆగ‌స్ట్‌లో క‌మ‌ల్ హాస‌న్ చిత్ర  బృందంతో క‌ల‌వ‌బోతున్న‌ట్టు స‌మాచారం. ఇక బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే సీన్స్  దాదాపు పూర్తి అయ్యాయ‌ని చెప్పుకొస్తున్నారు.

ఇక ఈ చిత్రం మ‌హాభార‌తం స్పూర్తితో మూడో ప్రపంచం నేప‌థ్యంలో సైన్స్ ఫిక్ష‌న్ నేప‌థ్యంగా రూపంద‌నుంద‌ని చెబుతున్నారు.  చిత్రంలో ప్ర‌భాస్ పాత్ర క‌ర్ణుడిని పోలిన పాత్ర‌తో ఉంటుంద‌ని అంటున్నారు. ఇందులో ఐదు బ్లాకులు ఉంటాయ‌ట‌.భారీత‌యులు అందురు గ‌ర్వ‌ప‌డేలా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది.. ఇప్ప‌టికే ఈ సినిమా కోసం హాలీవుడ్ నుంచి ఓ నలుగురు యాక్షన్‌ డైరెక్టర్లను దించారని టాక్. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ చిత్రాన్ని చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్నారు.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...