Home Film News ఐశ్వర్య రాయ్ తెలుగులో న‌టించిన మూవీ ఇదే….ఆ స్టార్ హీరోతో జోడీ క‌ట్టినా సినిమా ఫ‌ట్‌..!
Film News

ఐశ్వర్య రాయ్ తెలుగులో న‌టించిన మూవీ ఇదే….ఆ స్టార్ హీరోతో జోడీ క‌ట్టినా సినిమా ఫ‌ట్‌..!

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ తన అంద చందాలతో ఇప్పటికే అందర్నీతన సినిమాలతో ఆకట్టుకుంటూనే ఉంది. ఒకప్పుడు కుర్రాళ్ళు ఆమెను చూసేందుకే సినిమాలకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఐశ్వర్యరాయ్ తమిళ సినిమాలతో ముందుగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. మణిరత్నం దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా వచ్చిన ఇద్దరూ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. తొలి సినిమాతోనే స్టార్ హీరోలతో కలిసి నటించే అవకాశం కొట్టేసింది.

Aishwarya Rai exudes elegance in new ad; fans wish to see her in films  [reactions] - IBTimes India

ఈ సినిమా తర్వాత సెన్సేషనల్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన జీన్స్ సినిమాలో హీరోయిన్‌గా నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలతో విజ‌య‌లు అందుకున్న ఐశ్వర్యరాయ్ తర్వాత బాలీవుడ్ లో వరుస అవకాశాలు రావడంతో అక్కడికి చెక్కేసి త‌క్కువ టైంలో ఇండియ‌న్ స్టార్ హీరోయ‌న్ అయిపోయింది. ఇక‌ ఐశ్వర్య తన కెరీర్లు ఒకే ఒక తెలుగు సినిమాల్లో మాత్రమే నటించింది.. అది కూడా మొత్తం సినిమా అంతా కాదు.. కేవలం ఒక్క సాంగ్‌లో మాత్ర‌మే ప్రత్యేకంగా కనిపించి అలరించింది.

నాగార్జున హీరోగా 1999లో వచ్చిన రావోయి చందమామ సినిమాలో ఓ పాటలో ఐశ్వర్యరాయ్ నటించింది. ఇక ఈ సినిమాను జయంత్‌ సి పరాన్జీ తెరకెక్కించాడు. దర్శకుడికి ఐశ్వర్యరాయ్ ఫ్యామిలీకి మంచి స్నేహ సంబంధం ఉండడంతో రావోయి చందమామ సినిమా సమయంలో శిల్పా శెట్టిని కలవడానికి ముంబై వెళ్లాడు. ఇక అదే సమయంలో ఐశ్వర్యరాయ్ ని కూడా కలిశాడు. అప్పుడు ఐశ్వర్యరాయ్ మీ సినిమాల్లో ఇతర హీరోయిన్లను నటించమని అడుగుతున్నారు నన్ను మాత్రం ఎందుకు ? అడుగ‌రని ప్రశ్నించింద‌ట‌.

Love To Live Video Song | Ravoyi Chandamama Movie | Nagarjuna | Mani Sharma  | Vyjayanthi Movies - YouTube

దాంతో జయంత్ శిల్పాశెట్టితో కాకుండా ఐశ్వర్యరాయ్ తో ఆ సాంగ్ చేయించారు. ఐశ్వర్య కూడా ఆ ఒక్క సినిమాలో కనిపించి తెలుగు ఆడియెన్స్‌ను అలరించింది. ఇక కోలీవుడ్ స్టార్ దర్శకుడు మణిరత్నం తెర్కెక్కించిన ” పొన్నియిన్ సెల్వన్ ” సినిమాలతో ప్రేక్షకులను మరోసారి తన నటనతో కట్టిపడేసింది ఐశ్వర్యారాయ్. ఈ సినిమా త‌ర్వాత ఐశ్వర్య మ‌ళ్లీ ఏ మూవీలో న‌టించ‌లేదు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...