Home Film News Director: స్టార్‌డ‌మ్ లేద‌ని ప్ర‌భాస్‌ని త‌ప్పించి ఆ స్థానంలో వెంకీని తీసుకున్న డైరెక్ట‌ర్..!
Film News

Director: స్టార్‌డ‌మ్ లేద‌ని ప్ర‌భాస్‌ని త‌ప్పించి ఆ స్థానంలో వెంకీని తీసుకున్న డైరెక్ట‌ర్..!

Director: రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో ప్ర‌భాస్. కెరీర్ మొద‌ట్లో ఆచితూచి సినిమాలు చేసిన ప్ర‌భాస్ ఆ త‌ర్వాత జోరు పెంచి మంచి హిట్స్ అందుకున్నాడు. ఛ‌త్ర‌ప‌తితో ప్ర‌భాస్‌కి మాస్ ఇమేజ్ రాగా, బాహుబ‌లితో పాన్ ఇండియా స్టార్‌డ‌మ్ ద‌క్కింది.  ఈ రెండు చిత్రాల‌కి రాజమౌళినే ద‌ర్శ‌కుడు కావ‌డం విశేషం. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేస్తున్న సినిమాల‌న్నీ కూడా ఓ రేంజ్‌లో బిజినెస్ జ‌రుపుకుంటున్నాయి. ఆయ‌న సినిమాల‌కి ప్రేక్ష‌కుల‌లో కూడా విప‌రీతమైన క్రేజ్ ఉంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ ఖాతాలో అర‌డ‌జ‌నుకి పైగా సినిమాలు ఉండ‌గా, అవ‌న్నీ కూడా భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్నాయి. ఆయ‌న ఇప్పుడు ప్ర‌తి సినిమాకి  150 కోట్ల‌కి పైగా రెమ్యున‌రేషన్ అందుకున్న‌ట్టు సమాచారం.

అయితే ప్ర‌భాస్‌కి ఇప్పుడు ఇంత‌క్రేజ్ ఉండ‌గా, గ‌తంలో క్రేజ్ లేద‌ని చెప్పి ఓ స్టార్ డైరెక్ట‌ర్ సినిమా నుండి త‌ప్పించేశాడ‌ట‌. ఇప్పుడు ఈ విష‌యం నెట్టింట వైర‌ల్‌గా మారింది. వివ‌రాల‌లోకి వెళితే  ఇండస్ట్రీలో  టాప్ దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న‌ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్. ఈయ‌న‌ వెంకటేష్,ఆసిన్  ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఘ‌ర్ష‌ణ అనే చిత్రం తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో వెంక‌టేష్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించగా,ఆసిన్ స్కూల్ టీచ‌ర్ పాత్ర‌లో అల‌రించింది.చిత్రం కూడా చాలా పెద్ద విజ‌యం సాధించింది. అయితే ఈ చిత్రంకి ఫస్ట్ ఛాయిస్ వెంకటేష్ కాదట‌. ప్రభాస్ హీరోగా అనుకొని  పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నారట. ఇక రెగ్యులర్ సినిమా షూటింగ్ మొదలు పెట్టే సమయానికి ప్రభాస్ కి పెద్దగా క్రేజ్ లేకపోవడంతో గౌత‌మ్ మీన‌న్ వెన‌క్కి త‌గ్గాడ‌ట‌.

క్రేజ్ లేని హీరోతో సినిమా చేస్తే  నష్టం వస్తుందన్న ఉద్దేశంతో గౌతమ్ మీనన్ ప్రభాస్ స్థానంలో హీరో వెంకటేష్ ను ఎంపిక చేశార‌ట‌. ఆయ‌న పోలీస్ పాత్ర‌లో ఒదిగిపోయి అద్భుతంగా న‌టించారు. అదే ప్ర‌భాస్ చేసి ఉంటే చిత్రం మ‌రో రేంజ్‌లో ఉండేద‌ని ఫ్యాన్స్ మాట‌. అయితే ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే..  ప్రభాస్ కి క్రేజ్ లేదని ఘ‌ర్ష‌ణ‌ సినిమా నుంచి తప్పించిన డైరెక్టర్ ఈ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమానికి ప్రభాస్ ను ముఖ్య అతిథిగా పిలవడం కొస‌మెరుపు. అయితే త‌న‌ని సినిమా నుండి త‌ప్పించార‌నే విష‌యం ప‌ట్టించుకోకుండా  ప్రభాస్ ఈ సినిమా వేడుకకు హాజరై సందడి చేయ‌డం అందరి దృష్టిని ఆక‌ర్షించింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...