Home Film News AskSRK: మీతో క‌లిసి సిగ‌రెట్ తాగాల‌ని ఉంద‌ని చెప్పిన అభిమాని.. స్టార్ హీరో రియాక్ష‌న్ ఏంటంటే..!
Film News

AskSRK: మీతో క‌లిసి సిగ‌రెట్ తాగాల‌ని ఉంద‌ని చెప్పిన అభిమాని.. స్టార్ హీరో రియాక్ష‌న్ ఏంటంటే..!

AskSRK: ఇటీవ‌లి కాలంలో సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకుంటుండ‌డం మ‌నం చూశాం. వీలున్న‌ప్పుడు వారితో ముచ్చటిస్తూ వారు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇస్తూ వ‌స్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోల‌లో ఒక‌రైన షారూఖ్ ఖాన్..ఫ్యాన్స్ తో ముచ్చ‌టించారు. షారూఖ్ ఖాన్ అంటే ఫ్యాన్స్ ప‌డి చ‌చ్చిపోతారు. ఆరు ప‌ద‌ల వ‌య‌స్సు దాటిన కూడా షారూఖ్ ఖాన్ సిక్స్ ప్యాక్ బాడీతో యంగ్ హీరోల‌కి పోటీ ఇస్తూ వ‌రుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు.  కొన్నాళ్లుగా వ‌రుస ఫెయిల్యూర్స్ తో బాధపడ్డ షారుఖ్ రీసెంట్ గా పఠాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో మంచి ఊపు మీదున్నాడు.
R
ఇక‌ షారుఖ్ నటించిన దీవానా సినిమా రిలీజ్ అయ్యి 31 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా…  అభిమానులతో  సోషల్ మీడియా ద్వారా 31 నిమిషాల పాటు ముచ్చటించారు. ‘ఆస్క్ ఎస్ఆర్కే’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించ‌గా, ఈ కార్య‌క్ర‌మంలో ఫ్యాన్స్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆస‌క్తిక‌ర స‌మాధానాలు ఇచ్చారు. ఇక ఓ అభిమాని షారూఖ్ తో ఏమన్నాడంటే.. మీతో కలిసి ఓ సిగరెట్ తాగాలని ఉంది? అది నా జీవిత ఆశయం అంటూ హీరో ని కన్విన్స్ చేసే ప్రయత్నం  చేయ‌గా, దానికి బాలీవుడ్  బాద్ షా ఊహించ‌ని స‌మాధానం ఇచ్చాడు.

త‌న అభిమానిని  ఏ మాత్రం హర్ట్ చేయకుండా సున్నితంగా స్పందించిన షారూఖ్ ఖాన్… తన చెడు అలవాట్లను ఎవరితోనూ పంచుకోనని.. అవి తనతోనే ఉంటాయని షారుక్ ఆస్తిక‌ర స‌మాధానం చెప్పారు. దీనికి నెటిజ‌న్స్  మంచి స‌మాధానం ఇచ్చార‌ని అంటున్నారు. షారూఖ్ ఒక‌ప్పుడు ఎక్కువ స్మోకింగ్ చేసే వార‌ని, కాని మ‌ధ్యలో పూర్తిగా మానేసిన‌ట్టు స‌మాచారం.  ఇక షారూఖ్ ఖాన్ విష‌యాల‌కి వ‌స్తే.. ప్రస్తుతం షారుక్ ‘జవాన్’ షూటింగ్ లో  బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహిస్తుండ‌గా, ఇందులో ప్రియ‌మ‌ణి కీల‌క పాత్ర పోషిస్తుంది. న‌య‌న‌తార క‌థానాయిక‌గా క‌నిపించ‌నుంది. ఈ సినిమాతో మ‌రో మంచి హిట్ త‌న ఖాతాలో వేసుకోవాల‌ని అనుకుంటున్నారు షారూఖ్‌.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...