Home Film News Upasana: మ‌న‌వ‌రాలు అంటే అంత పిచ్చా.. ఉపాస‌న త‌ల్లి ఏం చేసిందో తెలిస్తే నోరెళ్ల‌పెట్ట‌డం ఖాయం..!
Film News

Upasana: మ‌న‌వ‌రాలు అంటే అంత పిచ్చా.. ఉపాస‌న త‌ల్లి ఏం చేసిందో తెలిస్తే నోరెళ్ల‌పెట్ట‌డం ఖాయం..!

Upasana: జూన్ 20న రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తులు పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన విష‌యం తెలిసిందే. ఈ చిన్నారి ప్ర‌తి అప్‌డేట్‌ని నేష‌న‌ల్ మీడియా కూడా క‌వ‌ర్ చేసింద‌నే విష‌యం మ‌న‌కు తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌ల‌కి వివాహమైన 11 సంవత్సరాల తర్వాత బిడ్డకు జన్మనివ్వ‌డంతో మెగా కుటుంబంతోపాటు అభిమానులు కూడా సంబరాలు చేసుకున్నారు. ఇక జూన్ 30న పాప నామ‌క‌ర‌ణ వేడుక జ‌రిపించి క్లీంకార అనే పేరు పెట్టారు. ఈ కార్య‌క్ర‌మానికి… సన్నిహితులు, బంధువులు హాజరయ్యారు. క్లింకార‌కి ప‌లువురు సెల‌బ్రిటీలు కాస్ట్ లీ గిఫ్ట్‌లు ఇస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. రామ్ చరణ్ ఉపాసన గారాలపట్టి కోసం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బంగారు కాయిన్స్ ప్రత్యేకంగా డిజైన్ చేయించి పంపించినట్లుగా వార్తలు వచ్చాయి.

ఇక‌ అల్లు అర్జున్ తన మేనకోడలకు విలువైన కానుక పంపించినట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్ అయింది. బంగారు పలకను మేన‌కోడ‌ల‌కి బహుమతిగా ఇచ్చార‌ని టాక్ న‌డిచింది. ఆ ప‌ల‌క‌పై పేరుని బంగారు అక్షరాలతో చెక్కించి ఇచ్చినట్లు టాక్. ఇక ఉపాసన తల్లి శోభ‌న కూడా త‌న మ‌న‌వ‌రాలు పుట్టిన వేళా విశేషంతో ఫుల్ ఖుష్ అయింద‌ట‌. అంతేకాదు మనవరాలు మీద శోభనకి ఉన్న ప్రేమ చూసి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అయ్యారు. సాధార‌ణంగా ఎవ‌రైన బిడ్డను ఎత్తుకొని పుట్టింట్లోకి అడుగుపెట్టినప్పుడు కచ్చితంగా దిష్టి తీస్తారు. ఉపాస‌న కూడా త‌న బిడ్డ‌తో ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు అలా దిష్టి తీసిన వ్యక్తికి ఉపాసన తల్లి లక్ష రూపాయలు కానుకగా ఇచ్చిందట.

 

ఇదొక్క‌టే కాదు త‌న మనవరాలి చేతులు అలాగే పాదాల ముద్రలను బంగారంతో తయారు చేయించుకొని ప్రేమ్ కట్టించి గోడకు పెట్టుకుందట. ఇక త‌మ ఇంటికి మనవరాలు వచ్చిన శుభ సందర్భాన ఇంట్లో ఉన్న పని వాళ్ళందరికీ బట్టలు పెట్టి బహుమతులు కూడా ఇచ్చిందట శోభ‌న కామినేని . పెద్దింట్లో పుట్టింది కాబ‌ట్టి త‌న‌ మనవరాలికి అందరి దీవెనలు ఉండాలని ఇలా శోభన కామినేని సిందని ఈ విషయం తెలిసి చాలామంది ఔరా అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు రామ్ చ‌ర‌ణ్ ఉపాస‌న‌ల కూతురి ఫొటోని రివీల్ చేయ‌లేదు. ఎవ‌రి పోలికనో చూడాల‌ని ఫ్యాన్స్ తెగ ఆరాట ప‌డుతున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...