Home Film News Adipurush in USA: యూఎస్‌లో ఆదిపురుష్ హంగామా.. కార్ల‌తో రామనామం …!
Film News

Adipurush in USA: యూఎస్‌లో ఆదిపురుష్ హంగామా.. కార్ల‌తో రామనామం …!

Adipurush in USA: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చారిత్రాత్మక చిత్రం ఆదిపురుష్ ఎట్ట‌కేల‌కు నేడు థియేట‌ర్స్ లోకి వ‌చ్చింది.ఎన్నో రోజుల నుండి ప్ర‌భాస్ అభిమానుల‌తో పాటు రామ భ‌క్తులు సైతం ఈ సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూశారు. భారతీయులు ఎంతో భక్తి శ్రద్దలతో ఆరాధించే పుణ్యపురుషుడు శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ నటించ‌డంతో ఈ సినిమాపై హైప్ మ‌రింత పెరిగింది. అయితే  ఎన్నో వివాదాల మధ్య నలుగుతూ.. అదే విధంగా భారీ అంచనాల న‌డుమ‌ ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  చిత్రంలో శ్రీరాముడిగా ప్రభాస్ నటించగా .. జానకి పాత్రలో కృతి సనన్.. రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ ముఖ్య పాత్ర‌లు పోషించారు. రామాయణం పురాణం ఆధారంగా చేసుకొని దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

బుక్ మై షోలోనే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 1 మిలియన్ టిక్కెట్స్ సేల్ కావడం చూసి అభిమానులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. తొలి రోజు ఆదిపురుష్ చిత్రం అవలీల‌గా వంద కోట్లు రాబ‌ట్ట‌డం ఖాయం అని ఫిక్స్ అయ్యారు.  గతంలో ప్రభాస్ నటించిన బాహుబలి 2, సాహో చిత్రాలు మాత్రమే ఈ రేంజ్ ఓపెనింగ్స్ సాధించగా.. ఇప్పుడు ఇది కూడా సాధిస్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమాపై ఒక్కొక్క‌రు ఒక్కోలా అభిమానాన్ని చాటుకుంటున్నారు. రీసెంట్‌గా   యూఎస్‌లో ఆదిపురుష్ కోసం నిర్వహించిన బిగ్గెస్ట్ ర్యాలీకి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది.

విశాల‌మైన ప్రాంతంలో వందలాది కార్లను  పార్క్ చేసిన ఇండియన్స్.. ఆ కార్లన్నింటినీ రామనామం(SRIRAM) ఆకృతిలో నిలిపి అందరి దృష్టిని ఆక‌ర్షించారు.  డ్రమ్స్, వాయిద్యాలతో నానా హంగామా చేశారు.  ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది.  రాముని ఇతిహాస యాత్రను చూసేందుకు ఈ బిగ్గెస్ట్ ర్యాలీ విట్‌నెస్‌గా నిలిచిందని ప‌లువురు చెప్పుకొస్తున్నారు. కాగా ఆదిపురుష్ మూవీ  9000 స్క్రీన్స్‌లో రిలీజ్ అవుతుంది.. తెలుగులో 1500, మిగతా భాషలన్నీ కలిపి 4000, ఓవర్సీస్‌లో 3500 స్క్రీన్స్ కేటాయించిన‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టి వ‌ర‌కు అయితే ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్సే వ‌స్తుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...