Home Film News Pawan Kalyan: రోజా భ‌ర్తపై నిప్పులు చెరిగిన ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ప‌రిధి దాటి ఆలోచించాలంటూ చుర‌క‌
Film News

Pawan Kalyan: రోజా భ‌ర్తపై నిప్పులు చెరిగిన ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ప‌రిధి దాటి ఆలోచించాలంటూ చుర‌క‌

Pawan Kalyan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో చాలా బిజీగా ఉన్నారు ప‌వన్ క‌ళ్యాణ్‌. గ‌త కొద్ది రోజులుగా వారాహి యాత్ర‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాన్ కాస్త బ్రేక్ తీసుకొని బ్రో మూవీ ప్ర‌మోష‌న్స్ లో పాల్గొన్నారు. గ‌త రాత్రి జ‌రిగిన బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సుదీర్ఘ‌మైన స్పీచ్ ఇచ్చిన ప‌వ‌న్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రోజా భ‌ర్త సెల్వ‌మ‌ణికి గ‌ట్టి కౌంట‌ర్ కూడా ఇచ్చాడు. త‌మిళ‌నాడులోనే షూటింగ్ జ‌ర‌పాల‌ని, త‌మిళ ఆర్టిస్టుల‌ని మాత్ర‌మే తీసుకోవాల‌నే నిబంధ‌న తీసుకురావ‌డంతో బ్రో ఈవెంట్ వేదిక‌గా ఆయ‌న‌కి కూల్ వార్నింగ్ ఇచ్చారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.  తమిళ చిత్ర పరిశ్రమకి  నాదొక విన్న‌పం ఏంటంటే..మన చిత్ర పరిశ్రమ అనే ధోరణి నుంచి బ‌య‌ట‌కు రావాలి.

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ చూస్తే ఇది అంద‌రిని క‌లుపుకుంటుంది. అలానే త‌మిళ ప‌రిశ్ర‌మ కూడా అంద‌రి న‌టుల‌ని తీసుకోవాలి. కోలీవుడ అనేది త‌మిళ వాళ్ల కోస‌మే అంటే ప‌రిశ్ర‌మ ఎద‌గ‌దు. కేరళ నుంచి వచ్చిన సుజిత్‌ వాసుదేవన్‌గారు, నార్త్‌ నుంచి వచ్చిన ఊర్వశి రౌతేలా గారైతేనేమీ, పాకిస్తాన్‌ నుంచి విభజన సమయంలో వచ్చిన నీతా లుల్లా గారు అంద‌రు క‌లిసి బ్రో సినిమాకి   చేసాం. వారు ఇక్క‌డ రాణిస్తున్నారు.  అన్ని భాషలు, అందరం క‌లిసి ఉంటేనే సినిమా అవుతుందని తప్పా, మన భాష, మన వాళ్లే ఉండాలంటే కుంచిచుకుపోతాం అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ సుతిమెత్త‌గా చెప్పుకొచ్చారు. తమిళ సినిమాల షూటింగ్‌ల‌లో తమిళ వాళ్లు మాత్ర‌మే ఉండాలని, తమిళనాడులోనే షూటింగ్‌లు చేయాలనేది నేను విన్నాను. కాని అలాంటి చిన్న స్వభావం నుంచి బయటకు వచ్చి, మీరు కూడా `ఆర్‌ఆర్‌ఆర్‌` లాంటి ప్రపంచ ప్రఖ్యాతి సినిమాలు చేయాల‌ని తమిళ చిత్ర పరిశ్రమ పెద్ద‌ల‌కి చెబుతున్నా అని ప‌వ‌న్ అన్నారు.

స్థానికంగా కార్మికులకు సమస్యలుంటే వారికి కచ్చితంగా ఫీడింగ్ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంది కాని ,కళాకారుడికి కులం, మతం, ప్రాంతమంటే పరిశ్రమ ఎన్న‌టికి ఎదగదు. దాన్ని దాటి ఆలోచించాలని తమిళ పరిశ్రమ పెద్దలను కోరుకుంటున్నా అంటూ ప‌వ‌న్ సంచల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా,  ఇటీవల చెన్నైలో జరిగిన కాన్ఫిడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) దక్షిణ్‌ సమ్మిట్‌లో రోజా భర్త, దర్శకులు ఆర్‌కే సెల్వమణి .. మీరు  ఇతర రాష్ట్రాల్లో ఎందుకు చేస్తున్నారని, ముఖ్యంగా హైదరాబాద్‌లో షూటింగ్‌లు ఎందుకు చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. తమిళ సినిమాల్లో తమిళ ఆర్టిస్టులు,టెక్నీషియన్లనే తీసుకోవాలనే వాదన కూడా లేవ‌నెత్తారు. ఆ వ్యాఖ్య‌ల‌పై ప‌వ‌న్ ఇలా స్పందించిన‌ట్టు తెలుస్తుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...