Home Film News Rashmika: ర‌ష్మిక‌ని వ‌దిన అని పిల‌వ‌డంపై ఆనంద్ దేవ‌ర‌కొండ స‌మాధానం ఇదే..!
Film News

Rashmika: ర‌ష్మిక‌ని వ‌దిన అని పిల‌వ‌డంపై ఆనంద్ దేవ‌ర‌కొండ స‌మాధానం ఇదే..!

Rashmika: సినీ పరిశ్ర‌మ‌లో హీరో, హీరోయిన్స్ మ‌ధ్య ప్రేమ వ్య‌వ‌హారాలు ఉండ‌డం స‌హ‌జం. వాటిని కొంద‌రు బ‌హిర్గ‌తం చేస్తుండ‌గా, మ‌రి కొంద‌రు మాత్రం సీక్రెట్‌గానే ప్రేమాయ‌ణం న‌డుపుతుంటారు. కొన్నాళ్లుగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మికలు ప్రేమ‌లో మునిగి తేలుతున్న‌ట్టు సోష‌ల్ మీడియాలో అనేక ప్ర‌చారాలు సాగాయి. ఇద్ద‌రు క‌లిసి మాల్దీవుల‌కి కూడా వెళ్లార‌ని, ప‌లు పార్టీలు క‌లిసి చేసుకున్నార‌ని అనేక ప్ర‌చారాలు సాగాయి. ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ సోద‌రుడు ఆనంద్ దేవ‌ర‌కొండ ముందే అభిమానులు ర‌ష్మిక‌ని వ‌దిన అని పిలిచారు. దీనిపై ఆనంద్ దేవ‌ర‌కొండ న‌టించిన బేబి మూవీ ప్రమోష‌న్‌లో ప్ర‌శ్న ఎదురైంది.

బేబీ సినిమాలోని ఓ పాట  ర‌ష్మిక  చేతుల మీదుగా విడుద‌ల కాగా,  ఆ స‌మ‌యంలో అభిమానులు ఆమెను వ‌దినా అని పిలిచారు క‌దా అని ఓ విలేక‌రి ఆనంద్ దేవ‌ర‌కొండను ప్ర‌శ్నించారు. దానికి ఆనంద్ దేవ‌ర‌కొండ  కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. “నో.. నేను దీన్ని ఇక్క‌డితో ఆపేస్తాను.” అని  చెప్పుకొచ్చాడు. ఇక బేబి సినిమాలో  వేలు చూపిస్తున్నట్లు ఉండే పోస్టర్‌ను తొల‌గించ‌డంపై కూడా ఆనంద్ దేవ‌ర‌కొండ రియాక్ట్ అయ్యారు. పోస్ట‌ర్‌పై మిక్స్ డ్ రెస్పాన్స్  రావ‌డంతో ఎందుకులే అనిపించి పోస్ట‌ర్ డిలీట్ చేశామ‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ సోద‌రుడు ఆనంద్ దేవ‌ర‌కొండ అన్నారు.

ఇక ‘బేబీ’ సినిమా విషయానికి వ‌స్తే ఈ చిత్రంలో వైష్ణ‌వి క‌థానాయిక‌గా ఈ చిత్రాన్ని  సాయి రాజేష్ డైరెక్ట్ చేశారు.  జూలై 14న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానుండ‌గా, మూవీకి జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు సాగుతున్నాయి. ఆనంద్ దేవ‌ర‌కొండ‌కి ఇటీవల ఒక్కటి కూడా మంచి హిట్ లేదు. అందుకే ఈ సినిమాపై భారీ అంచ‌నాలే పెట్టుకున్నాడు. మూవీలో  విరాజ్ ఆశ్విన్ కూడా మ‌రో క‌థానాయ‌కుడిగా క‌నిపించ‌నుండ‌గా, ఇటీవ‌ల చిత్రం నుండి విడుద‌లైన ఈ సినిమా ట్రైల‌ర్‌కు ఆడియెన్స్ నుంచి సూప‌ర్బ్‌రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక చిత్ర క‌థ త‌న‌కు బాగా న‌చ్చింద‌ని, ఈ మూవీ త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంద‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశాడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...