Home Film News Salman Khan: సిగ‌రెట్ చేతిలో ప‌ట్టుకొని షోలో పాల్గొన్న స్టార్ హీరో.. తిట్టి పోస్తున్న నెటిజ‌న్స్
Film News

Salman Khan: సిగ‌రెట్ చేతిలో ప‌ట్టుకొని షోలో పాల్గొన్న స్టార్ హీరో.. తిట్టి పోస్తున్న నెటిజ‌న్స్

Salman Khan: బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. స్టార్ హీరోగా ఇప్ప‌టికీ త‌న స‌త్తా చాటుతూనే ఉన్నాడు. కుర్ర హీరోల‌కి పోటీగా సినిమాలు చేస్తూ మ‌రో వైపు బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ హోస్ట్ చేస్తున్నాడు. అయితే స‌ల్మాన్ ఖాన్ ఎప్పుడు ఏదో ర‌కంగా వివాదాల‌లో నిలుస్తూ ఉంటారు. ఆయన నుండి ఏదైన త‌ప్పు దొరుకుతుందా అని నెటిజ‌న్స్ కూడా కాచుకు కూర్చుంటారు. తాజాగా స‌ల్మాన్ ఖాన్ బిగ్ బాస్ లైవ్ షోలో  సిగ‌రెట్ చేత ప‌ట్టుకొని పొగ తాగారు. ఈ వివాదాస్ప‌ద‌మైన చ‌ర్య కార‌ణంగా అభిమానులు ఇబ్బంది ప‌డ‌గా, యాంటీ ఫ్యాన్స్ అయితే తెగ ట్రోల్ చేస్తున్నారు.

ప్ర‌స్తుతం స‌ల్మాన్ ఖాన్ బిగ్ బాస్ ఓటీటీ రెండో సీజ‌న్‌కి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తొలి సీజ‌న్‌కి  క‌ర‌ణ్ జోహార్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌గా, రెండో సీజ‌న్‌కి స‌ల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ఉండేందుకు ఒప్పుకున్నాడు. ఇక రీసెంట్ ఎపిసోడ్‌లో  స‌ల్మాన్ ఖాన్.. హౌజ్‌లో  కంటెస్టెంట్స్ త‌ప్పొప్పుల‌ను అనాలిసిస్ చేస్తూ మాట్లాడారు. వారికి చుర‌క‌లంటిస్తున్న స‌మ‌యంలో స‌ల్మాన్ ఖాన్ చేతిలో సిగ‌రెట్ క‌నిపించింది. లైవ్ షోలో సల్మాన్ చేతిలో ఇలా సిగ‌రెట్ చూసిన ప్రేక్ష‌కులు హోస్ట్‌కి కూడా గ‌ట్టిగా ఇచ్చి ప‌డేసారు.  కంటెస్టెంట్స్ గురించి మాట్లాడే సంద‌ర్భంలో మీరు  సిగ‌రెట్ ఎలా  కాల్చారంటూ ఫైర్ అయ్యారు. ఎంతో మందికి మీరు స్ఫూర్తి.. మీరు కెమెరా ముందు ఇలాంటి ప‌నులు చేయోచ్చా అంటూ ఫైర్ అయ్యారు.

కంటెస్టెంట్స్ తప్పొప్పులు చూపించే  ముందు ఫ‌స్ట్ మీరు మారండి  అంటూ సల్మాన్ ఖాన్ పై నెటిజ‌న్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ స్టేజిలో ఉన్న వ్యక్తే ఇలా పబ్లిక్ గా సిగరెట్‌ కాల్చి ఎవ‌రికి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారు అని మ‌రికొంతమంది మండిపడుతున్నారు. ఈ  విష‌యంపై స‌ల్మాన్ లేదా షో నిర్వాహ‌కులు కాని స్పందిస్తారా అన్న‌ది చూడాలి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...