Home Film News ఒక్క బాలయ్య కోసం 8 మంది డైరెక్టర్లు… నట‌సింహం క్రేజ్ అదిరిపోయింది గా..!
Film News

ఒక్క బాలయ్య కోసం 8 మంది డైరెక్టర్లు… నట‌సింహం క్రేజ్ అదిరిపోయింది గా..!

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు.. గత రెండు సంవత్సరాలుగా బాలయ్య వరుస బ్లాక్ బాస్టర్ విజయాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తున్నాడు. అదేవిధంగా బుల్లితెరపై అన్ స్టాపబుల్ టాక్ షో తో ఎవరు ఊహించని విధంగా వీరంగం సృష్టిస్తున్నారు. ఈ రెండు సంవత్సరాల్లో బాలయ్య వెండితెరపై ఏకంగా అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేస‌రి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాడు.

Nandamuri Balakrishna: 30 ఏళ్ళు తర్వాత రెండు వరస విజయాలు.. హ్యాట్రిక్‌పై కన్నేసినన బాలయ్య. - Telugu News | Nandamuri Balakrishna Ready To Hatric Hit after 30 years in Tollywood Telugu Heroes Photos ...

బాలకృష్ణ తన కెరీర్లో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఇలా వరుసగా హ్యాట్రిక్ విజయాలు దక్కాయి. ఈ మూడు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద రూ.100 కోట్ల కలక్షన్లు అందుకుని కమర్షియల్ గా కూడా బాల‌య్య‌ స్టామినా ఏంటో చూపించాయి. ఈ సంవత్సరం ఏకంగా సంక్రాంతికి వీర‌సింహారెడ్డి దసరాకు భగవంత్‌కేస‌రి సినిమాతో రెండు వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఇప్పుడు చిత్ర పరిశ్రమలో బాలయ్య మార్కెట్ బాగా పెరిగింది.

Boyapati Srinu Archives | Page 2 of 4 | Telugu360.com

అంతేకాకుండా ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు కమర్షియల్ దర్శకులకు అందుబాటులో లేకపోవడంతో వాళ్ళందరికీ ఇప్పుడు బాలయ్య దిక్కయ్యారు. బోయపాటి శ్రీను, బాబి, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, పూరి జగన్నాథ్, సంపత్ నంది, క్రిష్ ఇలా కమర్షియల్ దర్శకులు అందరూ కథలు పట్టుకొని స్టార్ హీరోలు, మీడియం రేంజ్ హీరోల చుట్టూ తిరుగుతున్నారు. ఆ హీరోలు ఎవరు కూడా ఈ డైరెక్టర్లతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు.

Is Puri teaming with Balayya once again? - The Leo News | English News

ఇక పైన చెప్పిన ఆ 8 మంది డైరెక్టర్లలో ఒక్కరిద్దరూ తప్ప మిగిలిన వారికి సరైన హీరోలు లేరు.. దీంతో వాళ్లంతా బాలయ్య కోసం కథ‌లు రెడీ చేసే పనిలో ఉన్నారు. అయితే ఇప్పటికే కథలు సిద్ధం చేసుకున్న వారంటే బాలయ్య చుట్టూ తిరుగుతూ ఒప్పించే పనిలో పడ్డారు.. పైన చెప్పకున్నా ఏ దర్శకులకు స్టార్ హీరోలు అందుబాటులో ఉండడం లేదు.. వీరితో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి హీరోలు సినిమా చేసే పరిస్థితి ఇప్పుడు లేదు.

దీంతో వారంతా బాలయ్య చుట్టూ చెక్కరలు కొడుతున్నారు. భారీ బడ్జెట్ తో బాలయ్యతో సినిమా చేసిన అది వర్కౌట్ అవుతుంది. అందుకే ఇప్పుడు ఈ అగ్ర దర్శకులు అందరికీ బాలయ్య దిక్కయ్యారు. అదేవిధంగా బాలయ్య తీసుకునే రెమ్యూనరేషన్ కూడా కేవలం రూ.25 నుంచి 30 కోట్ల రేంజ్ లో ఎంతో నార్మల్ గా ఉంటుంది. అందుకే ఇప్పుడు బాల‌య్య‌తో సినిమా చేసి కచ్చితంగా హిట్ కొట్టాలని దర్శకులు అందరూ ట్రై చేస్తున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...