Home Film News బాలయ్య కెరీర్ లోనే భారీ డిజాస్టర్లు ఇచ్చిన రాజమౌళి, బి. గోపాల్.. ఆ సినిమాలు ఇవే..!
Film News

బాలయ్య కెరీర్ లోనే భారీ డిజాస్టర్లు ఇచ్చిన రాజమౌళి, బి. గోపాల్.. ఆ సినిమాలు ఇవే..!

నట‌సింహం నందమూరి బాలకృష్ణ సీనియర్ దర్శకుడు బి.గోపాల్ కాంబినేషన్ అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి క్రేజ్ ఉందో కొత్తగా చెప్పనక్కర్లేదు. వీరీ కాంబినేషన్లో ఇప్పటికే ఐదు సినిమాల వస్తే వాటిలో నాలుగు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక వాటిలో రెండు ఇండస్ట్రీ హిట్లు. ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన చివరి సినిమా పల్నాటి బ్రహ్మనాయుడు మాత్రమే ప్లాప్ సినిమాగా నిలిచింది.

Balakrishna : రాజ‌మౌళి బాలకృష్ణ కాంబినేష‌న్లో ఈ రెండు బ్లాక్‌బ‌స్ట‌ర్లు మిస్స్… ఆ సినిమాలే బాలకృష్ణ చేసి ఉంటే..!

ఇప్పుడు కూడా బాలయ్య బి. గోపాల్ కాంబినేషన్లో సినిమా అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో అంచనాలు మూలుగా లేవు. ఇక ఇదే సమయంలో దర్శకుడు రాజమౌళి గురించి కూడా ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని ఏకంగా ఆస్కార్ అవార్డు స్థాయికి తీసుకు వెళ్లిన ఘనత రాజమౌళికి సొంతం. 22 సంవత్సరాల కెరీర్ లో ఒక్క అపజయం అన్నదే లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే రాజమౌళి బాలయ్య కాంబినేషన్లో ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే రాజమౌళి శిష్యుడు ఇక్కడ బాలయ్యను డైరెక్ట్ చేయటం విశేషం.

అదేవిధంగా బాలయ్యకు ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన బి. గోపాల్ శిష్యుడు.. రాజమౌళి శిష్యులు ఇద్దరు బాలయ్యతో తీసిన రెండు సినిమాలు భారీ డిజాస్టర్లుగా నిలిచాయి. సీనియర్ దర్శకుడు బి. గోపాల్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన స్వర్ణ సుబ్బారావు బాలకృష్ణ హీరోగా విజయేంద్ర వర్మ సినిమాను తెరకెక్కించాడు. 2003 ఫిబ్రవరి 23న ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. రెండు సంవత్సరాలు పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా 2004 డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ ప్లాప్ సినిమాగా మిగిలిపోయింది. ఈ సినిమాలో బాలయ్యకు జంటగా సంగీత, లయ, అంకిత హీరోయిన్లుగా నటించారు.

ఇక ఈ సినిమాలో బాలయ్య ఆర్మీ ఆఫీసర్‌గా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏం మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక అదే విధంగా రాజమౌళి శిష్యుడు మహాదేవ్ కూడా ద‌ర్శ‌కుడిగా పరిచయం అవుతూ బాలయ్యతో 2009లో మిత్రడు సినిమా చేశాడు. ఈ సినిమాలో బాలయ్యకు జంటగా ప్రియమ‌ణి హీరోయిన్గా నటించింది. ఈ సినిమా బాగున్నా… బాలయ్య ఇమేజ్‌కు తెగిన కథ కాదు దీంతో ఇది కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇలా ఇండస్ట్రీలోనే తిరుగులేని స్టార్ డైరెక్టర్లుగా ఉన్న ఇద్దరు అగ్ర దర్శకుల శిష్యులతో బాలయ్య చేసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...