Home Film News Jeevitha Rajasekhar: రాజశేఖర్ దంపతులకి రెండేళ్లు జైలు శిక్ష‌, 5 వేల జ‌రిమానా…!
Film News

Jeevitha Rajasekhar: రాజశేఖర్ దంపతులకి రెండేళ్లు జైలు శిక్ష‌, 5 వేల జ‌రిమానా…!

Jeevitha Rajasekhar: ఒక‌ప్పుడు యాంగ్రీ యంగ్ మెన్‌గా పేరు తెచ్చుకున్న రాజ‌శేఖ‌ర్ వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రించాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎక్కువ‌గా పోలీస్ పాత్ర‌లో ప‌వ‌ర్ ఫుల్ రోల్‌లో క‌నిపించి సంద‌డి చేశారు రాజ‌శేఖ‌ర్. ఆయ‌న స‌తీమ‌ణి కూడా మంచి యాక్ట్రెస్ కాగా, పెళ్లి త‌ర్వాత సినిమాల‌కి బ్రేక్ ఇచ్చింది జీవిత‌. ఇప్పుడు రాజ‌శేఖ‌ర్ అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తున్న‌ప్ప‌టికీ జీవిత మాత్రం వెండితెర‌పై క‌నిపించ‌క చాలా రోజులే అయింది. వారి పిల్ల‌లు మాత్రం క‌థానాయిక‌గా న‌టిస్తూ స‌త్తా చాటే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే రాజ‌శేఖ‌ర్, జీవిత వివాదాల‌తో కూడా ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటారు.

తాజాగా పరువు నష్టం కేసులో  రాజశేఖర్‌, జీవిత దంపతులకు  జైలుశిక్ష విధిస్తూ నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్‌ మెట్రో పాలిటన్‌ మెజిస్ట్రేట్‌ సాయిసుధ  సంచలన తీర్పు వెల్లడించారు. గ‌తంలో చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌పై రాజశేఖర్‌ దంపతులు మీడియా సమావేశంలో తప్పుడు ఆరోపణలు చేసిన‌ట్టు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ 2011లో ఈ కేసు దాఖలు చేయ‌గా, దానిపై నాంప‌ల్లి కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. రెండేళ్ల‌ జైలు శిక్ష తో పాటు  5 వేల జరిమానా కూడా  విధించింది. మీడియా స‌మావేశంలో వారు  తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొంటూ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ 2011లో ఈ కేసు దాఖలు చేశారు.

రాజ‌శేఖర్, జీవిత‌ల‌ ఆరోపణలకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను సీడీ రూపంలో కూడా కోర్టుకు సమర్పించ‌డంతో.. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపి సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన కోర్టు.. రాజశేఖర్‌, జీవితకు రెండేండ్ల జైలు శిక్ష విధిస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఈ తీర్పుపై  వారు జిల్లా కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించడంతో వారిద్దరు బెయిల్‌ బాండ్ల రూపంలో రూ.10 చొప్పున పూచీకత్తులను సమర్పించి కోర్టు నుంచి విడుదలయ్యారు. ప్ర‌స్తుతం ఈ విష‌యం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. కాగా, రాజ‌శేఖ‌ర్ దంప‌తులు గ‌తంలో చాలా సార్లు చిరంజీవిని టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు చేసే వారు. కాని ఈ మ‌ధ్య ఆయ‌న‌తో స‌న్నిహితంగానే మెలుగుతున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...