Home Film News Sai Dharam Tej Sister: బ్రో సినిమాలో సాయి ధ‌ర‌మ్ తేజ్ చెల్లెలుగా న‌టించిన అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఇదా..!
Film News

Sai Dharam Tej Sister: బ్రో సినిమాలో సాయి ధ‌ర‌మ్ తేజ్ చెల్లెలుగా న‌టించిన అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఇదా..!

Sai Dharam Tej Sister: ఇటీవ‌ల విడుద‌లైన మంచి విజ‌యం సాధించిన చిత్రం బ్రో. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌,సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సముద్ర‌ఖ‌ని తెర‌కెక్కించిన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ ద‌క్కింది.  చిత్రానికి  మాటల మాంత్రికుడు,  ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు నేటివిటికి అనుగ‌ణంగా కథలో మార్పులు, చేర్పులు చేశారు. జూలై 28న చిత్రం విడుద‌ల కాగా, మూవీకి మంచి ఆద‌ర‌ణే ద‌క్కింది. టైమ్ సెంటిమెంట్ తో  అల్లుకున్న చిత్ర క‌థ‌కు ప్రేక్ష‌కులు బాగానే క‌నెక్ట్ అయ్యారు. చిత్రంలో సిస్ట‌ర్ సెంటిమెంట్ కూడా సినిమా స‌క్సెస్ కావ‌డంలో భాగం అయింది. చిత్రంలో సాయి ధ‌రమ్ తేజ్ స‌ర‌స‌న కేతిక శ‌ర్మ క‌థానాయిక‌గా న‌టించగా, ఆయ‌న‌కి చెల్లెళ్లుగా  ప్రియా ప్రకాష్ వారియర్, యువ లక్ష్మి  కనిపించారు.

ప్రియా ప్ర‌కాశ్ వారియర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వింక్ బ్యూటీగా ఈ అమ్మ‌డు ఎంతో ఆద‌ర‌ణ సంపాదించుకుంది. ఇక యువ‌ల‌క్ష్మీ చిత్రంలో గాయ‌త్రి అనే  పాత్ర పోషించింది. ఆమె పాత్ర‌కి చిత్రంలో బాగా స్కోప్ ఉంది. త‌న న‌ట‌న‌తో కూడా ఈమె ఎంత‌గానో అల‌రించింది.  అయితే చిత్రంలో  సాయిధరమ్ తేజ్ చెల్లెలుగా నటించిన  యువలక్ష్మి పూర్తి డీటైల్స్ చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు. ఆమె  పెద్ద యాక్టర్ అని  బహుశా   చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు.    చిన్నప్పటి నుండే అనేక సినిమాలు, టీవీలో చిన్న పిల్లల షో కూడా కనిపించి సంద‌డి చేసింది. చైల్డ్ ఆర్టిస్టుగా కూడా ప‌లు సినిమాల‌లో న‌టించి మెప్పించింది.

తమిళంలో సముద్ర ఖని, అమల్ పాల్ నటించిన అమ్మ కనక్కు అనే చిత్రంలో వారి కూతురిగా కనిపించి ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.  కాంచన 3, వినోదయ సీతం వంటి చిత్రాల్లో కూడా యువ‌ల‌క్ష్మీ మెరిసింది .  ఇక్క‌డ ముఖ్య విష‌యం ఏంటంటే ఆమె న‌టించిన  అన్ని చిత్రాలు కూడా  సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి. తమిళంలో ఎక్కువ సినిమాలు నటించిన యువ లక్ష్మికి ఆఫ‌ర్స్ వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆమె బిజీ ఆర్టిస్ట్ గా మారింది. ఇన్నాళ్లు త‌మిళంలోనే సందడి చేసిన ఆమె ఇప్పుడు  బ్రో చిత్రంతో తెలుగు తెరకి కూడా పరిచయమైంది యువ లక్ష్మి. రానున్న రోజుల‌లో యువ‌ల‌క్ష్మీ ప‌లు తెలుగు సినిమాల‌తో కూడా సంద‌డి చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...