Home Film News Samantha Stylist: నాగ చైతన్య చాలా మంచివాడని చెప్పిన సమంత స్టైలిస్ట్..!
Film News

Samantha Stylist: నాగ చైతన్య చాలా మంచివాడని చెప్పిన సమంత స్టైలిస్ట్..!

Samantha Stylist: టాలీవుడ్ లో ఎంతో అన్యోన్యంగా ఉండే నాగ చైత‌న్య‌, స‌మంత జంట ఊహించ‌ని విధంగా విడాకులు తీసుకున్నారు. వారి విడాకుల వ్య‌వ‌హారం ఎంత హాట్ టాపిక్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్ప‌టికీ కూడా వారి విడాకుల‌కి సంబంధించి ఏదో ఒక వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉంటుంది. అయితే స‌మంత‌, చై విడిపోవ‌డానికి అనేక ప్ర‌చారాలు న‌డిచాయి. ఓ సంద‌ర్భంలో   సమంతతో క్లోజ్ గా ఫోటో దిగినందుకు ప్రీత‌మ్ జుక‌ల్క‌ర్‌ని కూడా తెగ ట్రోల్ చేశారు.  ప్రీతమ్ అప్ప‌ట్లో  సమంత వద్ద కాస్ట్యూమ్ డిజైనర్ గా ప‌ని చేశాడు. అప్పుడు స‌మంత అత‌ని ఒళ్లో ప‌డుకొని దిగిన ఫొటోని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

నెటిజ‌న్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన నేప‌థ్యంలో  గంటల వ్యవధిలోనే ఆ పిక్ డెలిట్ చేసింది.  అయితే  నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోవడానికి ముఖ్య కార‌ణం ప్రీతమ్ అంటూ అతనిపై నెగిటివ్ కామెంట్స్ కూడా వ‌చ్చాయి..  అతను ఎవరి వద్ద వర్క్ చేసిన కూడా వారితో క‌లిపి ప్రీత‌మ్‌ని ట్రోల్ చేశారు. అయితే ఎప్పుడూ పెద్ద‌గా ఇంటర్వ్యూలు ఇవ్వని ప్రీతమ్ తాజాగా  తన లైఫ్, వర్క్ గురించి చెబుతూనే.. తనపై వచ్చిన ట్రోలింగ్స్ పై స్పందించారు. సమంత రూత్ ప్ర‌భు చాలా మంచి అమ్మాయి. ఆమె నా కెరీర్ స్టార్టింగ్ లో ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతో సపోర్ట్ చేసింది.

సమంత, నేను క్లోజ్ గా ఉన్న ఫోటో ఒకటి పెట్టి డిలీట్ చేసిన స‌మయంలో అంద‌రు  నన్ను ట్రోల్ చేశారు. మా రిలేషన్ గురించి తప్పుగా ప్ర‌చారం చేశారు. మా ఇద్ద‌రి బంధః బ్రదర్, సిస్టర్ అనుకోవచ్చు లేదా ఫ్రెండ్స్ అనుకోవచ్చు క‌దా. ఇక  నాగ చైత‌న్య‌ చాలా మంచివాడు. అత‌నితో నాకు పరిచయం ఉంది. చాలా హంబుల్ గా ఆయ‌న ఉంటారు. అయితే వారిద్ద‌రు విడాకులు  తీసుకున్నప్పుడు చాలా మంది నన్ను  తప్పుగా మాట్లాడారు. నా ప్లేస్ లో క‌నుక‌ ఇంకొకరు ఉంటే  మాత్రం సూసైడ్ చేసుకొని చనిపోయేవాళ్లు. సమంత ఇప్పటికి కూడా నాకు ఎంతో సపోర్ట్ గా నిలుస్తుంది అని వ్యాఖ్యానించాడు. ప్ర‌స్తుతం ప్రీత‌మ్ చేసిన వ్యాఖ్య‌లు చర్చ‌నీయాంశంగా మారాయి.

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...