Home Film News Honey: హ‌నీ పాపకి ఇంత రిస్క్‌లు అవ‌స‌రమా..!
Film News

Honey: హ‌నీ పాపకి ఇంత రిస్క్‌లు అవ‌స‌రమా..!

Honey: నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన వీర‌సింహారెడ్డి సినిమాతో ఒక్క‌సారిగా లైమ్ లైట్‌లోకి వ‌చ్చిన అందాల ముద్దుగుమ్మ హ‌నీరోజ్. చిత్రంలో శృతి హాస‌న్ వంటి స్టార్ హీరోయిన్ ఉన్న‌ప్ప‌టికీ హ‌నీ రోజ్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. వీర సింహారెడ్డి మూవీలో హనీ రోజ్ పోషించిన మీనాక్షి పాత్ర ప్రతి ఒక్కరికీ  ఎంతగానో కనెక్ట్ అయింది.  ఈ సినిమా త‌ర్వాత హ‌నీరోజ్‌కి పెద్దగా సినిమా ఆఫ‌ర్స్ అయితే రాలేదు కాని షాప్ ఓపెనింగ్ ఆఫ‌ర్స్ ఫుల్‌గా వ‌స్తున్నాయి. షాప్ లాంచింగ్ స‌మ‌యంలో హ‌నీ రోజ్ ధ‌రించే డ్రెస్ లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇక సోష‌ల్ మీడియాలోను  ఈ అమ్మ‌డు చేసే ర‌చ్చ‌కు కుర్ర‌కారు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. హనీరోజ్ ఫొటో షేర్ చేసిందంటే అది క్ష‌ణాల‌లో వైరల్ కావ‌ల్సిందే.

మ‌ల‌యాళీ కుట్టి హ‌నీ ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ అండ్ పెప్పర్ లుక్స్ వదులుతూ కుర్రాళ్ల‌ని మాయ చేస్తోంది. సినిమాల సంగతి అటుంచితే అమ్మడి పిక్స్‌కి మాత్రం మంచి గిరాకీ లభిస్తోంది అనే చెప్పాలి. ఎప్పుడు కిరాక్ పిక్స్ తో కిక్కెంచించే హ‌నీ రోజ్ తాజాగా ఓ రిస్క్ తో హాట్ టాపిక్ గా నిలిచింది.  హనీరోజ్ చేసిన ఒక భారీ రిస్క్ గురించి అంద‌రు ముచ్చ‌టించుకుంటున్నారు. ఇటీవల ఐర్లాండ్ టూర్కు వెళ్లిన హనీ రోజ్ అక్క‌డ‌ ఎంతో ప్రసిద్ధి గాంచిన బ్లర్నే స్టోన్ (బ్లర్నే అనే రాయి)ను రిస్క్ చేసి మరీ  ముద్దాడింది. ఇందుకోసం హ‌నీ రోజ్  చాలా ఎత్తులో పడుకొని.. తన తలను బాగా వెనక్కి వాల్చి మరీ ఆ రాయిని ముద్దాడింది. ఈ అనుభవాన్ని  తాను అస్స‌లు మర్చిపోలేనని.. ఇదొక వండర్ఫుల్ ఎక్స్పీరియెన్స్ అంటూ చెప్పుకొచ్చింది హ‌నీ రోజ్.

అందాల‌తోనే కాదు రిస్క్‌ల‌తోను యూత్‌ని మాయ చేయ‌గ‌ల‌న‌ని హ‌నీ రోజ్ నిరూపించింది. ఏదేమైన హ‌నీ రోజ్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. 2005లో వ‌చ్చిన  మలయాళ చిత్రం ‘బాయ్ ఫ్రెండ్’ సినిమా ద్వారా సినిమా రంగంలోకి అడుగు పెట్టింది హ‌నీ రోజ్. ఆ త‌ర్వాత హ‌నీ మలయాళంతో పాటు క‌న్నడ‌, త‌మిళ‌, తెలుగు సినిమాల్లో నటిస్తోంది. బాల‌కృష్ణ హీరోగా తెర‌కెక్కిన  వీర సింహారెడ్డి సినిమాతో ఆమె ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఈ అమ్మడి అందాలు, ఫోటో షూట్స్ ఎప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాయి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...