Home Film News Tamannaah: ఎట్ట‌కేల‌కి అత‌డితో డేటింగ్ చేస్తున్న విష‌యాన్ని ఒప్పుకున్న త‌మ‌న్నా..!
Film News

Tamannaah: ఎట్ట‌కేల‌కి అత‌డితో డేటింగ్ చేస్తున్న విష‌యాన్ని ఒప్పుకున్న త‌మ‌న్నా..!

Tamannaah: ఇటీవ‌ల కుర్ర భామ‌లు సీక్రెట్ ప్రేమాయణం న‌డుపుతూ వార్త‌ల‌లో నిలుస్తున్నారు. ప‌లుమార్లు వారు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన కూడా దానిని క‌ప్పిపుచ్చుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కొద్ది రోజులుగా లావ‌ణ్య త్రిపాఠి- వ‌రుణ్ తేజ్ ప్రేమాయ‌ణంలో ఉన్నార‌ని అనేక ప్ర‌చారాలు సాగాయి. అయితే దానిపై స్పందించిన లావ‌ణ్య మేం ఫ్రెండ్స్ మాత్ర‌మే అని చెప్పుకొచ్చింది. కాని జూన్ 9న అత‌డితో నిశ్చితార్థం జ‌రుపుకొని ఈ ఏడాదిలోనే పెళ్లి పీట‌లు ఎక్కేందుకు కూడా రెడీ అవుతుంది. ఇక అందాల భామ ఇలియానా, అదితి రావు హైద‌రి ఇలా ప‌లువురు భామ‌లు సీక్రెట్‌గా ప్రేమ వ్య‌వ‌హ‌రాలు న‌డిపిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కూడా  ప్రేమలో పడ్డారనేది మీడియా వర్గాల వాదన.

కొద్దినెలలుగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ఆమె సన్నిహితంగా ఉండ‌డ‌మే కాకుండా. తరచుగా కలిసి కనిపిస్తున్నారు. 2023 న్యూ ఇయర్ వేడుకలు ఈ  జంట క‌ల‌సి సెలబ్రేట్ చేసుకున్నారని వార్త‌లు రాగా, వాటిని  తమన్నా ఖండించారు. నేను ఎవరితో డేటింగ్ చేయడం లేదు. నేను సింగిల్ అని సమాధానం  ఇచ్చింది. త‌మ‌న్నా క్లారిటీ ఇచ్చిన‌ప్ప‌టికీ ఎవ‌రు కూడా దీనిని పూర్తిగా న‌మ్మ‌లేదు. ఇటీవ‌ల మ‌ళ్లీ ఈ ఇద్ద‌రు జంట‌గా క‌నిపించారు. విజయ్ డ్రైవింగ్ చేస్తుండగా, పక్క సీట్లో తమన్నా కూర్చొని ఉండ‌డంతో ఈ ఇద్ద‌రి మ‌ధ్య  సంథింగ్ సంథింగ్ అనే వార్తలు నిజమే అని పలువురు వాదించారు.

ఇక ఎప్ప‌టికైన ఈ విష‌యం గురించి  చెప్పాల్సిందే క‌దా అని త‌మ‌న్నా అనుకుందో ఏమో కాని బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో సంబంధంపై  ఎట్టకేలకు పెదవి విప్పింది. ఆయనతో ప్రేమ నిజమేనని ఒప్పుకుంది. ఇద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు, ఎలా చిగురించిందో కూడా  తెలిపింది. లస్ట్ స్టోరీస్2 వెబ్ సిరీస్‌ లో తొలిసారి కలిసి నటించినప్పుడు  మా ఇద్దరి మధ్య పరిచయమై, అది ప్రేమగా మారిందని పేర్కొంది. సహనటుడు అనే కారణంగా విజయ్ వర్మను ఇష్టపడలేదని, తను చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని స్ప‌ష్టం చేసింది. తను నాకు రక్షణగా నిలబడతాడనే నమ్మకం ఉంది. నా మనసుకు  చాలా దగ్గరైన వ్యక్తి. నేను చాలా శ్రద్ధ వహించే వ్యక్తి కూడా అతను. తను ఉన్న చోటే నాకు సంతోషకరమైన ప్రదేశం అంటూ తమన్నా చెప్పుకొచ్చింది. మ‌రి వీరి పెళ్లి ఎప్పుడు అనే దానిపై ఎలాంటి సమాధానం ఇవ్వ‌లేదు.

Related Articles

Игровые аппараты Pin-up casino на деньги

Игровые аппараты Pin-up casino на деньги

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...