Home Film News NBK : బాలయ్య పుట్టినరోజు – అభిమానులకు పండుగరోజు
Film News

NBK : బాలయ్య పుట్టినరోజు – అభిమానులకు పండుగరోజు

NBK: నటసింహా నందమూరి బాలకృష్ణ.. బాలయ్య.. ఎన్‌బికె.. ఈ పేరు వింటే చాలు అభిమానులకు రోమాలు నిక్కబొడుచుకుంటాయ్.. జై బాలయ్య అనే నినాదం అంటే చాలు అంతులేని అభిమానంతో వారి మనసులు ఉప్పొంగుతాయ్.. బాలయ్య ఫ్యాన్స్‌కి జై బాలయ్య అనేది కేవలం స్లోగన్ మాత్రమే కాదు.. అదొక ఎమోషన్..

స్వర్గీయ నందమూరి తారక రామారావు నట వారసుడిగా సినీరంగ ప్రవేశం చేసి, అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును, అభిమాన గణాన్ని సంపాదించుకుని, గత నాలుగు దశాబ్దాలుగా నందమూరి నట వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.. నటసింహా నందమూరి బాలకృష్ణ.. జూన్ 10న బాలయ్య 62వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

బాలనటుడిగా ‘తాతమ్మ కల’ తో కెరీర్ స్టార్ట్ చేసి, తండ్రితో కలిసి పలు సినిమాల్లో నటించిన బాలకృష్ణకు ‘మంగమ్మగారి మనవడు’ సోలో హీరోగా బ్రేక్ ఇచ్చింది. ఇక అక్కడినుండి వరస సినిమాలతో, తిరుగులేని మాస్ ఇమేజ్‌తో స్టార్ హీరోగా ఎదిగారు.

ముద్దుల మావయ్య, ముద్దుల మేనల్లుడు, నారీనారీ నడుమ మురారి, లారీ డ్రైవర్, రౌడీ ఇన్‌స్పెక్టర్, భైరవద్వీపం, ఆదిత్య 369, సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, లక్ష్మీ నరసింహా, సింహా, లెజెండ్, గౌతమిపుత్ర శాతకర్ణి, అఖండ.. ఇలా ఆయన జీవం పోసిన పాత్రలు ఎన్నో ఎన్నెన్నో.. పాత్రలోకి పరకాయ ప్రవేశం చెయ్యడం, తన అసమాన నటనతో పోషించే పాత్రకు పరిపూర్ణ న్యాయం చెయ్యడం బాలయ్యకు తండ్రినుండి వచ్చిన గొప్ప గుణం.. మంచి లక్షణం..

సినిమా సినిమాకీ నటుడిగా ఎదుగుతూ, తన రికార్డులను తానే తిరగరాస్తూ, జయం వచ్చినప్పుడు పొంగిపోకుండా, అపజయం వచ్చినప్పుడు కుంగిపోకుండా, దర్శక, నిర్మాతల హీరోగా మంచితనంతో మెలుగుతూ ఇప్పటికీ 106 సినిమాలు పూర్తి చేశారు.. తన జెనరేషన్ హీరోల్లో.. సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రాత్మక చిత్రాలు చేసిన, చేయగలిగిన ఒకే ఒక్క హీరో నందమూరి బాలకృష్ణ మాత్రమే.. నాకు నేనే పోటీ, నాకెవరూ రారు సాటి.. అని ఎన్నో సందర్భాల్లో నిరూపించారు బాలయ్య..

తండ్రి నట వారసత్వంతో పాటు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఇప్పటికి రెండుసార్లు ఎమ్మెల్మేగా గెలుపొందారు. సినిమాలు, ప్రజాసేవతో పాటు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వరిస్తున్న బాలయ్య, ప్రస్తుతం తన 107వ సినిమాని గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నారు. తర్వాత 108వ సినిమాని అనిల్ రావిపూడితో చెయ్యబోతున్నారు.

కల్మషం తెలియని మనసు, స్వార్థం లేని ప్రేమ, నిండైన చిరునవ్వు బాలయ్య ఆభరణాలు.. ఆయన భోళా శంకరుడు.. అభిమానుల పాలిట దేవుడు.. సినిమా, రాజకీయ రంగాలలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ.. బాలయ్య బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు..

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Julayi Movie : త్రివిక్రమ్ పంచుల ప్రవాహానికి పదేళ్లు..

Julayi Movie: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన...

Nandamuri Kalyan Ram : కళ్యాణ్ రామ్ పరిచయం చేసిన డైరెక్టర్స్ ఇండస్ట్రీని ఏలుతున్నారు..

Nandamuri Kalyan Ram: నందమూరి ఫ్యామిలీ నుండి థర్డ్ జనరేషన్ హీరోగా ‘తొలిచూపులోనే’ మూవీతో ఎంట్రీ...

Bigg Boss Telugu 6 Promo : ‘బిగ్ బాస్ సీజన్ సిక్స్.. ఎంటర్‌టైన్‌మెంట్‌కి అడ్డా ఫిక్స్’

Bigg Boss Telugu 6 Promo: Worlds బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ న్యూ...

Mahesh Babu : మహేష్ బర్త్‌డే.. విషెస్‌తో సోషల్ మీడియా షేకవుతోంది..

Mahesh Babu: ‘సూపర్ స్టార్’, ‘నటశేఖర’ కృష్ణ గారి నటవారసుడు.. చిన్నతనంలోనే స్టార్ డమ్ తెచ్చుకున్న...