Home Film News బాలయ్య ‘నో’ చెప్పిన సినిమాలు ఇవే.. ప్చ్, చేసుంటేనా..
Film News

బాలయ్య ‘నో’ చెప్పిన సినిమాలు ఇవే.. ప్చ్, చేసుంటేనా..

Balakrishna
Balakrishna

నటసింహా నందమూరి బాలకృష్ణ ఈ జూన్ 10న 62వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ‘అఖండ’ సక్సెస్ ఇచ్చిన ఊపుతో, రెట్టింపు ఉత్సాహంతో, ఈ జనరేషన్ హీరోలు, ఇండస్ట్రీ వర్గాల వారు, అభిమానులు సైతం ఆశ్చర్యపోయేలా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్‌లో పెడుతున్నారు బాలయ్య. సోషల్ మీడియాతో పాటు పలు వెబ్ సైట్లలో బాలయ్య సినిమాలు, రాజకీయాలు, బసవతారకం హాస్పిటల్ గురించిన ఇంట్రెస్టింగ్ వార్తలు వైరల్ అవుతున్నాయి.

తన కెరీర్‌లో ఇప్పటివరకు 106 చిత్రాలు చేసారు బాలయ్య. ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్స్, సూపర్ హిట్స్, హిట్స్‌తో పాటు యావరేజ్, ఫ్లాప్, అట్టర్ ఫ్లాప్, డిజాస్టర్ సినిమాలు కూడా ఉన్నాయి. వాటి సంగతి పక్కన పెడితే బాలయ్య రిజెక్ట్ చేసిన ఓ పది సినిమాల గురించి ఇప్పుడు చూద్దాం.

జానకి రాముడు.. ఈ కథని మొదట స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ, బాలకృష్ణతో చేయాలనుకున్నారు. కట్ చేస్తే కొన్ని కారణాల వల్ల కోడి రామకృష్ణ ఈ సినిమా నుండి తప్పుకోవడంతో బాలయ్య కూడా దీనిని పక్కన పెట్టేశారు.

చంటి.. విక్టరీ వెంకటేష్ స్టార్ డమ్‌ని మరింత పెంచిన సినిమా.. తమిళ్‌లో ప్రభు, ఖుష్బూ జంటగా పి.వాసు తెరకెక్కించిన సూపర్ హిట్ ఫిలిం చిన్న తంబి తెలుగు రీమేక్ ఇది. ఈ చిత్రాన్ని మొదట బాలకృష్ణతో చేద్దాం అనుకున్నారు పరుచూరి బ్రదర్స్. అయితే బాలయ్యకి కథ నచ్చలేదు. తర్వాత రాజశేఖర్ తో చిత్రాన్ని రూపొందించాలనే ప్రయత్నాలు కూడా జరిగాయి. ఫైనల్‌గా వెంకీ చేయడం, బ్లాక్ బస్టర్ కొట్టడం జరిగింది.

సింహరాశి.. ఈ చిత్రాన్ని దర్శకుడు వి. సముద్ర మొదట బాలయ్యతో చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఆయన నో చెప్పడంతో రాజశేఖర్ చేసి హిట్ కొట్టారు.

సూర్యవంశం.. మొదట ఈ కథ బాలయ్య దగ్గరకు వెళ్ళింది. ఈ సినిమా కథ అంతకుముందు తను నటించి హిట్ కొట్టిన ‘పెద్దన్నయ్య’ కథని పోలి ఉందని బాలయ్య నో చెప్పారట. దీంతో వెంకీ ఈ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టారు.

శివరామరాజు.. ఇందులో హరికృష్ణ పాత్రకు ముందుగా బాలయ్యను సంప్రదిచారట. కానీ అప్పుడే ఇలాంటి రోల్స్ చేయడం తనకు ఇష్టం లేదని బాలయ్య తప్పుకున్నారట.

సింహాద్రి.. ఈ కథని బాలకృష్ణని దృష్టిలో పెట్టుకునే డెవలప్ చేసుకున్నారు రచయిత విజయేంద్ర ప్రసాద్. ఆయనే ఈ కథని డైరెక్ట్ చేయాలనుకున్నారు. కానీ బాలయ్య నో చెప్పడంతో అది దర్శకుడు రాజమౌళి వద్దకు వెళ్ళడం, జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీ హిట్ కొట్టడం జరిగిపోయింది.

అన్నవరం.. విజయ్ నటించిన తిరుప్పాచ్చి అనే ఈ తమిళ్ రీమేక్‌ను మొదట బాలయ్యతో చేయాలని పరుచూరి బ్రదర్స్ అనుకున్నారు. కానీ బాలయ్యకి ఈ కథ నచ్చకపోవడంతో పవన్ కళ్యాణ్ చేశారు.

బాడీగార్డ్.. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ మూవీని హిందీ, కన్నడ, తమిళ్ తర్వాత తెలుగులో బాలయ్యతో రీమేక్ చేయాలని ఓ నిర్మాత అనుకున్నారట. కానీ ఈ లోపే ఆ సినిమా రీమేక్ హక్కులను నిర్మాత బెల్లంకొండ సురేష్ కొనడంతో బాలయ్య తప్పుకున్నారు.

సైరా నరసింహా రెడ్డి.. ఈ కథ కొద్ది సంవత్సరాల క్రితమే బాలయ్య చేయాల్సింది. పరుచూరి బ్రదర్స్ కూడా బాలయ్య చేస్తేనే బాగుంటుందని ఆయన కోసం వెయిట్ చేశారు. తర్వాత ఎందుకో కానీ ఆయన వద్దనుకున్నారు. చాలా కాలం తర్వాత చిరంజీవి ఈ సినిమా చేశారు.

క్రాక్.. రవితేజకి కమ్ బ్యాక్ ఫిలిం.. గోపీచంద్ మలినేని మొదట ఈ సినిమాని బాలయ్యతో చేయాలనుకున్నాడు. కానీ బాలయ్యకి ఈ కథ అంతగా నచ్చలేదు. దీంతో రవితేజ చేయడం. అది బ్లాక్ బస్టర్ అవ్వడం జరిగింది. ఇదే డైరెక్టర్ గోపిచంద్ మలినేనితో బాలయ్య ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...