Home Film News JrNTR: చిరంజీవి న‌టించిన ఏ సినిమా అంటే ఎన్టీఆర్‌కి బాగా ఇష్ట‌మో తెలుసా?
Film News

JrNTR: చిరంజీవి న‌టించిన ఏ సినిమా అంటే ఎన్టీఆర్‌కి బాగా ఇష్ట‌మో తెలుసా?

JrNTR: చాలా మంది కుర్ర హీరోల‌కి స్పూర్తిదాయ‌కం మెగాస్టార్ చిరంజీవి. ఆయ‌న న‌టించిన సినిమాలు చూసి చాలామంది హీరోలు కావాల‌ని అనుకున్నారు. చిరు యాక్టింగ్, స్టైల్‌, డ్యాన్స్ ఇలా ప్ర‌తి ఒక్క‌టి అభిమానుల‌ని ఎంత‌గానో మెప్పిస్తుంది. చిరంజీవిని చూసి ఆయ‌న ఫ్యామిలీ నుండే కాకుండా బ‌య‌ట వారు కూడా హీరోలుగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యారు. వారు ఇదే విష‌యాన్ని పలు సంద‌ర్భాల‌లో చెప్పుకొచ్చారు. ఇక చిరంజీవి న‌టించిన కొన్ని సినిమాలంటే త‌మ‌కు చాలా ఇష్ట‌మ‌ని చెప్పిన సంద‌ర్భాలు లేక‌పోలేదు. జూనియర్‌ ఎన్టీఆర్‌… ఓ సంద‌ర్భంలో మెగాస్టార్‌ చిరంజీవిని పొగడ్తలో ముంచెత్తుతూ.. ఆయ‌న న‌టించిన సినిమాల్లో తనకు ‘రుద్రవీణ’ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు.

నాకు ‘దాన వీర సూర కర్ణ’ సినిమా అంటే ఎంతో ఇష్టం. అందుకు కార‌ణం అది మహాభారతం నుంచి వచ్చింది. కర్ణుడు, దుర్యోదనుడి మధ్య స్నేహం చాలా బాగుంటుంది. ఆ సినిమాలో తాతగారు మూడు క్యారెక్టర్లతో పాటు సినిమాకు డైరెక్షన్‌ కూడా చేయ‌డం గొప్ప విష‌యం. అంతేకాదు! కర్ణుడు, దుర్యోదనుడి మధ్య ఫిక్షనల్‌ స్నేహాన్ని కూడా సృష్టించ‌డం నాకు ఎంతో న‌చ్చింది. ఇక చిరంజీవి గారి రుద్రవీణ అంటే కూడా చాలా ఇష్టం. ఎందుకంటే.. ఆయన ఓ స్టార్‌ అయిండి కూడా.. అలాంటి సినిమా చేసేందుకు ముందు వ‌చ్చారు. ఓ నటుడికి ఉండాల్సిన తృష్ణ అది అని ఎన్టీఆర్ అన్నారు.

 

మనలోని నటుడ్ని సంతృప్తిపరచటం చాలా కష్టమైన పని అంటూ ఎన్టీఆర్.. చిరంజీవిని ఆకాశానికి ఎత్తాడు. కేవలం జూనియర్‌ ఎన్టీఆరే కాదు.. నందమూరి ఫ్యామిలీకి చెందిన చాలా మంది కూడా చిరంజీవితో పాటు ప‌లువురు మెగా హీరోల‌ని ప్ర‌శంసించిన సంద‌ర్భాలు అనేకం. ప్ర‌స్తుతం మెగా, నంద‌మూరి కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ క‌లిసి ట్రిపుల్ ఆర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇక ఆ మ‌ధ్య అన్‌స్టాప‌బుల్ షో కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ,బాల‌కృష్ణ ఒకే వేదిక‌పై సందడి చేయ‌డం మ‌నం చూసాం.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...