Home Film News Mahesh Babu: జోరు పెంచిన మ‌హేష్ బాబు.. నెల రోజుల పాటు గుంటూరు కారంతో బిజీ..!
Film News

Mahesh Babu: జోరు పెంచిన మ‌హేష్ బాబు.. నెల రోజుల పాటు గుంటూరు కారంతో బిజీ..!

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మ‌హేష్ బాబు సినిమాల జోరు పెంచారు. చివరిగా ఆయ‌న న‌టించిన స‌ర్కారు వారి పాట చిత్రం మంచి విజ‌యం సాధించ‌డంతో ఇప్పుడు అదే ఉత్సాహంతో త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌కత్వంలో గుంటూరు కారం అనే మాస్ టైటిల్‌తో  ఓ సినిమా చేస్తున్నారు. టైటిల్ బట్టి ఈ మూవీ అవుట్ అండ్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉంటుంద‌ని అంద‌రు భావిస్తున్నారు.ఇక ఈ సినిమా త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ బాబు  పాన్ వరల్డ్ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్  శ‌ర‌వేగంగా జరుగుతోంది.  ఈ ఏడాది ఆఖరుకి మూవీని ప్రారంభించి వ‌చ్చే ఏడాది వేసవి లోపు చిత్రాన్ని సెట్స్ పైకి వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

గుంటూరు కారం అనే సినిమా దాదాపు 12 ఏళ్ల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో చిత్రంపై  భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే తో పాటు  మరో హీరోయిన్ గా శ్రీలీల క‌థానాయిక‌గా నటిస్తుంది. ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్. అయితే మ‌హేష్ బాబు ఇటీవ‌ల త‌న ఫ్యామిలీతో స‌మ్మ‌ర్ వెకేష‌న్‌కి వెళ్ల‌డంతో  చిత్ర షూటింగ్ కాస్తా పెండింగ్ పడిపోయింది. అయితే హైద‌రాబాద్ వ‌చ్చి చాలా రోజులు అవుతున్నా కూడా ఎండలుఎక్కువగా ఉండటంతో  షూటింగ్ స్టార్ట్ చేయలేకపోయారు.

సంక్రాంతిని టార్గెట్ గా పెట్టుకురని ఈసినిమా షూటింగ్ ఇన్నాళ్లు న‌త్త‌న‌డ‌క‌న సాగింది. ఇక ఇప్పుడు జోరు పెంచి వీలైనంత త్వ‌ర‌గా షూటింగ్ పూర్తి చేయ‌నున్నార‌ని తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం గుంటూరు కారం సినిమా షూటింగ్  మేజర్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారట. ఈ షెడ్యూల్ అనేది జూన్ 12 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. దాదాపుగా నెల రోజుల పాటు ఈ షెడ్యూల్  హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో  నాన్ స్టాప్ గా జ‌ర‌పనున్నారని టాక్. ఈ షెడ్యూల్‌తో  దాదాపు సినిమాలో మేజర్ పార్ట్ కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడ‌ట త్రివిక్ర‌మ్. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తైన త‌ర్వాత అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంలోసినిమా చేయ‌నున్నాడు మ‌హేష్. ఇందులో  వరల్డ్ అడ్వంచర్ ట్రావెలర్ గా  క‌నిపించ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...