Home Film News Klin Kaara Gift: చెర్రీ కూతురికి బ‌న్నీ దంప‌తులు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది…!
Film News

Klin Kaara Gift: చెర్రీ కూతురికి బ‌న్నీ దంప‌తులు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది…!

Klin Kaara Gift: దాదాపు ప‌ద‌కొండేళ్ల త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌ల‌కి పండంటి ఆడ‌బిడ్డ జ‌న్మ‌నివ్వ‌డంతో మెగా ఇంట ఆనందం అంతా ఇంతా కాదు. జూన్ 20న ఉపాస‌న పాప‌కి జ‌న్మ‌నిచ్చింద‌నే వార్త బ‌య‌ట‌కు రావ‌డంతో మెగా ప్రిన్సెస్ పేరు దేశమంతా మారుమ్రోగింది.పాప‌ని చూడాల‌ని అభిమానులు ఎంతో ఆశ‌ప‌డ‌గా, ఫేస్ క‌నిపించ‌కుండానే ఆసుప‌త్రి నుండి క్లింకార‌ని ఇంటికి తీసుకెళ్లారు.ఇక పాపని కంటికి రెప్ప‌లా చూసుకుంటున్నారు ఉపాస‌న దంప‌తులు. తమ కుమార్తె అత్యుత్తమ‌మైన‌ వాతావరణంలో పెరిగేలా ఉపాసన, చరణ్ ప్ర‌త్యేక‌మైన జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. చిన్నారి క్లీంకార కోసం ఒక ప్రత్యేక గదిని బెస్ట్ ఇంటీరియర్ డిజైన్ తో రెడీ చేయించారు ఉపాస‌న ,రామ్ చ‌ర‌ణ్‌.

రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కుమార్తె పుట్టగానే సినిమా ఇండ‌స్ట్రీకి సంబంధించిన చాలా మంది ప్ర‌ముఖులు ప్ర‌త్యేక‌మైన గిఫ్ట్స్ పంపార‌ట‌. కొంద‌రి పేర్లు అయితే బ‌య‌ట‌కు రాలేదు. తాజాగా అల్లు హీరో బ‌న్నీ  క్లీంకారకి చాలా కాస్ట్లీ గిఫ్ట్  ఇచ్చార‌ట‌. అల్లు అర్జున్,త‌న స‌తీమ‌ణి రామ్ చ‌ర‌ణ్ ఇంటికి వెళ్లి ఆ ప్ర‌త్యేక‌మైన గిఫ్ట్ అందించార‌ట‌. ఇంత‌కు ఆ ప్ర‌త్యేక‌మైన గిఫ్ట్ ఏంటంటే.. బంగారంతో చేయించిన నేమ్ ప్లేట్. నేమ్ ప్లేట్‌లోని అక్ష‌రాలన్నీ కూడా బంగారంతో చేయించగా,  చుట్టూ డైమండ్స్ కూడా డిజైన్ చేశారట.ఇలా అల్లు అర్జున్.. రాంచరణ్ కుమర్తెకి ఎప్పటికి గుర్తుండిపోయే గిఫ్ట్  ఇవ్వ‌డంతో ఇరువురి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పెళ్ళైన చాలా కాలం తర్వాత బిడ్డ పుట్టిన నేప‌థ్యంలో ఆ చిన్నారిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఇటీవ‌ల ఉపాస‌న  తాము త‌మ మామ‌య్య అయిన చిరంజీవి ఇంటికి వెళ‌తామ‌ని కొద్ది రోజుల పాటు అక్క‌డే ఉంటామ‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. సినిమాల విష‌యానికి వ‌స్తే అల్లు అర్జున్ ప్ర‌స్తుతం పుష్ప‌2 చిత్రంతో బిజీగా ఉన్నాడు. రామ్ చ‌ర‌ణ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో గేమ్ ఛేంజ‌ర్ అనే చిత్రం చేస్తున్నాడు. ఆ త‌ర్వాత బుచ్చిబాబు డైరెక్ష‌న్‌లో మూవీ చేయ‌నున్నాడు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...