Home Film News Samantha: త‌న ట్రీట్‌మెంట్ కోసం స‌మంత ఆ హీరో ద‌గ్గ‌ర అన్ని కోట్లు అప్పు చేసిందా?
Film News

Samantha: త‌న ట్రీట్‌మెంట్ కోసం స‌మంత ఆ హీరో ద‌గ్గ‌ర అన్ని కోట్లు అప్పు చేసిందా?

Samantha: నాగ చైత‌న్య నుండి విడాకులు తీసుకున్న స‌మంత అప్ప‌టి నుండి నిత్యం ఏదో  ర‌కంగా వార్త‌ల‌లో నిలుస్తూనే ఉంది.ఆమె సినిమాలు, ఆరోగ్యం, విహార యాత్ర‌లు ఇలా ప‌లు ర‌కాలుగా హాట్ టాపిక్ అవుతుంది. ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న స‌మంత ఏడాది పాటు  సినిమాలకు  విరామం ప్రకటించింది  ప్ర‌స్తుతం త‌న ఫ్రెండ్స్‌తో క‌లిసి జాలీగా ఎంజాయ్ చేస్తుంది. వెకేష‌న్ త‌ర్వాత త‌న వైద్యం కోసం అమెరికాకి వెళ్ల‌నుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. కొద్ది నెల‌ల క్రితం స‌మంత మ‌యోసైటిస్ అనే వ్యాధి బారిన ప‌డ‌గా, ఆ స‌మ‌యంలో కూడా కొద్ది రోజుల పాటు సినిమాల‌కి బ్రేక్ ఇచ్చింది. కోలుకున్న త‌ర్వాత త‌ను క‌మిటై సినిమా షూటింగ్స్ పూర్తి చేసింది.

ఇప్పుడు మ‌యోసైటిస్ స‌మంత‌ని వేధిస్తూనే ఉంది. ఈ క్ర‌మంలో  లాంగ్ టైమ్ ట్రీట్మెంట్ ను తీసుకోవడానికి   యూఎస్  వెళ్ళబోతుంద‌ని స‌మాచారం.  ఈ వ్యాధికి ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంటే భారీగానే డ‌బ్బు ఖ‌ర్చు చేయ‌వ‌ల‌సి ఉంటుంది. అందుకోసం స‌మంత  ఓ స్టార్ హీరో ద‌గ్గ‌ర పాతిక కోట్లు అప్పు చేసింద‌ని ఇన్‌సైడ్ టాక్. అయితే స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న స‌మంత పాతిక కోట్ల కోసం అప్పు చేయ‌వ‌ల్సిన అవ‌స‌రం ఏమోచ్చింది.  15 ఏళ్ల కెరీర్‌లో ఆ మాత్రం సంపాదించి ఉండ‌దా, అంటూ కొంద‌రు చ‌ర్చ జ‌రుపుతున్నారు.

స‌మంత సినిమాల‌తో పాటు  సొంతంగా గార్మెంట్  బిజినెస్   కూడా చేస్తుంది.ఈ క్ర‌మంలో ఆమె బాగానే వెన‌కేసి ఉంటుంద‌ని, అప్పు చేసింద‌నే వార్త‌లు అవాస్త‌వాలు అని కొంద‌రు కామెంట్స్  చేస్తున్నారు.  స‌మంత‌పై ఇలా ఎన్నో త‌ప్పుడు ప్ర‌చారాలు సాగుతున్నా కూడా తాను ఏ మాత్రం స్పందించ‌కుండా త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతుంది. ఇక స‌మంత సినిమాల విష‌యానికి వ‌స్తే విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన ఖుషీ చిత్రంలో క‌థానాయికగా న‌టించింది. చిత్రంలో వీరిద్ద‌రి రొమాన్స్ పీక్స్ లో ఉంటుంద‌ని అర్ధ‌మ‌వుతుంది.ఇక సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌తో కూడా స‌మంత ప్రేక్ష‌కుల‌ని అలరించుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...