Home Film News Movie Crew: ఇది మ‌రీ దారుణం.. ఆ సినిమాలో న‌టించిన అంత‌మంది అలా ఎలా చ‌నిపోయారు..!
Film News

Movie Crew: ఇది మ‌రీ దారుణం.. ఆ సినిమాలో న‌టించిన అంత‌మంది అలా ఎలా చ‌నిపోయారు..!

Movie Crew: వెండితెర‌పై త‌మ న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ని మెప్పించిన న‌టీన‌టులు కొన్నాళ్ల‌కి అనారోగ్యంతోనో లేదంటే ఇత‌ర కార‌ణాల వ‌ల్ల‌నో క‌న్నుమూస్తూ ఉంటారు. అయితే వారు లోకాన్ని విడిచిపోయిన కూడా సినిమాల‌తో ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌లో  చెర‌గ‌ని ముద్ర వేసుకుంటారు. అలా తెలుగు తెర‌పై చెర‌గ‌ని ముద్ర వేసుకున్న ఉద‌య్ కిర‌ణ్, ఎమ్మెస్ నారాయ‌ణ‌, ధ‌ర్మ‌వ‌ర‌పు సుబ్ర‌హ్మ‌ణ్యం , వైజాగ్ ప్రసాద్ వంటి వారు నువ్వు నేను అనే సినిమాలో క‌లిసి న‌టించారు. వారు కొన్నేళ్ల క్రితం లోకాన్ని విడిచి వెళ్లారు. వీరి మ‌ర‌ణం సినీ ప‌రిశ్రమ‌కి తీర‌ని లోటు అని చెప్పాలి.
తేజ దర్శకత్వంలో 2001లో వ‌చ్చిన నువ్వు  నేను చిత్రం ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సూప‌ర్ హిట్ కావ‌డ‌మే కాకుండా అనేక అవార్డ్‌ల‌ని కూడా తీసుకొచ్చింది. తేజ‌కి అయితే ఏకంగా నంది అవార్డ్ కూడా ద‌క్కంది. ఇక  నాలుగు ఫిల్మ్ ఫెయిర్ అవార్డులుఈ సినిమా  రావడం హిస్టరీ అనే చెప్పాలి. ఈ సినిమాతో ఉద‌య్ కిర‌ణ్ స్టార్ హీరోగా మారాడు.  లవర్ బాయ్ గా అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్న ఉద‌య్ కిర‌ణ ప‌లు స‌మ‌స్య‌ల వ‌ల‌న ఆత్మ‌హ‌త్య చేసుకొని చ‌నిపోయాడు. ఆయ‌న చ‌నిపోయి చాలా రోజులు అవుతున్నా ఏదో ఒక సంద‌ర్భంలో అభిమానులు ఆయ‌న‌ని గుర్తు చేసుకుంటూనే ఉంటారు
నువ్వు నేను చిత్రంలో  ఉదయ్ కిరణ్ తో పాటు ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం కీల‌క పాత్ర‌లు పోషించారు. వీరిద్ద‌రు పంచిన కామెడీ ప్రేక్ష‌కుల‌కి ఎంత‌గానో న‌చ్చేసింది. అయితే వారు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో కన్నుమూసిన విష‌యం తెలిసిందే. ఇక చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన  ఆహుతి ప్రసాద్, ఉదయ్ కిరణ్ తండ్రి పాత్ర పోషించినటువంటి వైజాగ్  ప్రసాద్ కూడా కొన్నేళ్ల క్రితం కన్ను మూశారు. ఇలా ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన  ఇంత మంది స్టార్ నటులు మ‌నల్ని వీడి వెళ్ల‌డం ప్ర‌తి ఒక్క‌రిని బాధిస్తుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...