Home Film News Ram Charan Daughter: వామ్మో.. రామ్ చ‌ర‌ణ్ కూతురిని చూడాలంటే అన్నీ కండీష‌న్సా..!
Film News

Ram Charan Daughter: వామ్మో.. రామ్ చ‌ర‌ణ్ కూతురిని చూడాలంటే అన్నీ కండీష‌న్సా..!

Ram Charan Daughter: మెగాస్టార్  చిరంజీవి త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్‌.. ఉపాస‌న‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. వీరి వివాహం అప్పట్లోనే చాలా గ్రాండ్‌గా జరిపారు. ఇక వీరు వివాహం చేసుకున్న 11 ఏళ్ల‌కి   కూతురు పుట్టడంతో మెగా ఫ్యామిలీతోపాటు మెగా అభిమానులు కూడా సంబరాలు చేసుకున్నారు. చిరంజీవి ఫ్యామిలీకి ఇష్టమైన మంగళవారమే పాప జన్మించడంతో వారి ఆనందం అంతా ఇంత కాదు. జూన్ 20న చ‌ర‌ణ్ దంప‌తులకి పాప పుట్ట‌గా, జూన్ 30న బార‌సాల వేడుక నిర్వ‌హించారు. ఆ రోజు పాప‌కి పేరు పెట్టి అంద‌రికి తెలియ‌జేశారు.  రామ్ చరణ్, ఉపాసన కూతురి పేరు క్లింకారా గా పెట్టిన‌ట్టు చిరంజీవి మొదట త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు.

ఈ పేరు చాలా మోడ్ర‌న్‌గా ఉండ‌డంతో పాటు స‌రికొత్త‌గా అనిపించడంతో దీనిపై కూడా క్లారిటీ ఇచ్చారు. లలిత సహస్రనామాల నుంచి పేరుని తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. క్లీమ్ కారా అంటే ప్రకృతి స్వరూపానికి ప్రతీక అని,  సాక్షాత్తు మహా శక్తిని ప్రతిబింబిస్తుంది అని చెప్పుకొచ్చారు.  పేరులో పవర్ ఫుల్ వైబ్రేషన్ ఉన్న‌ట్టు చిన్నారిలో ఆ లక్షణాలు ప్రతిబింబిస్తున్నాయని కచ్చితంగా చెప్పొచ్చు అంటూ  చిరంజీవి త‌న ట్వీట్‌లో తెలిపారు.అయితే ఇప్ప‌టి వ‌ర‌కు క్లింకారా ఫేస్ బ‌య‌ట‌కు రివీల్ చేయ‌లేదు. ఎవ‌రి పోలిక ఉంటుందా అని ఆరాలు తీసే ప‌నిలో ప‌డ్డారు అభిమానులు. ఆ మ‌ధ్య ప్రెస్ మీట్‌లో రామ్ చ‌రణ్ త‌న తండ్రి మాదిరిగానే ఉంటుంద‌ని అన్నారు.

ఇక ఎన్నో రోజుల నుండి మెగా వార‌సురాలి కోసం ఎదురు చూస్తుండ‌గా, జూన్ 20న పాప పుట్టింది. జూన్ 23న ఉపాస‌న ఆసుప‌త్రి నుండి డిశ్చార్జ్ అయింది. ఇక మెగా ప్రిన్సెస్ ని చూడాల‌ని వారి స‌న్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఉపాస‌న ఇంటికి క్యూ క‌డుతున్నార‌ట‌. అయితే వారెవ‌రికి పాప‌ని చూపించ‌డం లేద‌ని తెలుస్తుంది. దగ్గర బంధువులైన సరే పాపను దూరం నుండి చూపిస్తున్న‌రే త‌ప్ప‌, చేతికి ఇవ్వ‌డం లేద‌ట . క్లీంకార ను సెపరేట్గా ఒక రూమ్ లో పెట్టి స్పెష‌ల్ కేర్ తీసుకుంటున్నారట . అంతేకాదు మెగా మనవరాళ్ళను సైతం క్లింకార ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ఆడుకోవ‌ద్ద‌ని రూల్స్ కూడా పాస్ చేసింద‌ట‌. ఇందులో నిజ‌మెంత ఉందో తెలియ‌దు కాని, నిజంగా ఇన్ని కండీష‌న్స్ పెట్ట‌డం దారుణం అని మ‌రి కొంద‌రు వాపోతున్నారు.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...