Home Film News Lavanya Tripathi: లావ‌ణ్య త్రిపాఠి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. వారు ఎక్క‌డి వారు?
Film News

Lavanya Tripathi: లావ‌ణ్య త్రిపాఠి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. వారు ఎక్క‌డి వారు?

Lavanya Tripathi: మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌తో నిశ్చితార్థం జ‌రుపుకున్న లావ‌ణ్య త్రిపాఠి ఇప్పుడు మెగా కోడ‌లిగా మారింది. దీంతో ఒక్క‌సారిగా ఈ అమ్మ‌డు హాట్ టాపిక్‌గా మారింది. లావ‌ణ్య త్రిపాఠి మొద‌టి సినిమా ఏంటి, ఏయే భాష‌ల‌లో న‌టించింది, ఆమె త‌ల్లిదండ్రులు ఎవ‌రు, ఏం చేస్తుంటారు, ఆమె ఎక్క‌డ పుట్టింది వంటి వివ‌రాలు వెత‌క‌డం మొద‌లు పెట్టారు. లావ‌ణ్య త్రిపాఠి తొలిసారిగా హను రాఘవపూడి దర్శక‌త్వంలో తెర‌కెక్కిన‌ ‘అందాల రాక్షసి’ చిత్రం ద్వారా హీరోయిన్ గా డెబ్యూ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో ‘దూసుకెళ్తా’ ‘భలే భలే మగాడివోయ్’ ‘సోగ్గాడే చిన్ని నాయన’ ‘శ్రీరస్తు శుభమస్తు’ ‘మిస్టర్’ ‘రాధా’ ‘యుద్ధం శరణం’ ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ ‘ఇంటిలిజెంట్’ ‘అంతరిక్షం’ ‘అర్జున్ సురవరం’ ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ ‘చావు కబురు చల్లగా’ ‘హ్యాపీ బర్త్ డే’ వంటి
సినిమాలు చేసింది.

లావ‌ణ్య త్రిపాఠి కెరియ‌ర్‌లో పెద్ద‌గా సక్సెస్‌లు లేక‌పోయిన కూడా చేసిన చిత్రాలు ఆమెకి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు తెచ్చిపెట్టాయి. ఈ అమ్మ‌డు ఎప్పుడు కూడా  హద్దులు మించిన అందాలు ఆర‌బోయ‌లేదు. ఈ క్ర‌మంలో మెగా ఫ్యామిలీ కూడా లావ‌ణ్య త్రిపాఠిని కోడ‌లిగా అంగీక‌రించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. 2016 లో వరుణ్ తేజ్ తో ప్రేమలో పడిన లావ‌ణ్య త్రిపాఠి గ‌తంలో ఎప్పుడు కూడా దీని గురించి స్పందించ‌లేదు.సైలెంట్‌గా జూన్ 9న నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఏడాది చివ‌రిలో పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్నారు. ఈ క్ర‌మంలో  లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే విషయం పై కూడా చ‌ర్చ మొద‌లైంది. 1995 డిసెంబర్ 15 న ఉత్తర్ ప్రదేశ్ లోని ఫైజాబాద్ లో జన్మించింది లావణ్య త్రిపాఠి.

ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ఈ అమ్మ‌డు పెరిగింది. లావ‌ణ్య తండ్రి ఓ లాయర్ కాగా,  తల్లి టీచర్, ఇక‌ ఆమె అక్క కమిషనర్..! లావణ్య కి ఓ సోదరుడు కూడా ఉన్నాడు. డెహ్రాడూన్ లో స్కూలింగ్ పూర్తి అయ్యాక ముంబైలోని రిషి దయారామ్ నేషనల్ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది లావణ్య త్రిపాఠి. అయితే ఆమె కుటుంబంలో వారంతా వేరు వేరు వృత్తుల‌లో ఉండ‌డం వ‌ల‌న  తాను మోడలింగ్ రంగంలో అడుగుపెట్టాలని, సినిమాల్లో రాణించాలని అనుకున్న‌ట్టు ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది.త‌ను సినిమాల‌లోకి వ‌స్తాన‌ని చెప్పిన‌ప్పుడు కుటుంబ స‌భ్యులు నిరాక‌రించ‌లేద‌ని, త‌న‌ని వాళ్లు బాగా న‌మ్ముతార‌ని కూడా చెప్పుకొచ్చింది లావ‌ణ్య‌.  మొత్తానికి లావ‌ణ్య ఇప్పుడు మెగా కోడ‌లి ప్ర‌మోష‌న్ అందుకొని గొప్ప స్థానాన్ని ద‌క్కించుకుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...