Home Film News Lavanya Tripathi: ఎంగేజ్‌మెంట్‌లో లావ‌ణ్య త్రిపాఠి క‌ట్టుకున్న చీర ధ‌ర ఎంతో తెలిస్తే బిత్త‌రపోతారు..!
Film News

Lavanya Tripathi: ఎంగేజ్‌మెంట్‌లో లావ‌ణ్య త్రిపాఠి క‌ట్టుకున్న చీర ధ‌ర ఎంతో తెలిస్తే బిత్త‌రపోతారు..!

Lavanya Tripathi: టాలీవుడ్ సినీ ఇండ‌స్ట్రీలో న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ లావ‌ణ్య త్రిపాఠి.చూడ చ‌క్క‌ని అందంతో పాటు ఆక‌ట్టుకునే అభిన‌యంతో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది ఈ ముద్దుగుమ్మ‌. కెరీర్‌లో వైవిధ్య‌మైన సినిమాలు చేసిన‌ప్ప‌టికీ ఈ అమ్మ‌డు స్టార్ హీరోయిన్ రేస్‌లో నిల‌వ‌లేక‌పోయింది. కాకపోతే ఎక్కువగా గ్లామర్ డోస్ దట్టించకుండా కేవ‌లం తన నటనతోనే ప్రేక్షకుల మనసు దోచేసింది. హను రాఘవపూడి దర్శకుడిగా పరిచయమవుతూ తెర‌కెక్కించిన‌ ‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై వారి మ‌న‌సుల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంది ఈ నార్త్ ఇండియ‌న్ భామ‌.

అందాల రాక్ష‌సి సినిమా త‌ర్వాత లావ‌ణ్య త్రిపాఠి దూసుకెళ్తా, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన, శ్రీరస్తు శుభమస్తు, మిస్టర్, రాధా, యుద్ధం శరణం, ఉన్నది ఒక్కటే జిందగీ, ఇంటిలిజెంట్, అంతరిక్షం, అర్జున్ సురవరం, ఏ1 ఎక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా, హ్యాపీ బర్త్ డే లాంటి సినిమాల‌లో నటించింది. అయితే ఈ అమ్మ‌డు గ‌త ఏడేళ్లుగా మెగా హీరో వ‌రుణ్ తేజ్‌తో ప్రేమ‌లో ఉంది. జూన్ 9న వీరి నిశ్చితార్థం జ‌ర‌గ‌గా ఏడాది చివ‌ర‌లో వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకుని మెగా వారి ఇంట్లో అడుగుపెట్టనుంది లావణ్య త్రిపాఠి. అయితే వీరి నిశ్చితార్థ వేడుక చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఎంగేజ్మెంట్ వేడుకలో లావణ్య చీర‌కట్టులో మెరిసిపోయింది

చీరలో ఆమె మరింత అందంగా కనిపించే స‌రికి ప్ర‌తి ఒక్క‌రి దృష్టి ఆమెపైనే ప‌డింది. వరుణ్ తేజ్ కుర్తా పైజామా ధరిస్తే, లావణ్య త్రిపాఠి ఆకుపచ్చ రంగు బనారస్ చీర ధరించి అంద‌రి దృష్టి ఆక‌ర్షించింది. అయితే ఎంగేజ్‌మెంట్‌లో లావ‌ణ్య త్రిపాఠి ధ‌రించిన చీర ఖ‌రీదు ఎంత‌నే విష‌యంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తుంది. ఈ క్ర‌మంలోనే కొంద‌రు ఆమె చీర ధర అక్షరాల రూ. 75వేల రూపాయలు అని అంటున్నారు. దీనిని అనితా డోంగ్రే అనే ఫ్యాషన్ డిజైనర్ డిజైన్ చేశారట‌. మెగా ఇంటికి కోడలు కాబోతున్న లావణ్య త్రిపాఠి లక్ష రూపాయల చీర ధరించినా తక్కువే అవుతోందని కొంద‌రు మెగా అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...