Home Film News Allu Arjun: అల్లు అర్జున్ థియేటర్ ఓపెనింగ్‌కి ముహూర్తం ఖ‌రారు..గెస్ట్ ఎవ‌రంటే..!
Film News

Allu Arjun: అల్లు అర్జున్ థియేటర్ ఓపెనింగ్‌కి ముహూర్తం ఖ‌రారు..గెస్ట్ ఎవ‌రంటే..!

Allu Arjun: ప్ర‌స్తుతం మ‌న హీరోలు ఒక‌వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు బిజినెస్‌ల‌పై దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా థియేట‌ర్ బిజినెస్‌లు చేయ‌డం అందరిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మహేష్ బాబు ఏషియన్ సినిమాస్‌తో కలిసి ఏఎంబీ అనే మ‌ల్టీ ప్లెక్స్ స్థాపించాడు. ఇప్పుడ‌ది ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీప్లెక్సులలో ఒకటిగా మారింది. మ‌హేష్ బాబు త‌ర్వాత యువ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా ఏషియన్ సినిమాస్ వారితో క‌లిసి త‌న సొంత పట్టణం మహబూబ్‌నగర్‌లో ఏవీడీ సినిమాస్ పేరుతో కొత్త థియేట‌ర్ లాంచ్ చేశాడు.ఇక ప్ర‌భాస్, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్ వంటి వారు కూడా మల్టీప్లెక్స్ బిజినెస్ చేస్తూ రాణిస్తున్నారు.

 


అయితే ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ థియేట‌ర్ బిజినెస్ లోకి అడుగుపెట్టాడు. ఆయ‌న కూడా ఏషియన్ సినిమాస్‌తో కలిసి AAA సినిమాస్ అనే మల్టీ ప్లెక్స్ రూపొందించ‌గా, ఇది త్వ‌ర‌లోనే గ్రాండ్ లాంచ్ కానుంది. ఇప్ప‌టికే ఈ థియేట‌ర్ లాంచింగ్‌కి సంబంధించి అనేక ప్ర‌చారాలు సాగాయి. అయితే జూన్ 15న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి అల్లు అర్జున్ AAA ‘సత్యం మల్టీప్లెక్స్ ను ప్రారంబించబోతున్న‌ట్టుగా యాజ‌మాన్యం స్ప‌ష్టం చేశారు. ఈ మల్టీప్లెక్స్ కోసం పూర్తిగా అల్లు అర్జున్ ఇమేజ్ వాడుకుంటుంది ఏషియన్ సినిమాస్. ఆయన ఫోటోతోనే AAA లోగో కూడా విడుదల చేయ‌డం మ‌నం చూశాం.

ఈ థియేట‌ర్‌లో ఏ సినిమా విడుద‌ల కాబోతుంద‌నే ఆస‌క్తి అంద‌రిలో ఉంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ప్రభాస్‌ భారీ పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్ స్క్రీనింగ్ చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం అందుతుంది. అత్యాధునిక టెక్నాల‌జీతో థియేట‌ర్‌ని నిర్మించ‌గా, ఇందులో న‌డిచే ప్ర‌తి సినిమా కూడా ప్రేక్ష‌కుల‌కి స‌రికొత్త అనుభూతిని పంచుతుంద‌ని అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం పుష్ప 2 అనే భారీ బ‌డ్జెట్ చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీని ఏఏఏ సినిమాస్‌లో చూడాల‌ని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఉన్నారు. పుష్ప‌తో భారీ హిట్ కొట్టిన బ‌న్నీ పుష్ప‌2 చిత్రంతో ఇండ‌స్ట్రీ రికార్డులు తిర‌గ‌రాయ‌బోతున్నాడ‌ని

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...