Home Film News Sai Pallavi: చిరంజీవికే కాదు ప్ర‌భాస్ సినిమాను చేయ‌న‌న్న సాయి ప‌ల్లవి.. మ‌రీ అంత‌నా?
Film News

Sai Pallavi: చిరంజీవికే కాదు ప్ర‌భాస్ సినిమాను చేయ‌న‌న్న సాయి ప‌ల్లవి.. మ‌రీ అంత‌నా?

Sai Pallavi: లేడీ ప‌వ‌ర్ స్టార్ సాయి ప‌ల్లవి గురించి ప్రేక్ష‌కులకి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న న‌ట‌న‌తో,డ్యాన్స్‌తో ఎంతో మంది ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకుంది. సాయి ప‌ల్లవి మంచి క‌థాంశం ఉన్న స‌బ్జెక్ట్‌లనే ఎంపికచేసుకుంటూ సినిమాలు చేస్తుంది. క‌థ లేక‌పోతే ఎంత పెద్ద హీరో సినిమా అయిన ఇట్టే రిజెక్ట్ చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి న‌టించిన భోళా శంకర్ చిత్రాన్ని సాయి ప‌ల్లవి సింపుల్‌గా రిజెక్ట్ చేసిన విష‌యం తెలిసిందే. భోళా శంకర్ చిత్రంలో కీర్తి సురేష్ పోషించిన పాత్ర‌ల‌కి  ముందుగా సాయి పల్లవికి ఆఫర్ చేయ‌గా,ఆమె నో చెప్పడం పెద్ద హాట్ టాపిక్ అయింది. చిరంజీవి సినిమాకే సాయి పల్లవి నో చెప్పిందా  అంద‌రు ఆశ్చ‌ర్య‌పోయారు.  లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి త‌న‌ ప్రసంగంలో ఆ మ్యాటర్ బయటకు తీసుకురాగా, దానికి సాయి ప‌ల్లవి కూడా స్పందించింది.

భోళా శంక‌ర్ చిత్రంలో సిస్ట‌ర్ పాత్ర కోసం సాయి ప‌ల్ల‌విని రిఫర్ చేస్తే ఆమె నో చెప్పింది, అందుకు కార‌ణం ఏంటో తెలియ‌దు. అయితే ఆమె  పక్కన అన్నగా చేయాలని నేను అనుకోలేదు. అలాంటి అమ్మాయి పక్కన హీరోగా డ్యాన్సులు వేయాలని అనుకుంటున్నాను అని చిరంజీవి చెబుతుండగానే.. మధ్యలో సాయి పల్లవి మైకు అందుకొని.. నేను సినిమాను చేయను అని చెప్పలేదు స‌ర్ . నాకు రీమేక్ అంటే చాలా భయం. అందుకే నో చెప్పాను అని పేర్కొంది.అయితే సాయి ప‌ల్ల‌వి ఇప్పుడు ప్ర‌భాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ సినిమాకి కూడా నో చెప్పిన‌ట్టు తెలుస్తుంది. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం మారుతి ద‌ర్శ‌కత్వంలో రాజా డీల‌క్స్ అనే చిత్రం చేస్తున్నాడు.

రాజా డీల‌క్స్ మూవీలోని ఒక పాత్ర కోసం మేక‌ర్స్ సాయి ప‌ల్ల‌విని సంప్ర‌దించ‌గా, ఆమె నో చెప్పింద‌ట‌. క‌థ‌లో త‌న పాత్ర‌కు ఎలాంటి ప్ర‌ధాన్య‌త లేద‌ని నేను చేయ‌లేన‌ని మొహ‌మాటం లేకుండా చెప్పేసింద‌ట‌. దీంతో ప్ర‌భాస్ లాంటి స్టార్ హీరో సినిమాకి ఆమె నో చెప్ప‌డ‌మేంట‌ని అంద‌రు షాక‌వుతున్నారు.  గ‌తంలో కూడా ఇలాంటి కార‌ణాల‌తోనే సాయి ప‌ల్ల‌వి ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌ని వ‌దిలేసుకుంది. ఇప్పుడు ప్ర‌భాస్ మూవీని కూడా రిజెక్ట్  చేయ‌డంతో రానున్న రోజుల‌లో ఆమె ఎక్కువ సినిమాలు చేయ‌లేద‌ని కొంద‌రు చెబుతున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...